వరంగల్

మూడువేల జనాభాకో పోస్ట్ఫాసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జనవరి 20: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రతి మూడు కిలోమీటర్ల పరిధిలో మూడువేల జనాభా ఉన్న గ్రామాల్లో పోస్ట్ఫాసుల ఏర్పాటు చేయాలనే ఆలోచన కేంద్రానికి ఉందని మహబూబాబాద్ ఎంపి ప్రొఫెసర్ సీతారాంనాయక్ తెలిపారు. ఈ విషయంలో మండల పరిషత్ అధ్యక్షులు ప్రతిపాదనలు పంపిస్తే అవసరమైన ప్రాంతాల్లో పోస్ట్ఫాసుల ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. గ్రామీణాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా కేంద్రప్రభుత్వం నుంచి వివిధ పథకాల కింద నిధులు మంజూరు అవుతున్నాయని, ఈ పథకాల గురించి సంబంధిత శాఖల అధికారులు పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కేంద్రం నుంచి మంజూరవుతున్న నిధులు, చేపడుతున్న పనుల గురించి ప్రజాప్రతినిధులకు సకాలంలో సమాచారం ఇవ్వాలని, దీనివల్ల పథకాలు సకాలంలో పూర్తయ్యేందుకు ప్రజాప్రతినిధుల నుంచి సహాయ, సహకారాలు అందుతాయని చెప్పారు. వరంగల్ రూరల్ జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ మొదటి సమావేశం శుక్రవారం జిల్లాపరిషత్ మీటింగ్ హాలులో నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న ఎంపి సీతారాంనాయక్ మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంజూరైన నిధులను సకాలంలో ఖర్చు చేయగలిగితే కేంద్రం ప్రతిపాదించిన వివిధ పథకాలకు మరిన్ని నిధులు మంజూరు చేసేలా ప్రయత్నాలు చేస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా కొన్ని పథకాలు అమలు చేయటంతో పాటు పాత పథకాల మార్గదర్శకాలను మార్పుచేసి కొత్త పేర్లతో అమలు చేస్తోందని, వీటి గురించి అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. కేంద్ర నిధులతోపాటు రాష్ట్ర ప్రభుత్వ నిధులు కలిపి గ్రామీణ స్థాయిలో ప్రజలకు కల్పించవలసిన వౌళిక సదుపాయాల విషయంలో గ్రామసభలు నిర్వహించి నివేదికలు అందచేయాలని తెలిపారు. దీన్‌దయాల్ గ్రామజ్యోతి యోజన కింద జిల్లాలో చేపట్టే కార్యక్రమాల గురించి ట్రాన్స్‌కో ఎస్‌ఇ సమాచారం ఇస్తున్న సందర్భంలో ప్రాంతాల వారీగా అవసరాలను గుర్తించి పథకం అమలు చేస్తే బాగుంటుందని కొందరు సభ్యులు సూచించగా దీన్‌దయాళ్ అంత్యోదయ యోజన, దీన్‌దయాల్ గ్రామజ్యోతి యోజన, డిజిటల్ ఇండియా, ఎంఆర్‌ఇజిపి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన తదితర పథకాలకు నిధులు మంజూరు, పథకాల అమలుపై ఎమ్మెల్యేలకు, మండలస్థాయి ప్రజాప్రతినిధులకు ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలని ఎంపి సీతారాంనాయక్ స్పష్టం చేసారు. డిజిటల్ ఇండియాలో భాగంగా కేంద్రప్రభుత్వం అన్ని గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్‌నెట్, వైఫై సౌకర్యం కల్పించేందుకు ప్రయత్నిస్తోందని ఎంపి తెలుపగా తమతమ మండలాల్లో టెలిఫోన్ వ్యవస్థ సక్రమంగా పనిచేయటం లేదని, సెల్‌టవర్ల సామర్థ్యం అవసరాల మేరకు పెంచటం లేదని కొందరు సభ్యులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. స్వచ్ఛ్భారత్ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణాలకు బిల్లుల చెల్లింపులు జరుగుతుండగా, ఇజిఎస్ కింద చేపట్టిన మరుగుదొడ్లకు చెల్లింపులు జరగటం లేదని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. బిల్లులు సకాలంలో చెల్లిస్తే లక్ష్యాల మేరకు మరుగుదొడ్ల నిర్మాణం పూర్తిచేయటం ద్వారా స్వచ్ఛ్భారత్ లక్ష్యాలను సాధించే అవకాశం ఉంటుందని అన్నారు. కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వరంగల్ ఎంపి దయాకర్, జడ్పీ చైర్‌పర్సన్ పద్మ, బిఎస్‌ఎన్‌ఎల్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ నరేందర్, డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టర్ శేఖర్‌రెడ్డి తదిరులు పాల్గొన్నారు.

వడ్డీలేని రుణాలతో
ఆర్థికంగా ఎదగాలి
* మహిళలకు ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ పిలుపు
నక్కలగుట్ట, జనవరి 20: మహానగర పాలక సంస్థ ఎన్నికలలో మహిళకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో తెరాస ప్రభుత్వం కట్టుబడి ఉందని, వడ్డేలేని రుణాలతో మహిళలు ఆర్థికంగా ఎదగాలని పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ అన్నారు.శుక్రవారం హన్మకొండ కాపువాడలోని శ్రీమాత గార్డెన్‌లో ఏకశిలా పట్టణ సమైక్య మూడవ సర్వ సభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ గత మున్సిపల్ ఎన్నికలలో మున్సిపల్ శాఖమంత్రి కెటిఆర్ ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు వడ్డీలేని 50 కోట్ల రూపాయల రుణాలను మంజూరు చేశామని గుర్తుచేశారు. అందులో భాగంగా వరంగల్‌కు 9కోట్ల 15లక్షల రూపాయలను ఇచ్చామని, అలాగే ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు సమైక్యా సంఘాలకు 10లక్షల రూపాయలను కూడా ఇస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం నుండి సమైక్య సంఘాలకు అందే ఆర్థిక సహాయంతో సంఘాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.