వరంగల్

నేడు అంతర్జాతీయ పతంగుల పండుగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వడ్డేపల్లి, జనవరి 16: చారిత్రాత్మక వరంగల్ నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ పతంగుల పండుగలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అర్బన్ కలెక్టర్ అమ్రపాలి పిలుపునిచ్చారు. సోమవారం అంతర్జాతీయ పతంగుల పండుగపై ప్రజలలో అవగాహన కల్పించడానికి పబ్లిక్ గార్డెన్ నుండి ఆర్ట్స్ కళాశాల మైదానం వరకు భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ అవగాహన ర్యాలీని అర్బన్ కలెక్టర్ అమ్రపాలి, సిపి సుధీర్‌బాబు, పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌లు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా వరంగల్ నగరంలో అంతర్జాతీయ పతంగుల పండుగను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వివిధ దేశాలకు చెందిన 31 మంది అంతర్జాతీయ పంతగులను ఎగరవేసే క్రీడాకారులు, తొమ్మిది మంది జాతీయ స్థాయి క్రీడాకారులు వివిధ ఆకృతులు గల పతంగులను ఎగురవేస్తారని పేర్కొన్నారు. ఈ వేడుక సందర్భంగా ఆర్ట్స్ కళాశాల మైదానం ఆవరణలో జిల్లాలో తయారవుతున్న వివిధ ఉత్పత్తుల విక్రయాలు, పలు దుకాణ సముదాయాలతోపాటు, ప్రత్యేక ఆకర్షణగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామని తెలిపారు. పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ ప్రభుత్వ సహకారంతో నగరంలో క్రీడారంగం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడతామని అన్నారు. గతంలో జిల్లా యంత్రాంగం, క్రీడలశాఖ, పర్యాటక శాఖల అధ్వర్యంలో వివిధ క్రీడాంశాలలో అనేక అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయిలో కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సంవత్సరం వినూత్న రీతిలో అంతర్జాతీయ పతంగుల పండుగను నిర్వహించడం హర్షించదగినదని, క్రీడాకారులకు, క్రీడాభిమానులకు, ప్రజలకు మంచి అనుభూతిని కలిగిస్తుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సిపి సుధీర్‌బాబు మాట్లాడుతూ జిల్లాలో క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అంతర్జాతీయ, జాతీయ క్రీడలను నిర్వహించడం సంతోషకరమైన విషయమని అన్నారు. ఈ ఉత్సవానికి కమిషనరేట్ పరిథిలో ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శృతి ఓఝా, మేయర్ నన్నపనేని నరేందర్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, పర్యాటక అధికారి శివాజీ, కార్పొరేటర్ బొడ డిన్న, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దేవానంద్ తదితరులు పాల్గొన్నారు.
పంతగుల పండుగకు
ఆర్ట్స్ కళాశాల మైదానం సిద్ధం
అంతర్జాతీయ పతంగుల పండుగకు నగరంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ప్రపంచ వ్యాప్తంగా హాజరయ్యేందుకు వివిధ దేశాల ప్రతినిధులు వస్తున్నందున, అన్ని ఏర్పాట్లను కలెక్టర్ అమ్రపాలి, మున్సిపల్ కమిషనర్ శృతి ఓఝాలు స్వయంగా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ ఉత్సవాలను ప్రజలు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా వీక్షించేలా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇంటింట మరుగుదొడ్డి
నిర్మించాలి: కలెక్టర్ ప్రీతిమీనా
మరిపెడ, జనవరి 16: ఇంటింటా మరుగుదొడ్డి నిర్మించి స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దుకోవాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రీతిమీనా అన్నారు. సోమవారం మరిపెడ మండలకేంద్రంలోని సీతాపుర్ కాలనీ వాసులు మోడల్ కాలనీలా తీర్చుదిద్దుకునే క్రమంలో స్వచ్ఛత ప్రొగ్రాములు ఏర్పాటు చేసుకోగా కలెక్టర్ ప్రీతిమీనా, నియోజకవర్గ ఎమ్మెల్యే రెడ్యానాయక్, ఎస్పీ మురళీధర్, జెసి దామోదర్‌రెడ్డి కాలనీలో మొక్కలు నాటారు. రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఉన్నత పాఠశాల, కురగాయాల మార్కెట్‌ను సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందన్నారు. ఇంటింటా చెట్లు నాటి పరిశుభ్రతకు మరోపేరుగా నిలిచారని ఇక్కడి కాలనీ వాసులు ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలువడం గర్వకారణం అన్నారు. ప్రభుత్వం తరుపున అన్ని విదాల ఈ గ్రామానికి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్య సేవలు కల్పించేదిశగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులందరికి బెంచీల ఏర్పాటు, బాలబాలికలకు విడివిడిగా మరుగుదొడ్లు, 300మందికి పైగా ఉన్న పాఠశాలలకు స్వచ్ఛమైన నీరందించేదిశగా వాటర్‌ప్లాంట్‌ల ఏర్పాటుకు నిదులు వెచ్చించి సౌకర్యాలు కల్పిస్తామన్నారు.
నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం..
సిఎం కేసీఆర్ సహకారంతో నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా కృషి చేయనున్నట్లు ఎమ్మెల్యే రెడ్యానాయక్ తెలిపారు. మరిపెడ మండలకేంద్రంలో సోమవారం కలెక్టర్, ఎస్పీ, జెసిలతోకలసి రూ.30లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి అనంతరం మాట్లాడారు. ప్రతి గ్రామానికి తాగునీరు, రోడ్డు సౌకర్యం అందించేవిధంగా తన వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. స్వచ్ఛత కార్యక్రమానికి ముందుకు వచ్చిన సీతరాంపురం కాలనీ వాసులన అభినందించారు. బంగారు తెలంగాణ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.