వరంగల్

మల్లన్న ఆలయ అభివృద్ధే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేర్యాల, డిసెంబర్ 25: ప్రముఖ శైవక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యమని మంత్రులు తన్నీరు హరీష్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌లు అన్నారు. ఆదివారం కొమురవెల్లి మల్లన్న కల్యాణోత్సవంలో పాల్గొన్న అనంతరం వారు విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఈనాటి మల్లన్న కల్యాణ నిర్వాహణకు ప్రభుత్వం తరపున కోటి రూపాయలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి హరీష్‌రావు తెలిపారు. కొమురవెల్లి మల్లన్న పేర సాగునీరు అందించేందుకు మల్లన్న సాగర్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని దేవాలయాలన్ని అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. ఆలయాల అభివృద్ధి ఘనత కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. రానున్న రోజుల్లో మల్లన్న క్షేత్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. ఈ సమావేశంలో జడ్పీటిసి సుంకరి సరితామల్లేషం, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎంపిపి మేడిశెట్టి శ్రీ్ధర్, నాయకులు మంచాల కొండయ్య, మంగోలు చంటి, శివగారి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

నోట్ల డిపాజిట్ ఇక నాలుగురోజులే..
బ్యాంకుల్లో ఇంకా అందుబాటులోకి రాని నగదు * రెండు గంటల్లోనే ఎటిఏంలు ఖాళీ
కరెన్సీ కష్టాలు తీరేదెన్నడో? * వరుస సెలవులతో ప్రజల ఇబ్బందులు

మహబూబాబాద్, డిసెంబర్ 25: మార్కెట్‌లో పెద్దనోట్ల చెల్లుబాటుకు కాలం చెల్లినప్పటికి బ్యాంకుల్లో నోట్లను డిపాజిట్ చేసుకునేందుకు మరో నాలుగు రోజులు మాత్రమే గడువుమిగిలింది. వరుసగా బ్యాంకులకు మూడు రోజులు సెలవుదినం కావడంతో బ్యాంకుల నుండి డబ్బు తీసుకునేందుకుగాని, డిపాజిట్ చేసేందుకుగాని అవకాశం లేకుండాపోయింది. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నల్లధనాన్ని వెలికి తీసేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.1000, 500 పెద్ద నోట్లను రద్దు చేసి దాదాపు 48రోజులు కావస్తున్నప్పటికి బ్యాంకుల్లో డబ్బు అందుబాటులోకి రాలేదు. పెద్ద నోట్ల రద్దు అయినప్పటి నుండి ఎటిఎంలన్ని ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయాయి. ఇటీవల కాలంలో కొన్ని ఎటిఎంలు పనిచేస్తున్న నాలుగు గంటల్లోనే ఎటిఎంలోని డబ్బు ఖాళీ అవుతుంది. గంటల తరబడి ప్రజలు బ్యాంకులు, ఎటిఎంల వద్ద క్యూలు కడుతున్న రెండు వేలుకూడా చేతికి అందని పరిస్ధితి ఉంది. బ్యాంకుల్లో రూ. 2000 కొత్త నోట్లు ఇస్తున్నంత సులువుగా రూ.500కొత్త నోట్లు ఇవ్వడం లేదు. దీంతో చిల్లర కష్టాలు ఎక్కువైనాయి. బ్యాంకులో చేతినిండ డబ్బు ఉన్న తీసుకునే అవకాశం లేకపోవడంతో వ్యాపారాలు వెలవెలపోతున్నాయి. ఆర్ధిక మాద్యం కారణంగా రియల్ ఏస్టేట్ రంగం పూర్తిగా పడిపోయింది. బ్యాంకుల్లో నగదు విత్‌డ్రాపై పరిమితి ఉన్నందున స్వైప్ దందా జోరందుకుంది. కమీషన్ బేస్‌మీద నగదు మార్పిడి జరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఎటిఎం ద్వార స్వైప్ చేసిన ప్రతి వ్యక్తికి 20శాతం మినహాయించుకొని నగదు ఇస్తున్నారు. ఇదిలా ఉండగా పాత పెద్ద నోట్ల డిపాజిట్‌పై చివరి వరకు వేచి చూస్తామని భావించిన కొందరు బడా బాబులకు పెద్ద నోట్ల డిపాజిట్ విషయంలో ఆర్‌బిఐ మరిన్ని ఆంక్షలు విధించడంతో ఇరకాటంలో పడిపొయారు. పెద్ద నోట్ల రద్దు విషయంలో కేంద్ర ఏదైనా ఆఫర్ ఇస్తుందనుకొని వేచిచూసే ధోరిణిలో ఉన్న బడాబాబులకు ఆర్‌బిఐ గట్టిషాక్ ఇచ్చింది. పాతపెద్ద నోట్ల డిపాజిట్ విషయంలో సరైన ఆధారాలు చూపిచాలని ఆర్‌బిఐ షరతులు విధించడంతో పెద్ద నోట్ల డిపాజిట్ దారులు ముందుకురావడం లేదు. ఇంకా ఈ కరెన్సీ కష్టాలు ఎన్ని రోజులు ఉంటుందోనని సామాన్య, మధ్య తరగతి ప్రజలు నిట్టూరుస్తున్నారు.

విద్యుత్ లైన్ల పునరుద్ధరణకు 7 కోట్లు
వార్డుల్లో సిసి కెమోరాల ఏర్పాటు * పౌరసరఫరాల సంస్థ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి‚
నర్సంపేట, డిసెంబర్ 25: నర్సంపేట పట్టణంలో విద్యుత్ లైన్లను పునరుద్దరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 7 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు. నర్సంపేటలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడారు. పాత విద్యుత్ స్తంబాల స్థానంలో కొత్త స్తంభాలు, కాలనీలకు నూతన విద్యుత్ లైన్లను ఈనిధులతో వేయనున్నట్లు తెలిపారు. పట్టణంలో ఎక్కడా విద్యుత్ సరఫరాకు ఆటంకం లేకుండా అవసరమైనన్ని ట్రాన్స్‌ఫార్మర్లను సైతం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పట్టణంలో ఇరవై నాలుగు గంటల పాటు విద్యుత్‌ను అందించే దిశగా అన్ని చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. అదే విధంగా పట్టణంలోని 20 వార్డులలో సిసి కెమోరాలను ఏర్పాటు చేసేందుకు మహబూబాబాద్ ఎంపి అజ్మీరా సీతారాంనాయక్ తన పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ది నిధుల నుండి 9.80లక్షలు మంజూరు చేశారని చెప్పారు. త్వరలోనే సిసి కెమోరాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి కుళాయి ద్వారా రక్షిత మంచినీటిని అందించనున్నట్లు తెలిపారు. సమావేశంలో నగర పంచాయతీ చైర్మన్ పాలెల్లి రాంచంద్రయ్య, నాయకులు మునిగాల వెంకట్‌రెడ్డి, కామగోని శ్రీనివాస్, గుంటి కిషన్, రాయిడి రవీందర్ రెడ్డి, నాయిని నర్సయ్య, నాగెల్లి వెంకటనారాయణ పాల్గొన్నారు.

రైతు ఆత్మహత్య
గూడూరు, డిసెంబర్ 25: ఆర్థిక ఇబ్బందులతో బావిలో దూకి రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గూడూరు మండలంలోని గుండెంగ శివారు చర్ల తండాలో శనివారం రాత్రి జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. చర్లతండాకు చెందిన బోడ శ్రీనివాస్ (45) తనకున్న మూడు ఎకరాల చేనులో పత్తి పంటను సాగు చేశాడు. అయితే ఆశించిన స్థాయిలో పంట దిగుబడి రాకపోవడం.. మరో వైపు చేసిన అప్పులు పెరిగిపోవడంతో వాటిని ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనస్థాపానికి గురై శనివారం తన వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గూడూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

చర్చిలు విజ్ఞానాన్ని అందిస్తాయి
* ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్
కమలాపూర్, డిసెంబర్ 25: చర్చిలు విద్య, విజ్ఞానాన్ని అందించడమే కాకుండా గ్రామాలను అభివృద్ధి చేస్తున్నాయని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఆదివారం వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలోని ఉప్పల్ బాప్టిస్ట్ చర్చిలో క్రిస్మస్ వేడుకలలో మంత్రి పాల్గొని క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని చర్చిలో పాల్గొని క్రిస్మస్ కేక్‌ను కట్ చేసి అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చేసిన ప్రార్థనను ఫలించడంతో ప్రభుత్వం క్రిస్మస్ పండుగను అధికారికంగా నిర్వహిస్తుందని తెలిపారు.

స్పీకర్ కాన్వాయ్‌లో పార్టీ నేత!
ఎమ్మెల్యే వాహనంలో ప్రయాణించిన నాయకుడికి స్పీకర్ అంగరక్షకుల మందలింపు
కాటారం, డిసెంబర్ 25: మంథని శాసనసభ్యులు పుట్ట మధుకర్ వాహనంలో ముందు సీటులో కూర్చొని.. ఆదివారం అసెంబ్లీ స్పీకర్ కాన్వాయ్‌లో, అధికార టిఆర్‌ఎస్ నేత ప్రయాణం చేసిన అంశంపై అసెంబ్లీ స్పీకర్ వర్గాలు ఆరా తీశాయి. ప్రోటోకాల్ పరిధి దాటి ప్రవర్తించవద్దని టిఆర్‌ఎస్ నాయకులను స్పీకర్ అంగరక్షకులు మందలించారు. ఆదివారం భూపాలపల్లి జిల్లా మంథని శాసనసభ నియోజకవర్గంలోని మహాదేవపూర్‌లో పట్టు పరిశ్రమ ప్రదర్శనకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు, స్పీకర్ సిరికొండ మధుసూదనచారి భూపాలపల్లి నుంచి రాగా, మంథని శాసనసభ్యుడు పుట్ట మధుకర్ మంథని నుంచి వచ్చి గారెపల్లిలో ఇరువురు కలుసుకున్నారు. అసెంబ్లీ స్పీకర్ మధుసూదనచారి వాహనంలో ఎమ్మెల్యే పుట్ట మధుకర్ కాటారం మండల కేంద్రమైన గారెపల్లి నుంచి మహాదేవపూర్‌కు ఎక్కి ప్రయాణించారు. ఇదిలా ఉండగా, మంథని శాసనసభ్యులు పుట్ట మధుకర్ వాహనంలో అధికార టిఆర్‌ఎస్ పార్టీ నేత ముందు సీటులో కూర్చుండి, మహాదేవపూర్ వరకు ప్రయాణించడం పట్ల ఆ పార్టీ నేతలు కొంతమంది కినుక వహించారు. మరోపక్క అసెంబ్లీ స్పీకర్ కాన్వాయ్ పర్యటనలో ఉండగా ఎమ్మెల్యే వాహనంలో ప్రోటోకాల్‌ను విస్మరించి పార్టీ నేత పర్యటించడం పట్ల స్పీకర్ వర్గాలు ఆరా తీశాయి. అసెంబ్లీ స్పీకర్‌కు ప్రోటోకాల్ ప్రకారంగా జడ్ ప్లస్ సెక్యూరిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుంది. మారుమూల అటవీ నక్సల్స్ ప్రాబల్య ప్రాంతంలో స్పీకర్ పర్యటనకు పోలీసులు తమదైన రీతిలో ప్రోటోకాల్ ప్రకారంగా బందోబస్తు, రక్షణ ఏర్పాట్లు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేకు సైతం రక్షణ చర్యలు చేపట్టడం పోలీసుల బాధ్యత. కాగా, ఎమ్మెల్యే వాహనంలో పార్టీ నేత ముందు సీటులో కూర్చుండి స్పీకర్ కాన్వాయ్‌లో ప్రయాణించడం పట్ల స్పీకర్ అంగరక్షకులు ఆరా తీశారు. ఎమ్మెల్యే స్టిక్కర్ అంటించిన వాహనానికి పోలీసులు డేగ కన్నుతో రక్షణ ఏర్పాట్లు చేస్తుండగా, ఆ వాహనంలో పార్టీనేత ప్రత్యక్షం కావడంతో పోలీసులు కంగుతిన్నారు. దీంతో ఎమ్మెల్యే వాహనంలో ఎవరైనా ప్రయాణించాల్సి వస్తే వెనుక సీటులో కూర్చోవాలని సదరు స్పీకర్ అంగరక్షకులు సెలవిచ్చినట్లు సమాచారం. అసెంబ్లీ స్పీకర్ సాక్షిగా ఎమ్మెల్యే వాహనంలో పార్టీ నేత ప్రయాణం చర్చనీయాంశంగా మారింది. తిరుగు ప్రయాణంలో తన వాహనంలోనే ఎమ్మెల్యే పుట్ట మధూకర్ మహాదేవపూర్ నుంచి మంథనికి ప్రయాణించారు. ప్రోటోకాల్ పరిధి దాటి పార్టీ నాయకులు ప్రవర్తించవద్దని స్పీకర్ అంగరక్షకులు, పోలీసులు సూచించారు.