వరంగల్

వరంగల్‌లో ఆరు సర్కిళ్ల ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఫిబ్రవరి 2: వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలో మంచినీటి పన్నును పెంచుతు నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం తీర్మాణించింది. గృహ అవసరాల నీటిపన్నును యథాతదంగా కొనసాగిస్తూ వాణిజ్య అవసాలకు ఉపయోగించే నీటికి పన్ను మొత్తాన్ని పెంచింది. అదే విధంగా వాణిజ్య కనెక్షన్ల డొనేషన్‌ను, సెక్యూరిటీ డిపాజిట్ మొత్తాన్ని పెంచాలని సర్వసభ్య సమావేశం నిర్ణయించింది. నగరపాలక సంస్థ మేయర్ నన్నపునేని నరేందర్ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో నీటిపన్ను పెంపుపై ప్రవేశపెట్టిన ప్రతిపాదనలను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. నగరపాలక సంస్థ పరిధిలోని కోర్ ఏరియాలో ప్రస్తుతం ఉన్న గృహ ఆవసరాల నీటి కనెక్షన్ నీటిపన్ను 150రూపాయలను, నగరపాలక సంస్థలో విలీనపైన శివారు గ్రామాలతో ఏర్పడిన డివిజన్లలో ప్రస్తుత 60రూపాయల నీటిపన్నును పెంచకుండా కొనసాగించాలని సమావేశంలో తీర్మాణించారు. కానీ నిర్ధేశించిన పరిమితికి మించి నీటిని వినియోగిస్తే వాణిజ్య కనెక్షన్‌గా బావించి కిలోలీటర్‌కు 45రూపాయల చొప్పున వసూలు చేయాలని నిర్ణయించారు. అదే విధంగా వాణిజ్యపరమైన మంచినీటి కనెక్షన్లకు ఇప్పటి వరకు వాటి స్థాయి ఆధారంగా 15వేల నుంచి 30వేల రూపాయల క్యాపిటేషన్ ఫీజు వసూలు చేయగా దానిని 25వేల నుంచి 40వేల వరకు పెంచారు. అపార్ట్‌మెంట్లలో డొనేషన్లు, సెక్యూరిటీ డిపాజిట్ మొత్తాన్ని కూడా పెంచాలనే ప్రతిపాదనలకు సమావేశం ఆమోదం తెలిపింది. వరంగల్ నగరాన్ని కేంద్రప్రభుత్వం అమృత్ పథకం కింద ఎంపిక చేసిన కారణంగా ప్రభుత్వ నిబంధనల మేరకు అన్ని రకాల నీటి కనెక్షన్లకు మీటర్లు ఏర్పాటు చేసుకోవటం తప్పనిసరని సమావేశంలో సంబంధిత అధికారులు తెలిపారు. కాగా వరంగల్ మహానగరపాలక సంస్థ పరిధిని ఆరు సర్కిళ్లుగా విభజించాలనే ప్రతిపాదినను సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ప్రస్తుతం వరంగల్, హన్మకొండ, కాజీపేటలో సర్కిల్ కార్యాలయాలు పనిచేస్తున్నాయి. గురువారం నాటి నిర్ణయాన్ని ప్రభుత్వం ఆమోదిస్తే కొత్తగా మరో మూడు సర్కిళ్లు ఏర్పడతాయి. నగర శివారులోని పలు గ్రామాలు నగరంలో విలీనమైనందువల్ల నగర పరిధి విస్తరించి గ్రేటర్‌గా మారినందున పాలనావ్యవహారాలు సజావుగా సాగేందుకు కొత్త సర్కిళ్లను ప్రతిపాదించారు.