పశ్చిమగోదావరి

‘ప్రత్యేక’ న్యాయం జరగాల్సిందే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జూలై 29: తెలుగుపౌరుడికి న్యాయం జరగాల్సిందేనని రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మీ తన గళాన్ని విప్పి డిమాండ్ చేశారు. రాష్టవ్రిభజన సమయంలో ఆంధ్రులకు ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని కేంద్రప్రభుత్వం అమలుచేయాలన్నారు. శుక్రవారం రాజ్యసభలో తోట సీతారామలక్ష్మీ ఐదు నిమిషాల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై ప్రసంగించారు. ఆనాడు ప్రస్తుత కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదని పదేళ్లు కావాలని డిమాండ్ చేశారన్నారు. అయితే ఈనెల 28న అదే కేంద్రమంత్రి ప్రత్యేక హోదాను పక్కన పెడితే ఎన్‌ఐటి, వ్యవసాయ విశ్వవిద్యాలయం, రెండు ఎయిర్‌పోర్టులు ఇటువంటివి ఎన్నో ఇచ్చామని చెప్పారన్నారు. తెలుగురాష్ట్రానికి సత్తా ఉందని, ఇక్కడ బిడ్డలు చదువుకోవడానికి ఇటువంటివి ఎంతో అవసరముందని, అందుకే వాటిని కేంద్రప్రభుత్వం ఏర్పాటుచేసుకుందన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనన్నారు. ఈ హోదా ఇవ్వడం వల్ల రాష్ట్రానికి ఆదాయం పెరగడంతో పాటు పరిశ్రమలు రావడం, పెట్టుబడి దారులు ఇక్కడకు వస్తారన్నారు. గడిచిన ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ, తెలుగుదేశం పార్టీ పొత్తుతో రాష్ట్రంలో పోటీచేసి గెలుపొందాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 18 గంటల పాటు పనిచేస్తున్నారని లోక్‌సభ స్పీకర్‌కు తోట సీతారామలక్ష్మీ తెలియచేశారు. ప్రపంచంలో ఏ దేశానికి, ఏ రాష్ట్రానికి కూడా ఇటువంటి నష్టం విభజన సమయంలో జరగలేదని, ఆంధ్రప్రదేశ్‌లో కనీసం రాజధాని కూడా లేదన్నారు. ఇప్పటికే చంద్రబాబునాయుడు చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంపీలు అందరూ కూడా ఒకే నినాదంతో ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ చేస్తున్న కేంద్రప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. పార్లమెంట్ ఉభయ సభలు దేవాలయంతో సమానమని, ఈ సభలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ ఆధ్వర్యంలో జరిగిన రాష్టవ్రిభజన తెలుగువారిని ఎంతో మనోవేదనకు గురిచేసిందన్నారు. రాజ్యసభలో తోట సీతారామలక్ష్మీ ప్రసంగానికి స్పందించిన సహచర ఎంపీలు చప్పట్లు కొట్టి అభినందించారు.