వరంగల్

ఎంపిటిసి భర్త దారుణహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాదేవపూర్, జనవరి 3: పలిమెల మండలంలో ఎంపిటిసి భర్త దారుణ హత్యకు గురుయ్యారు. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. మండలంలోని పలిమెల ఎంపిటిసి శ్రీరంగం విజయ భర్త నాగరాజు (45)ను డిసెంబర్ 31న రాత్రి గ్రామానికి చెందిన కొంతమంది వచ్చి మాట్లాడాలని చెప్పి నాగరాజును ఇంటి నుంచి తీసుకొని తీసుకెళ్లారు. గతంలో కూడా పలుమార్లు ఇలా గ్రామస్థులు వచ్చి రాత్రి పగలు తేడా లేకుండా తీసుకొని వెళ్ళడం పరిపాటిగా ఉందని ఆయన భార్య వివరించారు. దాంతో ఎప్పటిలాగానే తీసుకొని వెళ్ళి ఉండవచ్చని భావించామని వారు పేర్కొన్నారు. కాగా మూడు రోజులుగా ఆచూకీ లేకుండా పోవడం, సెల్ ఫోన్ పనిచేయకపోవడంతో బంధువులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా మంగళవారం ఉదయం పలిమెల ఊరి చివరిలోని చెలిమెల వాగు సమీపంలోని బావిలో శవమై కనిపించాడని వారు రోదిస్తూ చెప్పారు. విషయం తెలుసుకున్న మహాదేవపూర్ పోలీసులు శవాన్ని పోస్టుమార్టుం నిమిత్తం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చారు. నాగరాజుపై గతంలో హత్యాయత్నం కేసు కూడా ఉన్నట్లు బంధువులు పేర్కొన్నారు. దీంతో పాత కక్షలతో నాగరాజును హత్య చేసినట్లుగా వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నాగరాజు మెడపైన గొడ్డలి గాట్లు ఉండడంతో హత్యగా పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. గ్రామానికి చెందిన కొంతమందిని పోలీసులు విచారించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఉదయ్‌కుమార్ తెలిపారు. నాగరాజుకు ఇద్దరు భార్యలు విజయ, సత్యవతి ఉండగా.. కుమారుడు యశ్వంత్ హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తుండగా, కుమార్తెలు మీనాక్షి బిఈడి పూర్తి చేయగా, ప్రవల్లిక బీఎస్సీ నర్సింగ్ కోర్సు హైదరాబాద్‌లో చదువుతోంది.

-- కుటుంబంలో కొత్త సంవత్సరం విషాదం --
తండ్రి మందలించాడని
కొడుకు ఆత్మహత్యాయత్నం
* కొడుకు చావుబతుకుల్లో ఉన్నాడని తండ్రి ఆత్మహత్య
కేసముద్రం, జనవరి 3: నూతన సంవత్సర వేడుకలు ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని కలిగించాయి. గ్రామస్థులు, బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని ఇనుగుర్తి గ్రామానికి చెందిన మంచాల అశోక్ నూతన సంవత్సర వేడుకల్లో అర్ధరాత్రి దాటిన తరువాత ఇంటికి చేరుకొన్నాడు. ‘ఇలా రాత్రంతా సోయిలేకుండా తిరగడం ఏమిటీ.. నీ కుటుంబం మీద ధ్యాస ఉందా.. ఇలా తిరిగితే అప్పులు ఎలా తీరుతాయ’ అంటూ తండ్రి మల్లయ్య కొడుకును తీవ్రంగా మందలించాడు. తండ్రి మందలింపుతో మనస్తాపానికి గురైన అశోక్ జనవరి 1న ఆదివారం ఉదయం మహమూద్‌పట్నం గ్రామ శివారుల్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో అతన్ని గమనించిన వారు మహబూబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. కొడుకును ఆసుపత్రిలో చావుబతుకుల్లో చూసిన తండ్రి మల్లయ్య తన కొడుకు ఇక బతకడని భావించి.. కొడుకు చనిపోతే ఆ నింద తనపై పడుతుందనే మనస్తాపంతో అదే రోజు సాయంత్రం మహబూబాబాద్ నుంచి ఇంటికి తిరిగి వస్తూ మార్గమధ్యంలో పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీనితో అతన్ని కూడా ఆదే ఆసుపత్రిలో చేర్చి ఇద్దరికి చికిత్స చేయిస్తుండగా మంగళవారం తండ్రి మల్లయ్య (50) మృతి చెందాడు. కాగా, చికిత్స పొందుతున్న అశోక్ పరిస్థితి విషమంగానే ఉన్నట్లు సమాచారం. కాగా, మల్లయ్యకు ఇద్దరు కుమారులు కాగా, పెద్దకొడుకు రాజు కూడా రెండేళ్ల క్రితం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం.. రెండో కుమారుడు చావుబతుకుల్లో ఉండటం.. అశోక్‌కు వివాహం జరిగి ఎనిమిది మాసాలే కావడం.. అంతలోనే తండ్రి మల్లయ్య మరణించడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు.