వరంగల్

కడియం ఆదేశాలతో కదిలిన యంత్రాంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెక్కొండ,జనవరి 22: నెక్కొండ మండలం పెద్దకొర్పోలు కస్తూర్భాగాంధీ గిరిజన బాలికల గురుకుల విద్యాలయంలో నెలకొన్న సమస్యలపై సమాచారం అందుకున్న ఉప ముఖ్య మంత్రి కడియం శ్రీహరి శనివారం రాత్రి ఆకస్మిక తనిఖీ చేయడంతో అధికార యంత్రాంగలంలో కదిలిక మొదలైంది. గురుకుల సమస్యలపై విచారణ జరిపించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించిన నేపథ్యంలో ఆదివారం జాయింట్ కలెక్టర్ హరిత గురుకులానికి చేరుకొని ఆగమేఘాలపై విచారణ జరిపారు. గురుకుల ఆవరణను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. మెను ప్రకారం విద్యార్థులకు భోజనం వండిపెట్టడం లేదని గుర్తించి ప్రత్యేక అధికారి మేనకను మందలించారు. ఉపాధ్యాయులు, సిబ్బంది పనితీరుపై ఆరా తీసారు. విద్యార్థుల కొరకు ఆర్‌వో ప్లాంట్‌ను రెండు రోజుల్లో ఏర్పాట చేయిస్తామని చెప్పారు. సోలార్ లైట్లను ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుగుతుందన్నారు. ప్రహరి ఎత్తు పెంపు, గేట్ల ఏర్పాటు , మైదానం చదును చేయడం, టాయ్‌లెట్స్ మరమ్మతులాంటి పనులను సత్వరం చేయించేందుకు సంబంధిత యంత్రాంగాన్ని ఆదేశించామన్నారు. ఉప ముఖ్య మంత్రి ఆదేశాల మేరకు ఇంజినీరింగ్ అధికారులు కూడ గురుకులనికి విచ్చేసి ఎస్టిమేట్స్ రూపొందించారు. ఆర్‌వీఎంఈఈ రవీందర్‌రావు, ఎంపిపి అజయ్‌కుమార్ అవసరమైన నిర్మాణ పనుల జాబితా తయారు చేసి పరిపాలన పరమైన అనుమతికోసం పంపించారు. జాయింట్ కలెక్టర్ వెంట జిల్లా విద్యాధికారి నారాయణరెడ్డి , ఏసిపి మురళీధర్‌రావు, తహసీల్దార్ శ్రీనివాస్ ఉన్నారు.
కలెక్టర్‌కు నివేదిక
మధ్నాహ్నం వండిన భోజనం ముద్దగా ఉండటం చూసిన జెసి వంటకు వినియోగిస్తున్న సరకుల నాణ్యతను పరిశీలించారు. కాంట్రాక్టర్‌పై చర్యలకు సిఫారసు చేస్తున్నామని, అదే సమయంలో విధులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపైన కలెక్టర్‌కు నివేదిస్తామన్నారు.

యువకుల ఆత్మహత్యాయత్నం
నెక్కొండ, జనవరి 22: తమ డిమాండ్లను నెరవేర్చకుంటే భవనంపై నుంచి దూకేసి ఆత్మహత్య చేసుకుంటామని ఓ విద్యార్థి , మరో యువకుడు ఆత్మహత్యా యత్నానికి పాల్పడి తీవ్ర ఉత్కంఠతను నెలకొల్పిన సంఘటన నెక్కొండ ఆదర్శపాఠశాలలో ఆదివారం జరిగింది. నెక్కొండ వికాస్ డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న దేవేందర్, నెక్కొండ తండాకు చెందిన యువకుడు సురేశ్‌లు వేర్వేరుగా దూకేందుకు యత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూడు గంటలపాటు హైడ్రామా నెలకొంది. ఎస్సై మిథున్, గ్రామస్థుల కథనం ప్రకారం... నెక్కొండ తండాలో గుడుంబా తయారీదారులపై ఎక్సైజ్ సిబ్బంది శనివారం దాడులుచేసి కేసులు నమోదు చేశారు. ఈ ఘటనలో తొమ్మిదిమందిపై కేసులు నమోదయ్యాయి. తమ సమాచారం ఎక్సైజ్ పోలీసులకు ఇచ్చి కేసులు నమోదయ్యేందుకు కారణమయ్యావంటూ తండావాసులు డిగ్రీ చదువుతున్న దేవేందర్‌ను దుర్భాషలాడారు. దీంతో మనస్తాపం చెందిన దేవేందర్ ఆదివారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో సమీపంలోని ఆదర్శపాఠశాల భవనంపైకి పురుగుల మందు డబ్బా వెంటబెట్టుకొని ఆత్మహత్యా చేసుకుంటానని బెదిరించారు.
ఎక్సైజ్ ఎస్సై సరిత వచ్చి తనను దూషించిన వారిపై కేసులు నమోదు చేయాలని అప్పుడే తాను కిందికి దిగి వస్తానని భీష్మించాడు. సమాచారం అందుకున్న ఎస్సై మిథున్ , అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలికి చేరుకొని విద్యార్థితో మాట్లాడారు. పది గంటల ప్రాంతంలో ఎక్సైజ్ ఎస్సై వచ్చి ఇప్పటికే కేసులు నమోదు చేశామని చెప్పడంతో దిగివచ్చారు. దేవేందర్ చెప్పిన జాబితాలో ఉన్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అందులో తమ సోదరిని అన్యాయంగా ఇరికించారంటూ తండాకు చెందిన యువకుడు సురేశ్ భవనంపైకి ఎక్కారు. తమ సోదరిని వదిలేస్తేనే దిగుతానంటూ మెలికపెట్టడంతో అదుపులోకి తీసుకున్న యువతిని వదిలేయడంతో యువకుడు దిగివచ్చారు. ఒకరి తర్వాత ఒకరు దూకేస్తానంటూ బెదిరింపులు చేస్తుండటంతో తండావాసులు పెద్ద ఎత్తున పాఠశాలకు చేరుకొని గంటల తరబడి నిరీక్షించారు. యువకులు ఇద్దరిని, దూషించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీసుస్టేషన్‌కు తరలించారు.