వరంగల్

సిఎం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, ఫిబ్రవరి 13: ఎన్నికలకు ముందు సిఎం కేసీఆర్ ఇచ్చిన హామీలన్ని నెరవేర్చి చిత్తశుద్ధితో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం సిపిఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ప్రదర్శన జరిగింది. వందలాది మంది కార్యకర్తలు ర్యాలీగా కలెక్టరేట్‌కు బయలుదేరి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. 2014ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ అయిన తర్వాత ఇచ్చిన ప్రధాన హామీలు మూడు సంవత్సరాలు కావోస్తున్నా నేటికి అమలుకు నోచుకోలేదన్నారు. ప్రధానంగా 58జివో కింద సుమారు 10వేల మంది ధరఖాస్తు చేసుకుంటే కేవలం 700మందికి మాత్రమే పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. పట్టణంలోని శివారు కాలనీలు, తండాలు, వివిధ ప్రాంతాల్లో ఇండ్లు నిర్మించుకొని ఉన్న వారికి ఇంటి నెంబర్లు వేయకపోవడంతో అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారన్నారు. అదేవిధంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంగా అవతరించిన తర్వాత అద్ద్భెవనాలు, ఎన్నో ఆర్ధిక ఇబ్బందులతో ఇక్కడ బ్రతకడానికి వచ్చే నిరుపేదలు తమ స్వంత ఇంటి కళ కోసం కండ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారన్నారు. మహబూబాబాద్ మున్సిపాలిటి పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమి సర్వేనెంబర్ 551,287,255 గల భూముల్లో అనేక ఏండ్ల క్రితం ఇండ్లు నిర్మించుకొని ఇందిరమ్మ ఇండ్లతోపాటు గత ప్రభుత్వాలు ఇచ్చిన ఇండ్ల పథకం కింద లబ్ధిపొంది నేటికి ఇంటి పట్టాలు లేనటువంటి అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ తదితర నిరుపేదలందరికి 58జివో ప్రకారం పట్టాలు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ, మండల కార్యదర్శులు పెరుగు కుమార్, పండురంగాచారి, కౌన్సిలర్‌లు దాస్యం రాంమూర్తి, ఫాతిమా నాయకులు రేషపల్లి నవీన్, చింతకుంట్ల వెంకన్న, రమేష్, వేణు, యాకుబ్, బోళ్ల కిష్టయ్య, శ్రీశైలం, శ్యాం, మహేందర్, జెన్ని భద్రం, పద్మ, రమణ, సత్యం విజయలక్ష్మి, వీరన్న, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

కష్టంగా కాదు .. ఇష్టంగా చదవాలి
తల్లిదండ్రుల, గురువులకు మంచి పేరు తేవాలి
స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి
పరకాల, ఫిబ్రవరి 13: విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదువాలని తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి సిరికొండ మధుసూదనాచారి అన్నారు. సోమవారం ఐఎంఎ, పరకాల ఆవోపా ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షల సంసిద్దత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆవోపా అధ్యక్షులు డాక్టర్ నాగబండి విద్యాసాగర్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి హాజరైన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ రామాయణం, మహాభారతాలు ప్రతి ఒక్కరు చదివి వాటి సారంశాన్ని అర్థం చేసుకొని నిత్య జీవితంలోకి అనువదించుకొని ముందుకు సాగాలన్నారు. కసి, కృషి ఉంటే ఫలితం ఉంటుందని, విద్యార్థులు క్రమశిక్షణతో ఉండాలని, తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకరావాలన్నారు. అనంతరం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ లింగంపల్లి కిషన్‌రావుమాట్లాడగా ఐఎంఎ అధ్యక్షులు అనంద్‌బొకరే మాట్లాడుతూ విద్యార్థులపై తల్లిదండ్రుల ఒత్తిడి ఎక్కువ ఉంటుందని ఆ ఒత్తిడిలో విద్యార్థులు చదవలేరని చెప్పారు. తల్లిదండ్రుల ఒత్తిడికి గురికాకుండా ఒక ప్రణాళిక బద్దంగా చదివితే విజయం సాధించవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో క్లినికల్ సైకాలజిస్టు అఫ్జల్, ఎంఇఓ బిక్షపతి, ఆవోపా కార్యవర్గం మాధంశెట్టి శివకుమార్, ఎల్లంకి బిక్షపతి, అల్లాడి సతీష్, విద్యాసాగర్, గుండా భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.