వరంగల్

బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడూరు, జనవరి 15: బయ్యారంలో ఉక్కు పరిశ్రమను నెలకొల్పి ఈ ప్రాంత యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్ ప్రభుత్వం పేదలకు చేసిందేమి లేదన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన మహాజన పాదయాత్ర మహబూబాబాద్ నుండి కొంగరిగిద్ద మీదుగా ఆదివారం మధ్యాహ్నాం మట్టెవాడకు చేరుకుంది. మట్టెవాడ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడారు. తెలంగాణలో 93 శాతం ఉన్న దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు కెసిఆర్ ప్రభుత్వం చేసిందేమి లేదన్నారు. తెలంగాణ వచ్చి రెండున్నరేళ్లు కావస్తున్నా ఎవరి తలరాతలు మారలేదన్నారు. మాటల గారడితో కెసి ఆర్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతుందని విమర్శించారు. ఎన్నికల ముందు తెలంగాణ సమాజానికి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో అధికార పార్టీగా పూర్తిగా విఫలం అయిందన్నారు. పేదలకు ఇంగ్లీష్ విద్యను అందిస్తామన్న ముఖ్యమంత్రి కెసి ఆర్ ఆచరణలో ఏ ఒక్క నూతన ఇంగ్లీష్ మీడియం పాఠశాలను ప్రారంభించలేదని అన్నారు. ఇప్పటికే 610 ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజన జనాభా అత్యధికంగా ఉన్న మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విద్యా, వైద్య రంగంలో ఎలాంటి పురోగతి లేదని, పేదలకు కార్పోరేట్ వైద్యాన్ని, విద్యను అందించాలని కోరారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజనులకు పది ఎకరాల భూమి ఉండోచ్చని చట్టం చెబుతున్నా కెసిఆర్ ప్రభుత్వం మాత్రం హరిత హారం పేరుతో పేదల ఆధీనంలో ఉన్న పోడు భూములను లాక్కోవడం దారుణమని వాపోయారు. సమస్యలతో సతమతమవుతున్న అన్ని వర్గాల ప్రజలు ఐక్యతతో కెసిఆర్ ప్రభుత్వానికి వ్యతిరేఖంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కాగా మహాజనపాదయాత్రకు కాంగ్రెస్, టిడిపి, ఎంసిపిఐ(యూ), ఎమ్మార్పీఎస్, మాలమహానాడులకు చెందిన నాయకులు ఎంపిపి చెల్పూరి వెంకన్న, కత్తి స్వామి, మహ్మద్ యాకూబ్‌పాష, గుగ్గిళ్ల పీరయ్య, పాశం సాంబయ్య, పానుగంటి నర్సయ్య, నూకల ఉపేందర్, పిల్లి సుధాకర్‌లు స్వాగతం పలికారు. ఈపాదయాత్రలో పాదయాత్ర బృందంతో పాటు స్థానిక మండల కార్యదర్శి వాంకుడోతు భరత్‌నాయక్ పాల్గొన్నారు.