పశ్చిమగోదావరి

కుటుంబంలో ఎవరొచ్చినా రేషన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మార్చి 22: జిల్లాలో త్వరలో 25 లక్షల మంది రేషన్ కార్డుదారులకు బెస్ట్ ఫింగర్ డిటెక్షన్(బిఎఫ్‌డి) కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించి ఎవరు వెళ్లినా రేషన్ పొందే వెసులుబాటు కల్పిస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టరు పి కోటేశ్వరరావు చెప్పారు. స్ధానిక కలెక్టరేట్ నుండి మంగళవారం నిర్వహించిన నా రేషన్ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను ఆయన పరిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 11లక్షల 79వేల 049 రేషన్‌కార్డులలో 32.46లక్షల మంది ప్రజలు నమోదై ఉన్నారని, వారందరికి ప్రతి నెల త్వరితగతిన రేషన్ అందించడానికి ఇ-పాస్ విధానాన్ని అమలుచేస్తున్నామన్నారు. కుటుంబంలో యజమాని ఊరిలో లేకపోతే ఆ నెలలో ఆ కుటుంబం రేషన్ పొందలేకపోతోందని, ఈపరిస్ధితిని తొలగించాలనే ఉద్దేశ్యంతో రేషన్‌కార్డుల్లో ఉన్న 32.46లక్షలమంది ఫింగర్ ప్రింట్‌లను ఇ-పాస్ యంత్రాలలో నమోదుచేసి కుటుంబంలో ఎవరు వచ్చినా సరుకులు అందించే కార్యక్రమం చేపట్టామన్నారు. ఇంతవరకు 7.34లక్షల మందికి బిఎఫ్‌డి అమలుచేశామని, మిగిలినవారికి కూడా రాబోయే రోజుల్లో దీన్ని అమలుచేసి నిత్యావసర సరుకులు రాష్ట్రంలో ఎక్కడనుండైనా పొందే వెసులుబాటును కల్పిస్తామన్నారు. జిల్లాలో డేటా మ్యాచ్ కాకుండా బయోమెట్రిక్ ఫెయిల్ అయిన 6150 రేషన్‌కార్డులను ఈనెలాఖరులోగా బయోమెట్రిక్ పూర్తి చేయాలన్నారు. నారేషన్‌లో భాగంగా ఆచంట మండలం నుండి సత్యనారాయణమూర్తి ఫోన్ చేసి మాట్లాడుతూ ఇతర రేషన్ డిపోలలో రేషన్ ఇవ్వడానికి అంగీకరించటం లేదని చెప్పటంతో జిల్లాలోని కొన్ని రేషన్ డిపోలలో అధికసంఖ్యలో రేషన్ పొందటం వల్ల సకాలంలో రేషన్ లేక అందించలేకపోతున్నారని, ఈసమస్య ఇకపై ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకుంటామని జెసి తెలిపారు. నర్సాపురం నుండి ప్రసన్న అనే మహిళ ఫోన్ చేస్తూ తనకు పాప పుట్టి రెండేళ్లు అయిందని, మీసేవ ద్వారా పాప పేరు నమోదు చేయడానికి వెంటనే దరఖాస్తు చేశానని, కానీ ఇంతవరకు పేరు నమోదు చేసి రేషన్ కార్డు ఇవ్వటం లేదని చెప్పారు. దీనిపై జెసి స్పందిస్తూ ఈవిషయమై హైదరాబాద్ స్ధాయిలో కొంత సమస్య ఉందని, దీన్ని వెంటనే పరిష్కరించి కార్డు త్వరలో అందజేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పలువురు మాట్లాడుతూ రేషన్ కార్డుల్లో తమ పేర్లు లేవని, వేరే చోట నుండి జిల్లాకు బదిలీ వచ్చామని అయితే రేషన్ ఇవ్వటం లేదని, గత జన్మభూమిలో రేషన్ కార్డులు మంజూరు చేశారని ఇంతవరకు కార్డులు మాత్రం ఇవ్వలేదంటూ జెసికి ఫిర్యాదు చేశారు. వీటిపై ఆయన స్పందిస్తూ అన్ని సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత తహసిల్దార్లను ఆదేశించారు. కార్యక్రమంలో డిఎస్‌ఓ డి శివశంకర్‌రెడ్డి, సివిల్ సప్లయిస్ జిల్లా మేనేజరు రవిబాబు, ఎఎస్‌ఓ పద్మశ్రీ, చౌకడిపో డీలర్ల సంఘం నాయకులు నరసింహమూర్తి, ఇమ్మంది శంకరరావు తదితరులు పాల్గొన్నారు.