వరంగల్

ప్రభుత్వ ఉద్యోగులుగా స్కీం వర్కర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వడ్డేపల్లి, జనవరి 20: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధ్వర్యంలో నడుస్తున్న వివిధ పథకాలలో పనిచేస్తున్న కార్మికులందరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి యాదా నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పథకాలలో పనిచేస్తున్న కార్మికులు రాష్ట్ర కమిటి పిలుపుమేరకు ఒక రోజు సమ్మెలో భాగంగా ఆర్ట్స్ కళాశాల నుండి కలెక్టరేట్ వరకు భారీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌లోకి చోచ్చుకుపోయేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకోవడంతో కొంత సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెంటనే రోడ్డుపైనే బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా యాదానాయక్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధ్వర్యంలో నడుస్తున్న ఐసిడిఎస్, మద్యాహ్న భోజనం, నేషనల్ హెల్త్‌మిషన్, ఆశా, మెప్మా, ఐకెసి, చైల్డ్‌లేబర్ ప్రాజెక్టు, కస్తూర్భాగాంధీ, సర్వశిక్షా అభియాన్ లాంటి పథకాలలో పనిచేస్తున్న కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకపోవడం దారుణమని అన్నారు. దశాబ్దాల తరబడి కార్మికులతో వెట్టిచాకిరి చేయించుకుంటున్న ప్రభుత్వాలు కనీస వేతనాలు కూడా చెల్లించకపోవడం అన్యాయమని అన్నారు. 70 సంవత్సరాల స్వాతంత్య్రం అనంతరం కూడా బ్రిటీష్‌కాలంనాటి విధానాలనే అమలు చేస్తూ, ప్రభుత్వాలు కార్మికులను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. కార్యదర్శి రాగుల రమేష్ మాట్లాడుతూ 2016 అక్టోబర్ 26 సుప్రీం కోర్టు తీర్పును గౌరవించి సమాన పనికి సమాన వేతనాలు చెల్లించాలని, ఫిబ్రవరిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే బడ్జెట్‌లో స్కీం వర్కర్లకు ఐదు శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకురాళ్లు రమాతార, యాకూబీ, ప్రేమలత, రాజేశ్వరీ, సరోజ, ఉమ, చందన, సంపూర్ణ, ప్రభాకర్, సారంగపాణి తదితరులు పాల్గొన్నారు.

క్రీడాస్ఫూర్తితో రాణించాలి
వడ్డేపల్లి, జనవరి 20: పోలీసు క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో క్రీడలలో రాణించి ఉన్నత స్థానాలలో నిలవాలని వరంగల్ పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు సూచించారు. శుక్రవారం కమిషనరేట్ రెండవ వార్షిక స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2017 క్రీడలను పోలీసు పరేడ్‌గ్రౌండ్‌లో ప్రారంభించారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ క్రీడలలో సెంట్రల్‌జోన్, ఈస్ట్‌జోన్, వెస్ట్‌జోన్లతోపాటు, క్రైం, సిటీ, ఆర్మూడ్ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది 20 క్రీడాంశాలలో పోటీ పడుతారని తెలిపారు. ఈ పోటీలలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు మార్చి నెల మూడు నుండి ఏడు వరకు జరిగే రాష్ట్ర స్థాయి క్రీడలకు ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. నిరంతరం విధులు నిర్వహిస్తూ తీరికలేకుండా ఉండే పోలీసు సిబ్బందికి ఈ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, పని ఒత్తిడినుండి ఉపశమనం కోసం పోలీసులకు ఈ క్రీడలు అవసరమని అన్నారు. మార్చిలో జరిగే రాష్టస్థ్రాయి క్రీడలలో కమిషనరేట్ పోలీసులు సత్తాచాటాలని ఆకాంక్షించారు. క్రీడోత్సవాల సందర్బంగా సిటీ ఎఆర్, ఈస్ట్ జోన్ల మద్య నిర్వహించిన తొలి వాలీబాల్ పోటీలను సిపి సర్వీసుచేసి ప్రారంభించారు.