వరంగల్

శెభాష్..‘ముల్కనూర్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమదేవరపల్లి, జనవరి 19: ముల్కనూర్ సహకార గ్రామీణ బ్యాంకు రైతులకు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని కలెక్టర్ అమ్రపాలి కొనియాడారు. భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో గురువారం వరంగల్ రెడ్‌క్రాస్ సోసైటీ ఏర్పాటు చేసిన జనరిక్ మందుల దుకాణంను జిల్లా కలెక్టర్ అమ్రపాలి, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డిలు ప్రారంభోత్సవం చేశారు. ముల్కనూర్ సహకార బ్యాంకును చూసి తాము ఈ బ్యాంకును మిగతా సంఘాలకు ఆదర్శంగా చూపించాలని అనుకుంటున్నామని పేర్కొన్నారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్ మాట్లాడుతూ ముల్కనూర్ సహకార గ్రామీణ బ్యాంకుకు నోట్ల రద్దు ప్రభావం అధికంగా పడిందని ఈ విషయంపై ఆర్ధిక శాఖమంత్రి ఈటల రాజేందర్‌తో మాట్లాడడం జరిగిందన్నారు. నేషనల్ బ్యాంకు వారి సహకారంతో ముల్కనూర్ సహకార బ్యాంకులో ప్రైవేటు వారి ఏటిఎంలు పెట్టుకోవచ్చన్నారు. ముల్కనూర్ సహకార గ్రామీణ బ్యాంకు అధ్యక్షులు అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి మాట్లాడుతూ బ్యాంకులో ప్రతిరోజు ఒకకోటి రూపాయల లావాదేవీలు జరుగుతాయన్నారు. సహకార బ్యాంకులో ఒక ఏటిఎం, స్వైప్ మిషన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు. సమావేశంలో ఎంపిపి సంగ సంపతయాదవ్, సర్పంచ్‌లు వంగ రవిందర్‌గౌడ్, సయ్యద్ షరీఫోద్దిన్, భీమదేవరపల్లి మండల పరిషత్ అధ్యక్షులు నర్సింహరెడ్డి, తహశీల్దార్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.