పశ్చిమగోదావరి

శివారు ప్రాంతాల అభివృద్ధికి చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉండి, ఆగస్టు 7: తన దత్తత గ్రామం మహదేవపట్నంలో శివారు ప్రాంతాలను కూడా ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నానని నర్సాపురం ఎంపి గోకరాజు గంగరాజు అన్నారు. ఆదివారం ఉదయం మండలంలో ఎంపి దత్తత గ్రామంలో రూ.1.03 కోట్ల జాతీయ గ్రామీణ నిధులతో చేపట్టే రెండు ఓవర్‌హెడ్ ట్యాంకులు, ఒక ఫిల్టర్ బెడ్‌కు ఆయన ఎమ్మెల్యే శివరామరాజుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహదేవపట్నంలోని శివారు ప్రాంతాలైన ఉప్పరగూడెం, బొక్కావారిపాలెం వంటి దూర ప్రాంతాలకు రక్షిత మంచినీరు సరఫరాకు రెండు ట్యాంకులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఇప్పటికే గ్రామంలో సిసి రోడ్లు, వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణం, గొల్లలకోడేరు-మహదేవపట్నం గ్రామాల మధ్య రోడ్డు నిర్మాణం, మహదేవపట్నం గుండా వెళ్లే ఆర్‌అండ్‌బి రోడ్డు విస్తరణ పనులు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రహారీ గోడ నిర్మాణం వేగంగా జరుగుతున్నాయన్నారు. వీటిని త్వరితగతిన పూర్తిచేయించనున్నట్టు చెప్పారు. ఎమ్మెల్యే శివరామరాజు మాట్లాడుతూ ప్రజలకు రెండు పూటల నీళ్లందించేందుకు పంచాయతీ చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామ సర్పంచ్ జుత్తిగ శ్రీనివాస్ మాట్లాడుతూ దత్తత గ్రామంలో ఎంపి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు కృతజ్ఞతలు చెప్పారు. కార్యక్రమంలో ఎంపిపి దలియా లక్ష్మి, టిటిడి బోర్డు మాజీ సభ్యుడు గోకరాజు రామరాజు, బిజెపి నాయకులు కొమ్మన నాగబాబు, పేరిచర్ల సుభాష్‌రాజు, ఆర్‌డబ్ల్యుఎస్ డిఇ గిరి తదితరులు పాల్గొన్నారు.