వరంగల్

గోదావరి జలాలతో రైతుల కష్టాలు తీరుస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిట్యాల, జనవరి 19: గోదావరి నది జలాలతో ఎస్‌ఆర్‌ఎస్‌పి కాలువల ద్వారా రైతుల కష్టాలు తీరుస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే, స్పీకర్ సిరికొండ మధుసూధనాచారి అన్నారు గురువారం మండలంలోని జూకల్లు గ్రామంలో డిబిఎం-38 కాలువల ద్వారా ఎస్‌ఆర్‌ఎస్‌పి జలాలు వచ్చిన సందర్భంగా స్పీకర్ ముఖ్య అతిధిగా హాజరై గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ గత పాలకులు కాలువలు తవ్వి వదిలేసారని ఆంధ్రా ప్రాంతానికి తరలించుకపోయి తెలంగాణ భూములను ఎడారిగా మార్చారని ఆరోపించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలోనే టిఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ భూములను సశ్యశ్యామలం చేయడమే ధ్యేయంగా పని చేస్తుందని అన్నారు. ఇందుకోసం ప్రాజెక్టులను రీడిజైనింగ్ చేయడం జరగుతుందని, ప్రతి ఎకరాకు నీరు అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్తశుద్దితో పని చేస్తున్నారని స్పీకర్ స్పష్టం చేశారు. ఇప్పటికే మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్దరించడం జరగుతుందని, చెక్‌డ్యాంలను సైతం నిర్మిస్తున్నామని స్పీకర్ తెలిపారు. డిబిఎం-38 కాలువల ద్వారా మూడు విడుతలుగా 9 రోజుల చొప్పున నీటిని విడుదల చేయనున్నట్లు స్పీకర్ తెలిపారు. రేగొండ, చిట్యాల, టేకుమట్ల మండలాల్లోని వేల ఎకరాలకు ఎస్‌ఆర్‌ఎస్‌పి నీటిని అందించి ఈప్రాంత రైతుల చిరకాల వాంఛను నెరవేర్చనున్నట్లు స్పీకర్ పేర్కొన్నారు. చివరి ఆయకట్టు వరకు నీటిని అందించడం జరగుతుందని రైతులు అధికారులకు సహకరించాలని స్పీకర్ కోరారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ జయంత్, ఎంపిడిఓ త్రివిక్రమరావు, రాష్ట్ర యువజన నాయకులు సిరికొండ ప్రశాంత్, జిల్లా మండల నాయకులు పున్నం రవీందర్‌రెడ్డి, మల్లయ్య, శంకర్, స్థానిక సర్పంచ్, ఎంపిటిసిలు పాల్గొన్నారు.

క్రమశిక్షణ.. నిజాయతీ
రైతులు, ముల్కనూరు సహకార బ్యాంక్‌ను అభినందించిన కలెక్టర్ అమ్రపాలి
భీమదేవరపల్లి, జనవరి 19: అనేక సహకార గ్రామీణ బ్యాంకులు ఉన్నప్పటికీ ముల్కనూర్ సహకార గ్రామీణ బ్యాంకులోని రైతులు క్రమశిక్షణ కలిగిన వారని, దానికి తోడు నిజాయితీతో కూడిన పాలకవర్గం ఉండడం వల్ల నేడు ఆసియా ఖండంలోనే ముల్కనూర్ సహకార గ్రామీణ బ్యాంకు ఖ్యాతి గాంచిందని వరంగల్ అర్బన్ కలెక్టర్ అమ్రాపాలి పేర్కొన్నారు. భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ బ్యాంకు పరిధిలోని కాటన్ జిన్నింగ్ మిల్లు, పారాబాయిల్డ్ రైసుమిల్లును గురువారం కలెక్టర్ అమ్రపాలి, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్‌లు సందర్శించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి కలెక్టర్‌కు, ఎమ్మెల్యేకు ముల్కనూర్ సహకార బ్యాంకు రైతులకు అందిస్తున్న సేవలపై వివరించారు. అనంతరం కలెక్టర్, ఎమ్మెల్యేలకు బ్యాంకులో రైతులకు బ్యాంకు ఆవిర్భావం నుండి అందిస్తున్న సేవలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వినిమియ సేవలను చూపించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అనేక రకాల సహకార సంఘాల గురించి విన్నాం.. కానీ చాలా సహకార సంఘాలు సరైన పనితీరు లేకపోవడంతో మూల పడ్డాయన్నారు. ముల్కనూర్ సహకార బ్యాంకు సక్సెస్‌కు కారణం వారి నిజాయితే అని కితాబిచ్చారు. మరోసారి ముల్కనూర్ సహకార గ్రామీణ బ్యాంకు వచ్చి ఇక్కడే ఒకరోజు మొత్తం ఇక్కడే గడుపుతానని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా సహకార అధికారి చక్రధర్‌రావు, ముల్కనూర్ సహకార గ్రామీణ బ్యాంకు జనరల్ మేనేజర్ మార్పాటి రాంరెడ్డి, భీమదేవరపల్లి మండల పరిషత్ అధ్యక్షులు సంగ సంపత్, భీమదేవరపల్లి తహశీల్దార్ కిరణ్, భీమదేవరపల్లి ఎంపిపి నర్సింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు.