పశ్చిమగోదావరి

కొరడా ఝళిపిస్తున్న జెసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఆగస్టు 6: ఆహార కల్తీ వ్యవహారంపై జిల్లా యంత్రాంగం సీరియస్‌గా ఉంది. ప్రజారోగ్యానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్న ఈ కల్తీలను పూర్తిస్దాయిలో నిరోధించేందుకు కృతనిశ్చయంతో ముందుకెళుతోంది. జాయింట్ కలెక్టరు పి కోటేశ్వరరావు నేతృత్వంలో జిల్లావ్యాప్తంగా ఉన్న హోటళ్లు, ఇతర తినుబండారాల కేంద్రాలపై పూర్తిస్ధాయి దాడులను ప్రారంభించారు. ఈలోగానే ఏలూరులో ఒక దారుణం చోటుచేసుకోవటంతో నగరంలో వరుస దాడులు నిర్వహించారు. ఒక హోటల్‌ను మూయించివేశారు. మరికొన్నింటికి నోటీసులు ఇచ్చారు. ఆహారకల్తీకి సంబంధించి గత కొద్దిరోజుల నుంచి పలు ఫిర్యాదులు అందుతూ వస్తున్నాయి. చివరకు ఆహార సలహా సంఘ సమావేశాల్లో పలువురు ఈ విషయమై జిల్లా ఉన్నతాధికారులకు పలు ఫిర్యాదులు చేశారు. ముఖ్యంగా హోటళ్లు, రోడ్డుపక్కన బళ్లు, కర్రీ పాయింట్లు, పాస్ట్‌పుడ్ సెంటర్లు, సినిమా ధియేటర్లలో విక్రయాల విషయంలో కల్తీ జరుగుతోందని, దీంతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని పేర్కొన్నారు. ఇటీవలకాలంలో దాడులు లేకపోవటంతో ఈ కల్తీకి ఏస్ధాయిలోనూ అడ్డుకట్ట పడటం లేదని వారు పేర్కొన్నారు. దీంతో స్వయంగా రంగంలోకి దిగిన జాయింట్ కలెక్టరు కోటేశ్వరరావు పలుచోట్ల దాడులకు ఆదేశించారు. ఇప్పటికే ఆయిల్‌కు సంబంధించి కల్తీ వ్యవహారాలను బయటపెట్టిన అధికారులు హోటళ్లు, ఇతర తినుబండారాల కేంద్రాలపై దాడులకు ఉపక్రమించారు. ఈలోగా స్ధానిక రామచంద్రరావుపేటలోని ఒక హోటల్‌లో శనివారం ఒక యువకుడు టిఫెన్ కట్టించుకుని వెళ్లగా దానిలో బల్లి పడిఉండటాన్ని గమనించకుండానే దాన్ని కొంత తిన్నాడు. దీంతో అతను అనారోగ్యం బారిన పడ్డాడు. విషయాన్ని గుర్తించిన ఆ యువకుని తల్లిదండ్రులు అధికారులకు ఫిర్యాదు చేయటంతో జిల్లా ఆహార తనిఖీ భద్రతా అధికారి ఎ మాలకొండారెడ్డి హోటల్‌కు వెళ్లి శాంపిల్స్ తీసుకున్నారు. ఆహారపదార్ధాలు కలుషితం అయినట్లు గుర్తించి హోటల్‌ను మూసివేశారు. అనంతరం సమీపంలోని ఒక బిర్యానీ పాయింట్‌ను కూడా తనిఖీ చేశారు. అక్కడ మూడురోజుల క్రితం కొన్న చికెన్‌ను ఫ్రిజ్‌లో నిల్వ చేసి ఉంచటం, రెండురోజుల క్రితంనాటి కట్టా శనివారం సర్వ్ చేయటం గుర్తించారు. హోటల్ యజమానికి నోటీసులు ఇచ్చినట్లు మాలకొండారెడ్డి చెప్పారు. అనంతరం ఆర్‌ఆర్ పేటలోని ఒక రెస్టారెంటుపై దాడి చేయగా అక్కడ ఆహారపదార్ధాలలో రంగులు ఎక్కువగా వాడుతున్నట్లు గుర్తించారు. దీనివల్ల కాలేయ సంబంధిత వ్యాధులు వస్తాయని ఆయన చెప్పారు. ఇకపై ఈవిధంగా చేస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం మరో పది హోటళ్లపై దాడులు నిర్వహించారు. మొత్తంమీద జెసి ఆదేశాలతో ఇప్పటికైనా తనిఖీ అధికారులు రంగంలోకి దిగటంతో ఆహారపదార్దాల కల్తీకి బ్రేక్ పడుతుందని భావిస్తున్నారు.