పశ్చిమగోదావరి

‘పోలవరం’ నిర్మాణ ప్రాంతానికి భారీ యంత్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, ఆగస్టు 5: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి భారీ యంత్రాలు శుక్రవారం చేరుకున్నాయి. నిర్మాణ పనులు వేగవంతం చేయడానికి వీటిని రప్పించారు. సబ్‌కాంట్రాక్ట్ పనులు చేస్తున్న త్రివేణి కాంట్రాక్టు ఏజెన్సీ జంషెడ్‌పూర్ నుండి ఈ యంత్రాలను రప్పించింది అక్కడ 10 రోజుల క్రితం బయలుదేరిన యంత్రాలు ఇప్పటికి చేరుకున్నట్టు అధికారులు తెలిపారు. అందులో నాలుగు భారీ డంపర్లు, మూడు ఎక్సవేటర్లు సంబంధించిన విడిభాగాలు 82 టైర్ల ట్రాలీపై వచ్చాయి. ఎక్స్‌వేటర్ బకెట్ 35 క్యూబిక్ మీటర్ల మట్టిని ఒకేసారి తీయగల సామర్ధ్యం ఉన్న భారీ యంత్రం. డంపర్ 280 టన్నుల లోడ్ తీసుకెళ్లే సామర్ధ్యం కలిగి ఉంటుంది. ప్రస్తుతం ప్రాజెక్టు పనుల్లో భాగంగా రోజుకు లక్ష క్యూబిక్ మీటర్ల మట్టి తీస్తుండగా 2.5 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తీసే లక్ష్యంతో భారీ యంత్రాలు రప్పిస్తున్నట్టు అధికారులు తెలిపారు.