వరంగల్

గుడుంబాను తరిమి వేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాదేవపూర్, జనవరి 27: గుడుంబా వల్ల ఎన్నో కుటుంబాలు వీధి పాలు అవుతున్నాయని కుటుంబాలను సర్వ నాశనం చేసే గుడుంబాను తరిమి వేయాలని మహాదేవపూర్ డిఎస్పీ కెఆర్‌కె ప్రసాద్ పిలుపు నిచ్చారు. శుక్రవారం మహాదేవపూర్ మండలంలోని సూరారం ఎస్టీ కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు గుడుంబాకు వ్యతిరేఖంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కాలనీ వాసులతో మాట్లాడుతూ గుడుంబా సేవించడం వల్ల తమ జీవితాలు బుగ్గిపాలు అవుతున్నాయని, అలాంటి గుడుంబాను తమ గ్రామం నుండి తరిమి వేయడమే కాకుండా యువత చెడు వ్యసనాల బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన వివరించారు. గుడుంబా రహిత గ్రామంగా సూరారం నిలవాలని గ్రామంలోని కిరాణ వ్యాపారులను పిలిపించి గుడుంబా తయారికి కాని అమ్మకాలు కానీ చేయబోమని వారితో ప్రమాణం చేయించారు. అనంతరం గుడుంబా వ్యతిరేఖ పోరాట కమిటిని ఏర్పాటు చేశారు. గుడుంబా వ్యతిరేఖంగా గ్రామంలో మూడు రోజుల పాటు అవగాహన కల్పిస్తామని డిఎస్పీ ప్రసాద్ తెలిపారు.

రూ.3.5లక్షల నల్లబెల్లం స్వాధీనం
మహబూబాబాద్, జనవరి 27: హైదరాబాద్ నుండి మహబూబాబాద్‌కు అక్రమంగా రవాణా అవుతున్న సుమారు రూ.3.50లక్షల విలువైన 70బస్తాల నల్లబెల్లాన్ని మహబూబాబాద్ ఎక్సైజ్ శాఖ అధికారులు వలపన్ని శుక్రవారం పట్టుకున్నారు. బెల్లం తరలిస్తున్న ఎపి 23టి 4087 డిసియం వాహనాన్ని సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సిఐ తిరుపతి మాట్లాడుతూ.. మహబూబాబాద్ జిల్లాను గుడుంబా రహిత జిల్లాగా చెయడంలో భాగంగా శుక్రవారం ఉదయం బిటిఆర్ నగర్ తండాలో గుడుంబా కేంద్రాలపై దాడులు నిర్వహించి బానోత్ మోతీలాల్ అనే వ్యక్తి దగ్గర ఆరు లీటర్ల గుడుంబా, 25కేజిల నల్లబెల్లం, 5కేజిల ఆలం స్వాదీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఆ విచారణలో భాగంగా భజన తండాకు చెందిన వాంకుడోతు వీరన్న అనే వ్యక్తి తమకు బెల్లం సరఫరా చేస్తున్నాడని మోతీలాల్ ద్వారా తెలుసుకున్నామన్నారు. దాన్ని ఆదారం చేసుకొని శనిగపురం వద్ద కాపుకాసి హైదరాబాద్ నుండి నల్లబెల్లం లోడుతో వస్తున్న వాహనాన్ని స్వాదీనం చేసుకున్నామన్నారు. అందులో 70బస్తాల నల్లబెల్లం ఉందని, డ్రైవర్‌ను విచారించగా భజన తండాకు చెందిన వాంకుడోతు వీరేందర్ అనే వ్యక్తి తనకు అధిక కిరాయి ఇస్తానని చెప్పగా హైదరాబాద్ నుండి తెస్తున్నట్లు తెలిపాడని సిఐ తిరుపతి అన్నారు. వీరేందర్ గురించి గాలించగా అతని ఆచూకి లభించలేదని బానోత్ మోతీలాల్, కన్నబోయిన బిక్షంలను అరెస్ట్ చేశామని తెలిపారు. ఈదాడుల్లో ఎక్సైజ్ ఎస్సైలు రాయబారపు రవికుమార్, కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు.