వరంగల్

విభజన హామీలను పట్టించుకోని కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఫిబ్రవరి 4: కేంద్రప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్టవ్రిభజన సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను అమలు చేయటంలో పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. పూర్వ వరంగల్ జిల్లాలో ఏర్పాటుచేయవలసిన పలు పథకాలకు బడ్జెట్‌లో చోటు లభించలేదని అన్నారు. అటు రాష్ట్రానికి, ఇటు వరంగల్ జిల్లాకు నష్టం కలిగించేలా కేంద్రబడ్జెట్ ఉంటే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఉలుకుపలుకు లేని విధంగా వ్యవహరించటాన్ని తప్పుపట్టారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ అంటే ముఖ్యమంత్రి కెసిఆర్‌కు భయం పట్టుకుందని, అందుకే రాష్ట్రప్రయోజనాలను దెబ్బతీసే విధంగా కేంద్రం వ్యవహరిస్తున్నా నోరు మెదపటం లేదని విమర్శించారు. రాష్ట్రప్రభుత్వం తక్షణం స్పందించి సరైన ప్రయత్నాలు జరపకుంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని అన్నారు. శనివారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో రమణారెడ్డి మాట్లాడుతు విభజన హామీలలో పొందుపరచిన కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు బడ్జెట్‌లో జాడ లేదని అన్నారు. గతంలో మంజూరుచేసిన కోచ్‌ఫ్యాక్టరీ, వ్యాగన్ మరమ్మతుల కేంద్రం జాడ లేదని చెప్పారు. రామగుండం-కొత్తగూడెం రైల్వేలైన్ ఏర్పాటుకు గతంలో సర్వే జరిగినా బడ్జెట్‌లో ఈ లైన్‌కు చోటు దక్కలేదని చెప్పారు. రాష్ట్రానికి మంజూరు చేయవలసిన గిరిజన యూనివర్సిటీ వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చినా రాష్ట్రం స్థలం కేటాయించటంలో, కేంద్రం బడ్జెట్‌లో నిధులు కేటాయించటంలో విఫలమయ్యాయని తెలిపారు. వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేయతలపెట్టిన టెక్స్‌టైల్ పార్కుకు కేంద్ర సహాయం కోరతామని ప్రభుత్వం ప్రకటించినా బడ్జెట్‌లో ఆ అంశానికి చోటు దక్కలేదని అన్నారు. విభజన చట్టంలో పొందుపరచిన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు విషయాన్ని కేంద్రం మరచిపోయిందని, బడ్జెట్‌లో బయ్యారం ప్రసక్తే లేదని తెలిపారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు విషయంలో కేంద్రం అనేక ఆంక్షలు విధిస్తోందని అన్నారు. వరంగల్ నగరంలో అండర్ డ్రైనేజీ పథకం ఏర్పాటుకు గతంలో పట్టణాభివృద్ధి శాఖ హామీ ఇచ్చిందని, కానీ బడ్జెట్‌లో దాని ప్రతిపాదనే లేదని చెప్పారు. విభజన హామీలలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టుకు, తెలంగాణలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించవలసి ఉండగా, కేంద్రం పోలవరానికి జాతీయ హోదా కల్పించి తెలంగాణలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు బదులు నిర్మించే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించటాన్ని పట్టించుకోవటం లేదని విమర్శించారు. నోట్ల రద్దుతోపాటు ప్రజలకు ఇబ్బందికరంగా మారిన పలు నిర్ణయాలను కేంద్రం తీసుకుంటే అండగా నిలచిన ముఖ్యమంత్రి కెసిఆర్ కేంద్రబడ్జెట్‌లో రాష్ట్రానికి ఎక్కువ పథకాలు, ఎక్కువ నిధులు ఎందుకు సాధించుకోలేకపోయారని ప్రశ్నించారు. ప్రధానమంత్రిని నిలదీసే ధైర్యం లేకుంటే ప్రతిపక్షాలతో ఒక ప్రతినిధి బృందాన్ని ఢిల్లీ తీసుకువెళ్లాలని డిమాండ్ చేసారు. రాష్ట్రంపై కేంద్రం చూపుతున్న వివక్షతను కాంగ్రెస్ పార్టీ సహించదని చెబుతు, విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను కేంద్రం తప్పనిసరిగా అమలు చేయాలని, లేనిపక్షంలో ఆందోళనలు తప్పవని తెలిపారు.