వరంగల్

పున్నమినాడు తల్లుల సన్నిధికి పోటెత్తిన భక్తజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఫిబ్రవరి 10: ఎదనిండా ఉప్పొంగిన భక్త్భివం, తల్లుల గద్దెలను కళ్లతో చూడగానే చెప్పలేని ఆనందం, వనదేవతల గద్దెలను తమ చేతితో ముట్టకోవాలనే భక్త్భివంతో కూడిన ఆరాటం, నిలువెత్తు బంగారం, శివ సత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, డోలు చప్పుళ్ళు మధ్య తల్లులకు మొక్కులు చెల్లించుకోవడం.. ఇదీ శుక్రవారం మేడారంలోని పరిస్థితి. పున్నమినాడు తల్లులను దర్శింకోవడం కోసం మేడారం తరలివచ్చిన భక్తజనంతో శుక్రవారం మేడారం పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. మేడారం, రెడ్డిగూడెం, కొత్తూరు ప్రాంతాలు గుడారాలతో నిండిపోయాయి. మండ మెలిగే పండగలో భాగంగా మూడవరోజు తల్లులకు మొక్కులు చెల్లించుకోవడం కోసం శుక్రవారం భక్తులు అధికసంఖ్యలో మేడారం తరలివచ్చారు. మండ మెలిగే పండగ సందర్బంగా బుధవారం గద్దెలను శుద్ధి చేసిన వన దేవతల వడ్డెలు (పూజారులు) గురువారం తమ కుటుంబ సభ్యులతో మొక్కులు చెల్లించుకోగా శుక్రవారం పెద్దఎత్తున భక్తులు మేడారం తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. మాఘశుద్ధ పౌర్ణమి నాడు తల్లులను దర్శించుకుని పూజలు చేసి, మొక్కులు చెల్లించుకుంటే అన్ని విధాల శుభం కలుగుతుందని భక్తజనం భావన. అమ్మవార్లకు సాంప్రదాయబద్దంగా పసుపు- కుంకుమ, బెల్లం, బట్టలు, గాజులు చెల్లించి తమను చల్లగా చూడాలని అమ్మవార్లను మొక్కుకున్నారు. శుక్రవారం జిల్లానుండే కాక రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి , పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌ఘడ్, మహారాష్ట్ర, ఒరిస్సా తదితర ప్రాంతాలనుండి కూడా భక్తులు తరలివచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. మండ మెలిగే పండగ సందర్బంగా మేడారం తరలివచ్చే భక్తులకు అధికార యంత్రాంగం తగిన ఏర్పాట్లను చేయడంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగలేదు. మేడారంతోపాటు పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీస్ సిబ్బంది వాహనాలను కంట్రోల్ చేయడంతో మేడారంకు వివిధ వాహనాలలో వచ్చిన భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడలేదు.
భారీ బందోబస్తు...
ఏటూరునాగారం/ములుగు టౌన్: అమ్మవార్ల మినీ జాతర సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా చర్యలు చేపట్టారు. గద్దెల ఆవరణలోని మంచెపై పోలీసు అధికారులు ఉండి గద్దెలపై జరిగే కార్యక్రమాలను పరిశీలిస్తూ... క్యూలైన్లలో తోపులాటలు జరగకుండా జాగ్రత్తలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎఎస్పి రాహుల్ హెగ్డే, డిఎస్పి దక్షిణామూర్తి, సిఐలు రఘుచందర్, శ్రీనివాసరావులు పర్యవేక్షించారు.