వరంగల్

వరంగల్‌కు హెలీ టూరిజం ప్రాజెక్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జనవరి 17: వారసత్వ నగరంగా ఎంపికైన వరంగల్‌లో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు మంజూరుచేసిన వివిధ పథకాలను సక్రమంగా వినియోగించుకుంటే మరిన్ని పథకాలు మంజూరు చేసేందుకు అవకాశం ఉంటుందని రాష్ట్ర పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం అన్నారు. చారిత్రకంగా, పారిశ్రామికంగా ఎన్నో అవకాశాలు ఉన్న వరంగల్ నుంచి రోజుకు వంద బుకింగ్‌లు చూపించగలిగితే వారంరోజుల్లో హెలికాప్టర్ సౌకర్యం ప్రారంభించి హెలీ టూరిజంను అభివృద్ధి చేస్తామని తెలిపారు. నగరంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో మంగళవారం అంతర్జాతీయ పతంగుల పండుగ జరిగింది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ముఖ్య కార్యదర్శి వెంకటేశం జ్యోతి వెలిగించి పతంగుల పండుగను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చారిత్రక నగరం వరంగల్ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించాలంటే ప్రభుత్వం, అధికారులతోపాటు నగరంలోని ప్రతి పౌరుడు తనవంతు బాధ్యత నిర్వర్తించాలని సూచించారు. నగరానికి చారిత్రక వారసత్వం ఉందని, దీనికితోడుగా కేంద్రప్రభుత్వం గత ఏడాది ఉత్తమ వారసత్వ నగరంగా ప్రకటించిందని, ఈ గుర్తింపును నిలబెట్టుకోవటానికి ప్రతి ఒక్కరు నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్‌గా ఉంచడానికి ప్రయత్నించాలని కోరారు. పర్యాటకులు పెరిగితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, దీనివల్ల నగరం ప్రాధాన్యత ప్రపంచ దేశాల దృష్టికి వెడుతుందని చెప్పారు. ఒకరికొకరు గౌరవంగా ఉండటంతోపాటు అతిథుల విషయంలో కూడా ఇదే జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. వరంగల్ నగరానికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కైట్ ఫెస్టివల్‌ను వరంగల్ నిర్వహించాలని తాము ప్రతిపాదించిన వెంటనే రెండు గంటల్లో అధికారిక ఉత్తర్వులు జారీ చేసారని తెలిపారు. రాష్ట్రప్రభుత్వం వరంగల్ నగరానికి మంజూరు చేస్తున్న ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తిచేసి చారిత్రక ప్రాధాన్యత నిలబెట్టుకోవాలని సూచించారు. పురావస్తుపై త్వరలో నిర్వహించే సెమినార్‌ను వరంగల్‌లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.

పురాతన కట్టడాలను
కాపాడుకోవాలి
* టూరిజం శాఖ ప్రభుత్వ కార్యదర్శి బుర్ర వెంకటేశం
జఫర్‌గడ్, జనవరి 17: పురాతన కట్టడాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరింత అభివృద్ధి చేస్తుందని పర్యాటక, క్రీడా, సాంస్కృతిక శాఖ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి బుర్ర వెంకటేశం అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని పురాతన కట్టడాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురాతన కట్టడాల కోసం రాష్ట్ర టూరిజం శాఖ నుంచి జఫర్‌గడ్ మండల కేంద్రంలో ఉన్నటువంటి కట్టడాల కోసం కోటి నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ నిధులతో కోటలన్నింటినీ అభివృద్ధి పరుస్తామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనంత విధంగా కోటలు అద్భుతంగా ఉన్నాయని, వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రానున్న రోజుల్లో ఇటువంటి కోటల అభివృద్ధి కోసం మరిన్ని నిధులను విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు. టూరిజం శాఖలో రూ. 7కోట్ల నిధులుండగా జనగామ జిల్లాకే రూ. 2కోట్లు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఇట్టి కోటలపై పూర్తి నివేదికలు తయారుచేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం జరుగుతుందని, అవసరమైతే ప్రభుత్వ శాఖ నుంచి నిధులు విడుదల చేసి మరింత అభివృద్ధి పరుస్తామని అన్నారు. ఆయన వెంట తహశీల్దార్ మనోహరచారి, ఆర్‌ఐ సంజీవ, విఆర్వోలు శ్రీకాంత్, రవి, విఆర్‌ఏ కర్ణాకర్ తదితరులు ఉన్నారు.