వరంగల్

ప్రజావాణి ఫిర్యాదులపై శ్రద్ధ వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నక్కలగుట్ట,జనవరి 16:ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై దరఖాస్తు చేసుకున్న ప్రజల ఫిర్యాదులను, విజ్ఞప్తులను సంబంధిత శాఖల అధికారులు సత్వర పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ద వహించాలని అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుండి వినతి పత్రాలను స్వీకరించి, పరిష్కార మార్గాలను సూచించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ తమ ప్రాంతాలలో అపరిష్కృతంగా ఉన్న ప్రభుత్వ అభివృద్ది పనులు, భూ వివాదాలు, సంక్షేమ పథకాల అమలు, పించన్ల మంజూరి, విద్య, ఉద్యోగ, ఉపాధి, వైద్యం వంటి పలు సమస్యలకు ప్రజావాణి కార్యక్రమం ద్వారా పరిష్కారం లభిస్తుందనే భావనతో ప్రజలు కలెక్టరేట్‌కు వస్తున్నారని తెలిపారు. అధికారులు ప్రజల ఆవేదనను, బాధలను సానుకూలంగా దృక్పథంతో పరిశీలించి, సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని అధికారులకు సూచించారు. ప్రజావాణిలో ప్రజల వినతి పత్రాలను స్వీకరించి, సమస్యలను తగిన సమయంలో పరిష్కరించాలని, పరిష్కారం కాని దరఖాస్తుల స్థితిగతులను అంతర్జాలంలో పొందుపరచాలని కోరారు. సమావేశంలో డిఆర్‌ఓ శోభ, సిపిఒ రాంచందర్‌రావు, ఎఒ కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.

అర్హులందరికీ
సంక్షేమ పథకాలు
* జనగామ కలెక్టర్ శ్రీదేవసేన
జనగామ టౌన్, జనవరి 16: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ అందే విధంగా సంబంధిత అధికారులు బాధ్యతాయుతంగా కృషిచేయాలని జనగామ కలెక్టర్ శ్రీదేవసేన ఆదేశించారు. సోమవారం జనగామ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి శ్రీదేవసేనతో పాటు జెసి గోపాలకృష్ణ ప్రసాద్‌రావులు హాజరై స్వయంగా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. తక్షణమే పలు సమస్యలను పరిష్కరించేందుకు అధికారులతో పాలనా పరమైన చర్యలకు ఆదేశించారు. అనంతరం కలెక్టర్ శ్రీదేవసేన మాట్లాడుతూ ప్రభుత్వాలు అర్హులైన ప్రజలందరికీ లబ్ది చేకూర్చేందుకు అనేక పథకాలను రూపొందిస్తుందని, వాటిని అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని గుర్తుచేశారు. గతంలో కొన్ని కారణాల వల్ల నిజమైన లబ్దిదారులకు నష్టం జరిగిందని, ఇక నుంచి అలాంటి పరిస్థితులు రావొద్దన్నారు. గ్రామాల్లో పర్యటించినప్పుడే ప్రజల స్థితిగతులు అవగతమవుతాయని అన్నారు.