వరంగల్

మమ్మేలు మల్లన్న స్వామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వర్ధన్నపేట, జనవరి 15 : ప్రతి ఏటా కాకతీయుల పాలన నుండి నిర్వహిస్తున్న ఐనవొలు మల్లన్న బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది కూడా భక్త జనంతో ఐనవోలు కిటకిటలాడింది. మకర సంక్రాంతి పర్వదినాన మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణం భక్త జనసందోహంతో నిండిపోయింది. మమ్మేలు మల్లన్న అంటూ డప్పుల మోతతో డమరుక నాదాలు శివసత్తుల పూనాకాలతో ఐనవోలు మారుమోగింది. లక్షల సంఖ్యలో భక్తులు తరలిరావడం ఆనవాయితిగా మారడంతో ఈ ఏటా కూడా అది కోనసాగింది. అధికారులు అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా వచ్చిన భక్తులతో మల్లన్న జాతర కొలాహలంగా సాగింది. సంక్రాంతి పర్వదినాల్లో మల్లికార్జున సామి, బలిజ మేడలమ్మ, గొల్లకేతమ్మలను అధిక సంఖ్యలో భక్తులు దర్శించారు. ఎల్లమ్మ దేవతకు బొనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అధిక సంఖ్యలో వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసి పోయింది. ఆలయ సమీపంలోని నృత్య మండపంలో ప్రత్యేక నాట్య బృందాలతో ఏర్పాటు చేసిన కార్యక్రమం చూపరులను కట్టివేసింది. బోనాలకు టెంకాయలు కొట్టి కుండలోని చల్లను భక్తులకు పంపిణి చేసిన చల్లను తాగుతే ఎలాంటి వ్యాదులు రావని భక్తుల నమ్మకం బండారి (పసుపు)తో శివస్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చేల్లించు కున్నారు. ఒడి బియ్యంతో మహిళలు సంతానం కలగాలని, వివాహం జరగాలని యువతులు వరం పట్లారు. ఆలయంలో చిన్నపట్నాలు వేసుకొని మొక్కులు తీర్చారు.
బండ్ల శోభాయాత్ర..
సంక్రాంతి రోజున ఆలయంలో నిర్వహించే ప్రదాన ఘట్టం అయిన పెద్ద బండి, ప్రభబండ్లు శోభయాత్ర శనివారం రాత్రి కన్నుల పండుగగా జరిగింది. రాత్రి 9 గంటల నుండి తెల్లవారి జామున 3 గంటల వరకు ప్రబబండ్ల శోభయాత్రను నిర్వహించారు. మార్నేని వంశానికి చెందిన స్థానిక ఎంపిపి మార్నేని రవీందర్‌రావు ఆధ్వర్యంలో పెద్ద బండ్ల శోభయాత్ర ఘనంగా నిర్వహించి, స్థానికులు, పక్క గ్రామాల రైతుల కూడా బండ్లను కట్టారు.
మల్లన్నను దర్శించుకున్న ప్రముఖులు...
జానపదుల జాతరగా ప్రసిద్దిగాంచి ఐనవోలు మల్లన్న జాతరకు రాష్ట్ర సిని ఫోటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు, రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్‌లు దర్శించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహంచారు. వీరికి ఆలయ అభివృద్ది కమిటీ చైర్మన్ గజ్జెల శ్రీరాములు, ఆలయ అభివృద్ది అధికారి శేషు భారతిలు ఆలయ సాంప్రదాయం ప్రకారం పట్టు వస్త్రాలు సమర్పించారు.

పతంగుల పండుగను
విజయవంతం చేయాలి
*నేడు నగరంలో హెరిటేజ్ వాక్
*అర్బన్ కలెక్టర్ అమ్రపాలి
నక్కలగుట్ట,జనవరి 15: ఈనెల 17న నిర్వహించనున్న అంతర్జాతీయ పతంగుల పండుగను విజయవంతం చేయాలని అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి పిలుపునిచ్చారు. పతంగుల పండుగను పురస్కరించుకుని సోమవారం ఉదయం 6.30గంటలకు హన్మకొండ పబ్లిక్ గార్డెన్ నుండి సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వరకు సాంస్కృతిక నడకను నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. పతంగుల పండుగను నిర్వహించుటకు ఒకరోజు ముందుగానే స్థానికులచే ఈ ప్రత్యేక సాంస్కృతిక నడకను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, నగర ప్రజలు, ఔత్సాహికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.