వరంగల్

పరకాల అభివృద్ధికి కృషి చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరకాల, ఫిబ్రవరి 13: గత ప్రభుత్వాలు విశ్వకర్మ వారిని ఓటరుగా చూశారని కానీ రాష్ట్ర ప్రభుత్వం రాబోయె బడ్జెట్‌లో విశ్వకర్మలను ఆదుకోవడానికి ముందుకు వస్తుందని రాష్ట్ర శాసన సభాపతి సిరికొండ మధుసూదనాచారి అన్నారు. సోమవారం పరకాల పట్టణంలో ఎమ్మెల్యే నిధుల నుండి మంజూరైన 20 లక్షల విశ్వకర్మ కమిటి హాల్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి ముఖ్య అతిథిగా హాజరై పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ లింగంపెల్లి కిషన్‌రావులతో కలిసి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ తెలంగాణను భారత దేశానికే ఆదర్శ రాష్ట్రంగా తీర్చి దిద్దడంలో ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. ఏక కాలంలో అభివృద్ది జరుగుతున్న రాష్ట్రం ఒక తెలంగాణ రాష్ట్రం మాత్రమేనని అన్నారు. వౌలిక, సంక్షేమం, అభివృద్ధి, మానవనీయకోణం తదితర అంశాలతో ఏక కాలంలో నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్‌కే దక్కుతుందన్నారు.
లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభం
నర్సక్కపల్లి గ్రామంలో లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణ పనులకు స్పీకర్ మధుసూదనాచారి, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ లింగంపెల్లి కిషన్‌రావులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కొమురమ్మ అధ్యక్షత నిర్వహించిన సమావేశానికి స్పీకర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ నర్సక్కపల్లి గ్రామానికి రూ. 4కోట్ల 95 లక్షలతో లిఫ్ట్ ఇరిగేష్‌ను, సబ్ స్టేషన్ మంజూరు చేయించినట్లు చెప్పారు. గ్రామంలో రూ. 10లక్షల హైమాస్ట్ లైట్ల ఏర్పాటుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. అనంతరం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ ఎంతో చరిత్ర గల మండలం పరకాల అని పరకాలకు అన్యాయం జరిగింది వాస్తవం అన్నారు. పరకాలను గుర్తింపు తీసుక రావాల్సిన బాధ్యత ఉందన్నారు. కూరగాయాలను ఎక్స్‌ఫోర్ట్ చేసే విధంగా పరకాల నియోజకవర్గ ప్రజలు దృష్టి సారించాలని అందుకు తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. పరకాల పట్టణ శివారులోని రాజిపేటలో ఆగ్రోస్ ఆధ్వర్యంలో నూతన యంత్రాల పరికరాల సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ లింగంపల్లి కిషన్‌రావు, ఐడిసి చైర్మన్ ఈద్గ శంకర్‌రెడ్డి, పరకాల జడ్పిటిసి పాడి కల్పనాదేవి, పరకాల ఎంపిపి నేతాని సులోచన, ఎంపిటిసి సుజాతలు మాట్లాడారు.

సమస్యల పరిష్కారానికే ప్రజావాణి
* వినతులు పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులదే
* అలసత్వం వహిస్తే చర్యలు
* కలెక్టర్ ప్రీతిమీనా

మహబూబాబాద్, ఫిబ్రవరి 13: ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రితీమీనా అన్నారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. పలువురి నుండి కలెక్టర్ స్వయంగా వినతులు స్వీకరించి వారితో మాట్లాడారు. అనంతరం అధికారులతో ప్రజావాణి తీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రీతిమీనా మాట్లాడుతూ.. నూతన జిల్లా ఏర్పడిన నాటి నుండి నేటి వరకు జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని అన్ని శాఖలకు కలిపి 3737్ధరఖాస్తులు వచ్చాయని అందులో కేవలం 1354మాత్రమే పరిష్కరించబడ్డాయన్నారు. 2383్ధరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ప్రజావాణి వినతులను పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. జిల్లా పంచాయితీ, ఆరోగ్య, వైద్య, పౌరసరఫరాల శాఖ జిల్లా ఎస్సీ సంక్షేమం, మహబూబాబాద్ మున్సిపాలిటీల్లో అధికంగా ధరఖాస్తులు పెండింగ్‌లో ఉండడంపై కలెక్టర్ ప్రీతిమీనా ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులపట్ల అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని, వారం రోజుల్లోగా పరిష్కరించాలని ఆదేశించారు. తమ శాఖలకు సంబందించిన సమగ్ర సమాచారం జిల్లా అధికారుల వద్ద ఎప్పుడు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. పశుసంవర్థక శాఖ, పశువైద్యశాలల్లో కావాల్సిన వౌళిక సౌకర్యాలపై ప్రతిపాధనలు ఇవ్వాలని కోరారు. జిల్లా పంచాయితీరాజ్ శాఖ పనితీరు సంతృప్తికరంగా లేదని, పన్నుల వసూళ్లలో లక్ష్యాన్ని సాధించాలని ఆదేశించారు. జిల్లాలో శాశ్వత భవనాలు లేని, శిధిలావస్థలో గల గ్రామ పంచాయితీలను గుర్తించి ఉపాధిహామీ పథకం కింద నిర్మించడానికి ప్రతిపాధనలు సమర్పించాలన్నారు. అంగన్‌వాడీ, శాశ్వత భవనాలు ఈజిఎస్‌లో నిర్మించేందుకు ప్రతిపాధనలు పంపించాల్సిందిగా కోరారు. ఉపాధ్యాయులు సక్రమంగా విధులు నిర్వర్తించడం లేదని, మండల ప్రత్యేక అధికారులు పాఠశాలలు, వైద్యశాలలు, అంగన్‌వాడీ సెంటర్లు, రేషన్‌షాపులను ఆకస్మికంగా తనిఖీ చేయాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు.