వరంగల్

నగరమంతటికీ స్వశక్తి విస్తరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జనవరి 23: మహిళలు, విద్యార్థినుల స్వీయ రక్షణకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించటం ద్వారా వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకు వరంగల్ పోలీసు కమీషనరేట్ ఆధ్వర్యంలో చేపట్టిన స్వశక్తి కార్యక్రమాన్ని నగరంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పోలీసు కమీషనరేట్ నిర్ణయించింది. అందులో భాగంగా అరడజను మంది మహి ళా కానిస్టేబుళ్లకు స్వీయ రక్షణ విషయంలో మెళుకువలపై శిక్షణ ఇప్పించారు. వీరిద్వారా నగరంలోని అన్ని కళాశాలల్లోని విద్యార్థినులకు స్వీయరక్షణపై శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేందుకు నిర్ణయించారు. ఈ సిబ్బంది కోసం ప్రత్యేకంగా స్వశక్తి వాహనాన్ని కూడా ఏర్పాటుచేసారు. ఈ వాహనాన్ని పోలీ సు కమీషనర్ సుధీర్‌బాబు సోమవారం ప్రారంభించారు. పోలీసు కమీషనరేట్‌లో మహిళల ఈవ్‌టీజింగ్, దాడులు, దౌర్జన్యాలను నివారించే చర్యల్లో భాగంగా పోలీసు కమీషనర్ ప్రయోగాత్మకంగా గతనెల 21న స్వశక్తి పేరిట జెఎన్‌ఎస్ స్టేడియంలో నిర్వహించిన భారీ శిక్షణా కార్యక్రమానికి 21276మంది మహిళలు, విద్యార్థినులు హాజరు కావటంతో ఈ కార్యక్రమం గిన్నీస్ బుక్‌లో చేర్చేందుకు అర్హత లభించింది. దీనిని అవకాశంగా తీసుకుని స్వశక్తి శిక్షణ కార్యక్రమాన్ని అన్ని ప్రాంతాలకు తరలించాలని నిర్ణయించి ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. అందులో భాగంగా ఆరుగురు మహిళా కానిస్టేబుళ్లకు ఆత్మరక్షణ అంశాలపై శిక్షణ ఇప్పించారు. శిక్షణ పొందిన ఈ మహిళా కానిస్టేబుళ్లు నగరంలోని అన్ని కళాశాలలకు వెళ్లి విద్యార్థినులకు స్వీయరక్షణ కోసం శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారు. స్వశక్తి శిక్షణ బృందం కోసం ప్రత్యేకంగా ఒక వాహనాన్ని ఏర్పాటుచేసారు. కమీషనరేట్ పరిధిలో మహిళలు, విద్యార్థినుల ఆత్మరక్షణ కోసం, వేధింపులకు గురవకుండ మరిన్ని స్వశక్తి శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటుచేసి ఆత్మస్థైర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పోలీసు కమీషనర్ సుధీర్‌బాబు తెలిపారు.

మొండి బకాయిలకు కార్పొరేషన్ ‘రెడ్’ నోటీసులు

వరంగల్, జనవరి 23: వరంగల్ నగరపాలక సంస్థ పరిధిలో చాలాకాలంగా ఆస్తిపన్నులు చెల్లించకుండా కాలయాపన చేస్తున్న సంస్థలు, వ్యక్తులపై కొరడా ఝుళిపించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. భారీగా ఆస్తిపన్ను బకాయిపడిన 173 మంది జాబితాను ప్రకటిస్తూ వీరంతా త్వరలో పన్నుల బకాయిలను చెల్లించకుంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని నిర్ణయించారు. ఈ మేరకు ఆయా వ్యక్తులకు, సంస్థలకు ‘రెడ్’ నోటీసులు జారీ చేస్తున్నారు. వరంగల్ నగరపాలక సంస్థకు ఆస్తిపన్నుల కింద ఇప్పటి వరకు 3.96కోట్ల రూపాయల పాత బకాయిలు ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరంలో 1.34కోట్ల రూపాయలు పన్నుల రూపేణ చెల్లించవలసి ఉంది. ఆస్తిపన్ను భారీగా బకాయిపడని వారిలో పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలతోపాటు రాజకీయ పార్టీల నాయకులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, విద్యాసంస్థలు, రైసుమిల్లులు, జిన్నింగ్ మిల్లు లు, కోల్ట్‌స్టోరేజీలు, గ్రానైట్ కంపెనీలు, పెట్రోలు బంకులు ఉన్నాయి. వీరికి ఇప్పటికే పలుమార్లు నగరపాలక సంస్థ నోటీసులు జారీ చేసినా ఆస్తిపన్ను చెల్లించటంలో మొండికేస్తున్నాయని అధికారులు తెలిపారు. దాంతో 50వేలు, అంతకు మించి ఆస్తిపన్ను చెల్లించవలసిన మొండిబకాయిదారులకు ప్రభుత్వ ఆదేశాల మేరకు రెడ్ నోటీసులు జారీ చేసారు. నిర్ణీత వ్యవధిలో పన్నులు చెల్లించని మొండిబకాయిదారులపై కఠినంగా వ్యవహరించాలని కార్పొరేషన్ అధికారులు నిర్ణయించారు.