పశ్చిమగోదావరి

దశలవారీగా సమస్యలు పరిష్కరిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూలై 31 : మెడికల్, హెల్త్ ఉద్యోగుల సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తానని, ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రులతో చర్చించి పరిష్కరించదగిన సమస్యలన్నీ కూడా సకాలంలో పరిష్కరిస్తానని జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు హామీ ఇచ్చారు. ఆదివారం స్థానిక ఐ ఎడిపి హాలులో తెలుగునాడు మెడికల్, హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ సమావేశానికి ముఖ్య అతిధిగా జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా మెడికల్ ఉద్యోగులు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు. యూనియన్ సభ్యులతో ప్రతీ మూడు నెలలకు ఒకసారి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, యురోపియన్ ఔట్ సోర్సింగ్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాలు పెంచాలని, ప్రసూతి సెలవులు వర్తింపచేయాలని, ప్రతీ రెవిన్యూ డివిజన్‌లో గణాంకాధికారిని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లను, సూపర్‌వైజర్లను నియమించాలని తదితర సమస్యల పరిష్కారం కోరుతూ యూనియన్ నాయకులు జడ్పీ ఛైర్మన్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు రామ్మోహనరావు, రాము, ఎన్ ఎస్ ఆర్ మూర్తి, పి సోమశేఖరరావు, వై శ్రీనివాసరావు, అచ్యుతరావు, రాముడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వర్కింగ్ కమిటీ అధ్యక్షులుగా కృష్ణమోహన్, అధ్యక్షులుగా జివి సోమశేఖర్, కార్యదర్శిగా డి నరేంద్రబాబు, ఉపాధ్యక్షులుగా బి వెంకటేశ్వరరావు, జె జయంత్, టి బేబి, సహాయ కార్యదర్శిగా కె రామకృష్ణ, చక్కా శ్రీనివాస్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఆర్‌వి ఎంవి కృష్ణమూర్తి, కోశాధికారిగా నాగమణి, సహాయ కార్యదర్శిగా శర్మలను ఎంపిక చేయగా వారితో జడ్పీ ఛైర్మన్ బాపిరాజు ప్రమాణ స్వీకారం చేయించారు. పెద్ద సంఖ్యలో ఆరోగ్య, వైద్య శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.