వరంగల్

ఎర్రబెల్లిని పరామర్శించిన ఎంపి కవిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పర్వతగిరి, జనవరి 22: పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు కుటుంబ సభ్యులను ఆదివారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు , ఎంపి కవితతోపాటు పలువురు ఎమ్మెల్యేలు పరామర్శించారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు తల్లి ఆదిలక్ష్మి గత వారం మృతిచెందగా ఆమె మృతికి సంతాపం ప్రకటించిన తెరాస నేతలు ఎర్రబెల్లిని ఓదార్చారు. మహబూబాబాద్, వరంగల్ ఎంపిలు సీతారాంనాయక్, పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు వినయ్‌భాస్కర్, గంప గోవర్థన్, ఆరూరి రమేశ్, జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, తెరాస మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు తక్కెలపెల్లి రవీందర్‌రావు, తెదేపా పోలిట్‌బ్యూరో సభ్యులు రమేశ్‌రాథోడ్, కాకతీయ యూనివర్శిటి విసి సాయన్న, మాజీ ఎంపి గుండు సుధారాణి, జడ్పీ ఛైర్‌పర్సన్ గద్దల పద్మ, ఎమ్మెల్సీ బాలస్వామి లక్ష్మీనారాయణ, వరంగల్ నగర మేయర్ నన్నపు నరేందర్, ప్రభుత్వ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, అర్భన్ జిల్లా అధ్య క్షుడు ఈగ మల్లేష్, సిఎం వ్యక్తిగత కార్యదర్శి అజిత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మాలోతు కవిత, డాక్టర్ సుధాకర్‌రావు, కాంగ్రెస్ జిల్లా అధ్య క్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, తదితరులు ఎర్రబెల్లిని పరామర్శించిన వారిలో ఉన్నారు.

స్వచ్ఛత ఉంటేనే జీవితానికి ఆనందం
నక్కలగుట్ట,జనవరి 22:స్వచ్చత పాటిస్తేనే నగరం అందంగా ఉంటుందని, అపుడే నగర ప్రజల జీవితాలు ఆనందమయం అవుతాయని వరంగల్ నగర మేయర్ నన్నపనేని నరేందర్ అన్నారు. ఆదివారం మోక్షారామం పౌండేషన్ వారి అధ్వర్యంలో పారిశుధ్ద్యాన్ని మెరుగుపరిచే నిమిత్తం చెత్తడబ్బాలను తరలించే త్రిచక్ర సైకిళ్లను ప్రజారోగ్యం విభాగం వారికి అందజేశారు. ఈ సందర్బంగా మేయర్ మాట్లాడుతూ మోక్షారామం పౌండేషన్ వారు స్వచ్చ భారత్, స్వచ్చ వరంగల్ కోసం కృషి చేస్తున్నారని కొనియాడారు. స్వచ్చ సర్వేక్షణ్ సర్వేపై నగర ప్రజలకు కల్పించి, భిన్న ప్రసార మాద్యమాలను ఉపయోగించుకుంటూ ముందుకు సాగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బుల్లితెర హాస్యనటుడు రచ్చ రవి మాట్లాడుతూ స్వచ్యతకు నగర ప్రజలు, యువత పెద్దపీఠ వేయాలని కోరారు. చెత్త ఘన పదార్థాలను నిర్దేశించిన ప్రదేశాలలో ఉంచిన చెత్త డబ్బాలలోనే వేయాలని సూచించారు. నగరాన్ని అందంగా ఉండాలంటే ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని తెలిపారు.