వరంగల్

నోట్ల రద్దు ఓ కుంభకోణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, జనవరి 20: పెద్దనోట్ల రద్దు, విద్యారంగంపట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరిని నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కోర్టు సెంటర్‌లో ప్రదాని నరేంద్రమోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ యువజన కాంగ్రెస్ పార్లమెంట్ ఇన్‌చార్జి దిలీప్‌రెడ్డి, యువజన కాంగ్రెస్ పార్లమెంట్ అధ్యక్షుడు పొరిక సాయిశంకర్‌లు మాట్లాడుతూ.. పెద్దనోట్ల రద్దు ఓ పెద్ద కుంభకోణం అన్నారు. నల్లధనం దాచుకున్న వ్యక్తులు ఒక్కరు కూడా బ్యాంకుల వద్ద క్యూలో నిలబడలేదని, సామాన్య ప్రజలు మాత్రం అష్టకష్టాలు పడ్డారన్నారు. ఇప్పటికి పెద్దనోట్ల రద్దు మూలంగా తీవ్ర ఇబ్బందులను సామాన్య, మధ్య తరగతి ప్రజలు, చిరువ్యాపారులు ఎదుర్కొంటున్నారన్నారు. రోజువారి దినసరి కూలీలు, రైతులు తీవ్రంగా సంక్షోభంలోకి నెట్టివేయబడ్డారన్నారు. రూ. 2వేల నోటును ప్రవేశపెట్టడం వల్ల చిల్లర దొరుకక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, బిజెపి ఎమ్మెల్యే, కేంద్ర ప్రభుత్వ ఆశీస్సులు ఉన్న వ్యక్తుల వద్ద మాత్రం కట్టలు కట్టలుగా నోట్లు బయటపడుతున్నాయన్నారు. నల్లధనం వెలికితీయడం అంటే ప్రజలను ఇబ్బందుల పాలు చేయడం కాదని మోదీ గుర్తించాలన్నారు. 50రోజుల్లో సాదారణ పరిస్థితి తీసుకువస్తానని ప్రధాని చెప్పారని నేటికి 75 రోజులు దాటినా సాధారణ స్థితి రాలేదన్నారు. విద్యారంగం పట్ల కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య పూరిత వైఖరి వహిస్తోందని కెసిఆర్ నరేంద్రమోదీ కుమ్ముక్కై విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్ ప్రకటించకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు. ఫీజు రీయంబర్స్‌మెంట్‌ను ఒకే విడతలో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పంజాల శ్రీనివాస్, రియాజ్, అన్సారీ, వంశీ, తిప్పర్తి శ్రీధర్, పెండ్యాల శ్రీనివాస్, వంగవీటి నరేష్, పులి శ్రీనివాస్, రమేష్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.