వరంగల్

నోట్ల రద్దుతో 100 కోట్ల మందికి అవస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జనవరి 19: పెద్దనోట్లను రద్దు చేయటం ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోడీ 100కోట్ల దేశప్రజలకు ఇబ్బందులు సృష్టిచారని, పెద్దనోట్ల రద్దు వ్యవహారం ప్రధాని అనాలోచిత నిర్ణయంగా చెబుతు ఈ చర్య దేశప్రగతికి ఆటంకంగా మారిందని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని మొదట తుగ్లక్ చర్యగా అభివర్ణిచిన ముఖ్యమంత్రి చంద్రశేఖరావు ఇప్పుడు పెద్దనోట్ల రద్దుకు మద్దతుగా నిలవటం శోచనీయమని చెప్పారు. ఏఐసిసి, పిసిసి పిలుపుమేరకు మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్దనోట్ల రద్దుకు వ్యతిరేకంగా నగరంలోని ఇస్లామియా కళాశాల ఆవరణలో గురువారం నిర్వహించిన నిరసన కార్యక్రమానికి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు పెద్దనోట్ల రద్దు కారణంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉందని ముఖ్యమంత్రి స్వయంగా అంగీకరిస్తునే ప్రధాని నరేంద్రమోడీకి మద్దతు తెలిపే విధంగా వ్యవహరిస్తూ ప్రజల కష్టాలను పట్టించుకోవటం లేదని విమర్శించారు. పెద్దనోట్ల రద్దుతో రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు కలుగుతున్నాయని చెబుతున్న ముఖ్యమంత్రి మరి ఎటువంటి బంగారు తెలంగాణను నిర్మిస్తారని ప్రశ్నించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో తమ భవిష్యత్తు బాగుంటుందని అన్ని వర్గాలు బావించాయని, కానీ ముఖ్యమంత్రి చర్యలవల్ల ప్రజల్లో నిరాశ, నిస్పృహలు పెరిగిపోతున్నాయని తెలిపారు. రాష్ట్రప్రభుత్వానికి కౌంట్‌డౌన్ ప్రారంభమయిందని, ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిన కారణంగా వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ హయాంలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్లకు బిల్లుల చెల్లింపులలో రాష్ట్రప్రభుత్వం వివక్షతతో వ్యవహరిస్తోందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలకు అతీగతి లేకుండా పోయిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గతంలో మంజూరు చేసిన సింగిల్ హాల్ ఇళ్లకు తోడుగా మరో సింగిల్ హాల్ ఇళ్లను మంజూరు చేస్తుందని హామీ ఇచ్చారు. ఏఐసిసి కార్యదర్శి కుంతియా మాట్లాడుతు కుటుంబ వ్యవహారాలను నడిపే మహిళలపై పెద్దనోట్ల ప్రభావం తీవ్రంగా ఉందని, తండ్రులు, భర్తలు, అన్నాతమ్ముళ్లు సంపాదించిన డబ్బులో కొంతమేరకు పొదుపు చేసే మహిళలకు పెద్దనోట్ల రద్దు వ్యవహారంతో అవస్థలు తప్పటం లేదని అన్నారు. ప్రధానమంత్రి అధికారులను, ఉద్యోగులను, ప్రతిపక్షాలను బెదిరించవచ్చు.. కానీ మహిళలను ఏమీ చేయలేరని, పెద్దనోట్ల వ్యవహారంలో మహిళలు ప్రతాపం చూపించాలని సూచించారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ, అనుబంధ విభాగాలు మహిళలకు అండగా ఉంటాయని చెప్పారు. శాసనమండలి కాంగ్రెస్ పక్ష నాయకుడు ప్రధానమంత్రి నరేంద్రమోడీ పెద్దనోట్లపైనే కాకుండా అక్రమ సంపాదన పేరిట మహిళల బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేసారని, కానీ ప్రతిపక్షాలు అడ్డుపడిన కారణంగా తాత్కాలికంగా ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకున్నారని చెప్పారు. కానీ అక్రమ సంపాదన పేరిట మహిలల బంగారాన్ని లాక్కునే ప్రమాదం ఎప్పటికైనా తప్పదనే అనుమానం వ్యక్తం చేసారు. పెద్దనోట్ల రద్దుతో నల్లధనం బయటకు వస్తుందని ప్రధాన మోడీ పదేపదే ప్రకటనలు చేసారని, మరి ఇప్పటివరకు ఎంతమేరకు నల్లధనం బయటకు వచ్చిందని ప్రశ్నించారు. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు శారద మాట్లాడుతు పెద్దనోట్ల రద్దుతో మహిళలు చాలా ఇబ్బందులకు గురయ్యారని తెలిపారు. అవసరాల మేరకు నగదు లభించక కుటుంబ పోషణ విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతు పెద్దనోట్ల రద్దుతో వ్యవసాయ రంగం, కులవృత్తులు దెబ్బతిన్నాయని చెప్పారు. మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర రమణారెడ్డి మాట్లాడుతు పెద్దనోట్ల రద్దు అనంతరం బడా పారిశ్రామికవేత్తలు తమ వద్ద ఉన్న నల్లధనాన్ని సులువుగా మార్చుకోగా పేదలు మాత్రం నానాకష్టాలు పడ్డారని తెలిపారు. మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పోశాల పద్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ కేంద్రమంత్రి బలరాంనాయక్, ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఇనగాల వెంకట్రాంరెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఎర్రబెల్లి స్వర్ణ, జంగా రాఘవరెడ్డి, బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పలువురు మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

కేంద్ర పథకాలకు తూట్లు
కెసిఆర్ సర్కార్‌పై బిజెపి శాసనసభా పక్షం నేత కిషన్‌రెడ్డి ధ్వజం
గూడూరు, జనవరి 19: కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్రంలోని కెసిఆర్ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని బిజెపి శాసనసభా పక్షం నేత మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆరోపించారు. గూడూరు మండల కేంద్రంలో గురువారం సాయంత్రం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన పథకాన్ని ప్రవేశపెట్టిందని చెప్పారు. అయితే, ఈ పథకాన్ని గ్రామ స్థాయిలో ప్రచారం చేయాల్సిన ప్రభుత్వం ఏమాత్రం ప్రచారం చేయకపోవడం శోచనీయమని అన్నారు. రైతులు ఈ పథకాన్ని వినినియోగించుకుంటే ప్రకృతి వైపరీత్యాల మూలంగా పంటలు కోల్పోయిన సమయంలో పరిహారం అందే అవకాశం ఉంటుందని చెప్పారు. రైతు సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందరి రైతులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. కాగా, ఎన్నికల ముందు తెలంగాణ సమాజానికి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కెసి ఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందన్నారు. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయాలని, ఇందుకు వచ్చే బడ్జెట్‌లో తగిన నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో రబీ పంట రుణాలను తక్షణమే రైతాంగానికి అందించాలని కోరారు. ఈ విలేఖరుల సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్, నిజమాబాద్ జిల్లా అధ్యక్షుడు గంగిరెడ్డి, మనోహర్, రావు పద్మ, సమ్మెట సుధాకర్, మేర్గు మల్లయ్య, పడాల నాగరాజు, పేరాల సురేందర్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఏజెన్సీలో నివసిస్తున్న గీత కార్మికులను ఎస్టీ జాబితాలో చేర్చాలని గీత కార్మిక సంఘం జిల్లా నాయకుడు పానుగంటి వీరస్వామి ఆధ్వర్యంలో గీత కార్మికులు కిషన్‌రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు.