పశ్చిమగోదావరి

స్వస్థత ప్రార్థన ముసుగులో గొలుసు చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిడదవోలు, ఆగస్టు 5: పాస్టరు ముసుగులో ప్రార్థనలు చేస్తానని చెప్పి మహిళ మెడలో గొలుసు తస్కరించిన దొంగను 24 గంటల్లోపు స్థానిక పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసు సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో సిఐ ఎం బాలకృష్ణ ఇందుకు సంబంధించి వివరాలు తెలియజేశారు. తాడేపల్లిగూడెం మండలం కొండ్రుప్రోలు గ్రామానికి చెందిన జయవరపు కృష్ణ క్రైస్తవ మతబోధపకుడిగా చలామణి అవుతూ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి స్వస్థత ప్రార్థనలు చేస్తానని తిరిగేవాడు. గురువారం పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన కాకి సూర్యారావు ఇంటికి వెళ్లి అతని భార్య అచ్చాయ్యమ్మ పక్షవాతంతో బాధపడుతుండడం గమనించి ఆమెకు స్వస్థత చేకూర్చేందుకు ప్రార్థనలు చేస్తానని నమ్మించాడు. ప్రార్థనలు సమయంలో వస్తువులేవీ ఉండకూడదని చెప్పి ఆమె మెడలోని మంగళ సూత్రాలను పక్కన బల్లపై పెట్టించాడు. కళ్లు మూసుకోమని చెప్పి బల్లపై ఉంచిన మంగళ సూత్రాలతో పరారయ్యాడు. బాధితురాలు అచ్చయ్యమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి 24 గంటల్లోపే నిందితుడు కృష్ణను శుక్రవారం శెట్టిపేటలో అదుపులోనికి తీసుకుని అతని వద్దనుండి రూ.65వేలు విలువైన మూడున్నర కాసుల సూత్రాల తాడుని రికవరీ చేసినట్లు సిఐ బాలకృష్ణ తెలిపారు. ఈ కేసు దర్యాప్తునకు ఎస్సై భగవాన్ ప్రసాద్, పోలీసు సిబ్బంది ఎండి షరీఫ్, ప్రభాకరరావు, అనిల్, టి శ్రీనివాసరావు, ఎల్ బాబూరావు, రామారావులు సహకరించినట్లు సిఐ తెలిపారు.