వరంగల్

నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయపర్తి, ఏప్రిల్ 1: పాలకుర్తి నియోజకవర్గంలోని అన్ని మండలాలు అభివృది ధపర్చేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శుక్రవారం మండలంలోని టిఆర్‌ఎస్ కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌రావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ మండలంలోని గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తానని, రాష్ట్రంలో పాలకుర్తి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్నారు. పార్టీలకు అతీతంగా అన్ని గ్రామాలను అభివృద్ధి పర్చేందుకు తనవంతుగా కృషి చేస్తానని అన్నారు. వేసవికాలంలో తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టిసారించినట్లు ఆయన తెలిపారు. మాజీ టిడిపి కార్యకర్తలు, టిఆర్‌ఎస్ కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగి గ్రామాల అభివృద్ధికి తోడ్పాటు కావాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో మండల నాయకులు ఇనుగు అనిమిరెడ్డి, మునావత్ నర్సింహనాయక్, సురేందర్‌రావు, వేముల రమేష్, మచ్చ సత్యం, ఎనగందుల యాకనారాయణ, గుగులోతు విజయ, వంగాల యాకమ్మ తదితరులు పాల్గొన్నారు.