వరంగల్

ప్రజలు వీక్షించేలా పతంగుల పండుగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జనవరి 12: వరంగల్ నగరంలో ఈనెల 17న నిర్వహిస్తున్న అంతర్జాతీయ పతంగుల పండుగను నగర ప్రజలు పూర్తిస్థాయిలో వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి ఆయా శాఖల అధికారులకు సూచించారు. గురువారం ఆర్ట్ అండ్ సైన్స్ కళాశాల గ్రౌండ్‌ను కలెక్టర్ ఆమ్రపాలి సందర్శించి అంతర్జాతీయ పతంగుల పండుగ ఏర్పాట్లను, తీసుకోవలసిన చర్యల గురించి అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు వరంగల్ నగరంలో మొట్టమొదటిసారి నిర్వహించే ఈ అంతర్జాతీయ పతంగుల పండుగలో 31దేశాల నుంచి పతంగులను ఎగురవేసే నిపుణులు పాల్గొంటారని, జాతీయ స్థాయి కైట్‌ఫ్లైయర్స్ కూడా హాజరవుతారని చెప్పారు. పతంగుల పండుగను చూసేందుకు వచ్చే సందర్శకుల కోసం కళాశాల ఆవరణలో బ్యారికేడ్లు, ఎంట్రీస్టాళ్లు, షామియానాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. పతంగులు ఎగురవేసే 16వ తేదీ సాయంత్రానికి వరంగల్ నగర్ చేరుకుంటారని, వీరికి హరిత హోటల్‌లో బస ఏర్పాటుచేస్తున్నామని చెప్పారు. పతంగుల ఉత్సవం ప్రారంభంలో భాగంగా 17వ తేదీ ఉదయం ఖిలా వరంగల్‌లో కాకతీయ కోట ప్రాముఖ్యతను ప్రపంచ దేశాలకు చాటిచెప్పే విధంగా హెరిటేజ్ వాక్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఉదయం 10గంటలకు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో పతంగుల ఉత్సవం మొదలవుతుందని అన్నారు. 16వ తేదీ సాయంత్రంలోగా పతంగుల ఉత్సవానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తికావాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఏర్పాట్లను పరిశీలించిన వారిలో జాయింట్ కలెక్టర్ దయానంద్, జిల్లా రెవెన్యూ అధికారి శోభ తదితరులు ఉన్నారు.

ప్రజా సహకారంతోనే
అసాంఘిక చర్యలకు చెక్
యువత సన్మార్గంలో ఉండేందుకు దోస్త్ మీట్ * జయశంకర్ జిల్లా ఎస్పీ భాస్కరన్
మహాదేవపూర్, జనవరి 12: ప్రజల తొడ్పాటుతోనే అసాంఘిక కార్యకలాపాలు తగ్గించ వచ్చునని, ప్రజలను చైతన్య వంతులను చేసినప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని జయశంకర్ జిల్లా ఎస్పీ ఆర్. భాస్కరన్ అన్నారు. గురువారం వివేకానంద జయంతిని పురస్కరించుకొని పోలీసుల ఆధ్వర్యంలో పలిమల మండల కేంద్రంలో దోస్త్ మిట్ కార్యక్రమం నిర్వహించారు. మారుమూల మండలంలో జిల్లా ఎస్పీ మొదటి సారిగా పర్యటించారు. దోస్త్‌మిట్ కార్యక్రమానికి మంథని ఎమ్మెల్యే పుట్ట మధు ముఖ్య అతిథిగా హాజరైన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గ్రామాల్లో యువత చెడు అలవాట్ల నుండి దూరంగా ఉండాలని, వ్యక్తిగతంగా అభివృద్ధి చెందినప్పుడే గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. గతంలో మారుమూల గ్రామాలకు పోలీసులు రావాలంటే చాల ఇబ్బందులు పడాల్సి వచ్చేదని ప్రస్తుత సమయంలో ప్రజల సహకారంతో గ్రామాల అభివృద్ధి జరుగుతుందని వివరించారు. మారుమూల పల్లెలో పోలీసులు, పేద ప్రజలు యువకుల నైపుణ్య సేవ కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు. పలిమల మండల పరిధిలోని వాగులపై వంతెనలు, రోడ్డు నిర్మాణ పనులను త్వరలోనే పూర్తి చేస్తామని మంథని ఎమ్మెల్యే పుట్ట మధు అన్నారు. మండల పరిధిలోని పంకేనా, పలిమల, నీలంపల్లి, ముక్కునూరు, మోతేడు, దమ్మోరు గ్రామాల్లోని యువతి, యువకులకు పరుగు పందెం నిర్వహించారు. ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు అందచేశారు. ప్రతి గ్రామానికి చెందిన క్రీడకారులకు క్రీడ సామాగ్రితో పాటు దుస్తులు అందచేశారు. అనంతరం పోలీసుల ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ చంద్రశేఖర్, జయపాల్ పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజలకు వైద్య సేవలు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఓఎస్‌డి రవీందర్, మహాదేవపూర్ డిఎస్పీ కెఆర్‌కె ప్రసాద్, సర్పంచ్ నిర్మల, జడ్పిటిసి హసినాభాను, మహాదేవపూర్, కాటరం సిఐలు చంద్రభాను, సదన్‌కుమార్, ఎస్సైలు ఉదయ్‌కుమార్, నరేష్, రాజు, తిరుపతి, కిరణ్, ప్రజాప్రతినిధులు లింగంపెల్లి శ్రీనివాస్‌రావు, శ్రీపతి బాబు తదితరులు పాల్గొన్నారు.

విద్యాసంవత్సరం ప్రారంభంలోగా
అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఫర్నిచర్

వరంగల్, జనవరి 12: వరంగల్ రూరల్ జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి విద్యార్థుల అవసరాల మేరకు పూర్తిస్థాయిలో ఫర్నీచర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. అదే విధంగా ఎంపిక చేసిన అన్ని స్కూళ్లలో డిజిటల్ క్లాసు రూంలు ఏర్పాటు చేయాలని తెలిపారు. వీటికోసం అవసరమైన నిధులను ప్రభుత్వం కేటయిస్తుందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలలోని పాఠశాలల్లో బయోమెట్రిక్ విధానం ద్వారా ఉపాధ్యాయుల, విద్యార్థుల హాజరు తీసుకునేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు. గురువారం అర్బన్ కలెక్టరేట్ మీటింగ్ హాలులో జరిగిన రూరల్ జిల్లా సమీక్షా సమావేశంలో ఉపముఖ్యమంత్రి కడియం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ప్రతి పాఠశాలలో విద్యార్థుల అవసరాల మేరకు మరుగుదొడ్లు నిర్మించాలని, వీటికి అవసరమైన నీటిసరఫరా సదుపాయం కల్పించాలని చెప్పారు. ప్రతి పాఠశాలకు ప్రహరీగోడ, విద్యుత్ సరఫరా తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని అన్నారు. స్వచ్ఛ పాఠశాల, స్వచ్ఛ హరిత పేరిట అన్ని పాఠశాలలను శుభ్రంగా ఉంచటంతోపాటు పాఠశాలల ఆవరణలో చెట్ల పెంపకం చేపట్టాలని సూచించారు. మార్చి నెలలో జరిగే పదవతరగతి పరీక్షల్లో వరంగల్ రూరల్ జిల్లా వందశాతం ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు, అధికారులు ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలని అన్నారు.

విద్యాసంవత్సరం ప్రారంభంలోగా
అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఫర్నిచర్

వరంగల్, జనవరి 12: వరంగల్ రూరల్ జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి విద్యార్థుల అవసరాల మేరకు పూర్తిస్థాయిలో ఫర్నీచర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. అదే విధంగా ఎంపిక చేసిన అన్ని స్కూళ్లలో డిజిటల్ క్లాసు రూంలు ఏర్పాటు చేయాలని తెలిపారు. వీటికోసం అవసరమైన నిధులను ప్రభుత్వం కేటయిస్తుందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలలోని పాఠశాలల్లో బయోమెట్రిక్ విధానం ద్వారా ఉపాధ్యాయుల, విద్యార్థుల హాజరు తీసుకునేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు. గురువారం అర్బన్ కలెక్టరేట్ మీటింగ్ హాలులో జరిగిన రూరల్ జిల్లా సమీక్షా సమావేశంలో ఉపముఖ్యమంత్రి కడియం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ప్రతి పాఠశాలలో విద్యార్థుల అవసరాల మేరకు మరుగుదొడ్లు నిర్మించాలని, వీటికి అవసరమైన నీటిసరఫరా సదుపాయం కల్పించాలని చెప్పారు. ప్రతి పాఠశాలకు ప్రహరీగోడ, విద్యుత్ సరఫరా తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని అన్నారు. స్వచ్ఛ పాఠశాల, స్వచ్ఛ హరిత పేరిట అన్ని పాఠశాలలను శుభ్రంగా ఉంచటంతోపాటు పాఠశాలల ఆవరణలో చెట్ల పెంపకం చేపట్టాలని సూచించారు. మార్చి నెలలో జరిగే పదవతరగతి పరీక్షల్లో వరంగల్ రూరల్ జిల్లా వందశాతం ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు, అధికారులు ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలని అన్నారు.

కిటకిటలాడుతున్న రైల్వే, బస్‌స్టేషన్లు

వరంగల్, జనవరి 12: సంక్రాంతి పండుగకు సొంత ప్రాంతాలకు తరలివెళ్లే ప్రయాణికులతో వరంగల్ నగరంలోని బస్‌స్టేషన్లు, రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. కొత్త సంవత్సరం ప్రారంభంలో మొట్టమొదటి పండుగ సంక్రాంతిని అట్టహాసంగా జరుపుకునేందుకు అన్ని వర్గాల ప్రజలు సొంత ఊళ్లకు తరలివెడుతున్నారు. బుధవారం మధ్యాహ్నం నుంచి నగరంలోని వరంగల్, హన్మకొండ బస్‌స్టేషన్లు సొంత ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో క్రిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. పాఠశాలలకు గురువారం నుంచి సెలవులు ప్రకటించటంతో మధ్యాహ్నం నుంచే విద్యార్థులు తమతమ ప్రాంతాలకు తరలిపోగా గురువారం వీరి సంఖ్య మరింతగా పెరిగింది. శుక్రవారం భోగి, శనివారం సంక్రాంతి, ఆదివారం కనుమ పండుగ జరుగనుండటం, ఈ మూడురోజులు సెలవు కావటంతో నగరం నుంచి భారీసంఖ్యలో ప్రజలు తమ సొంత ప్రాంతాలకు తరలుతున్నారు. సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసి అధికారులు హైద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్ తదితర ప్రాంతాలకు ప్రతి ఐదునిముషాలకు ఒక బస్సు నడిచేలా ఏర్పాట్లు చేసింది. అదే విధంగా జిల్లాలోని అన్ని గ్రామీణ ప్రాంతాలకు జిల్లాలోని అన్ని డిపోల నుంచి బస్సులు ఏర్పాటుచేసింది. రద్దీకి అనువుగా అదనపు బస్సులు నడిపేలా ఏర్పాట్లు చేసింది. సొంత ప్రాంతాలకు తరలుతున్న జనాలతో అన్ని బస్సులు నిండుగా కనపడుతున్నాయి. జిల్లాలోని వివిధ డిపోలకు చెందిన బస్సులతో పాటు హైద్రాబాద్ నగరం నుంచి కూడా వరంగల్‌కు ఆర్టీసి ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఆర్టీసి బస్సులకు తోడుగా వరంగల్ నగరం నుంచి హైద్రాబాద్‌కు భారీసంఖ్యలో కార్లు, క్రూయిజర్లు, ఇతర ప్రైవేటు వాహనాలు కూడా ప్రయాణికులను తరలిస్తున్నాయి. ఇకపోతే సంక్రాంతి పండుగకు సొంత ప్రాంతాలకు తరలే ప్రయాణికులతో వరంగల్, కాజీపేటల ద్వారా వెళ్లే అన్ని రైళ్లు కిటకిటలాడుతున్నాయి. ఆంధ్రప్రాంతంలో సంక్రాంతి పండుగను అట్టహాసంగా జరుపుకుంటున్న నేపథ్యంలో వరంగల్, కరీనంగర్ జిల్లాలో పనిచేస్తున్న ఆ ప్రాంతాలకు చెందిన ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో తమతమ సొంత ప్రాంతాలకు తరలటం బుధవారం నుంచి ప్రారంభమయింది. రెండునెలల కిందటే సంక్రాంతి సెలవుల్లో సొంత ప్రాంతాలకు తరలేందుకు ముందస్తు రిజర్వేషన్లు జరగంతో గడచిన రెండురోజులుగా తత్కాల్ టికెట్ల కోసం భారీ డిమాండ్ ఏర్పడింది. ఒక తత్కాల్ టికెట్‌కు దూరాన్నిబట్టి రెండువందల నుంచి ఐదువందల రూపాయల వరకు అదనంగా వసూలు చేసినట్లు కొందరు ప్రయాణికులు తెలిపారు. అటు హైద్రాబాద్, ఇటు బల్లార్షా నుంచి విజయవాడ, విశాఖ, నెల్లూరు ప్రాంతాలకు వెళ్లే అన్ని రైళ్లలో నిలబడటానికి కూడా చోటులేని పరిస్థితుల్లో ప్రయాణికులు ఆయా ప్రాంతాలకు తరలుతున్నారు. ముందస్తు రిజర్వేషన్ ఉన్నా కూడా రద్దీ అధికంగా ఉండటం, అవసరాలకు సరిపడు జనరల్ బోగీలు లేని కారణగా సాధారణ ప్రయాణికులు రిజర్వ్ బోగీలలో బలవంతంగా దూరి రిజర్వ్ బెర్తులను ఆక్రమిస్తుండటంతో బెర్తులు రిజర్వ్ చేసుకున్న ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. సంక్రాంతి కోసం దక్షిణమధ్య రైల్వే ఏర్పాటుచేసిన ప్రత్యేక రైళ్లు కూడా ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. శుక్రవారం కూడా వరంగల్- విజయవాడ మార్గంలో బస్సులలో, రైళ్లలో తరలివెళ్లే ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.