వరంగల్

ప్రభుత్వ ప్రాధాన్యతలను గుర్తించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నక్కలగుట్ట,్ఫబ్రవరి 20: ప్రభుత్వం నుండి వివిధ శాఖల ద్వారా కాంట్రాక్టులను పొందిన కాంట్రాక్టర్లు తప్పని సరిగా నియమనిబంధనల ప్రకారం పనులను పూర్తి చేయాలని, పనులలో నాణ్యత లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని మిని కాన్ఫరెన్స్‌హాల్‌లో కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో రోడ్ల మరమ్మత్తులు, కొత్త రహదారుల నిర్మాణం వంటి పనులలో పురోగతి కనిపించడం లేదని అన్నారు. ఇక నుండి వారంలో ఒక రోజు క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని, కాంట్రాక్టర్లు అలసత్వం, నిర్లక్ష్యం వహించినట్లు నిరూపితమైతే వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ ప్రధాన్యతలను కాంట్రాక్టర్లు గుర్తించుకోవాలని, ప్రాధాన్యతా క్రమంలోనే పనులను పూర్తి చేయడానికి ప్రయత్నం చేయాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి రెండు సార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణంలో కాంట్రాక్టర్లకు ప్రభుత్వం ఆర్థిక పరమైన మినహాయింపును కూడా ఇచ్చిందని తెలిపారు. సిమెంట్ ధరలో ఎస్‌ఎఫ్‌టికి 32 రూపాయలు, ఇసుక సరఫరాకు 27రూపాయలు, టాయిలెట్స్‌ల నిర్మాణానికి 21రూపాయలు, ఫ్లై యాష్ సరఫరాకు 10 రూపాయల చొప్పున మొత్తం ఎస్‌ఎఫ్‌టికి 90 రూపాయలు నిర్మాణ వ్యయంలో లబ్ది పొందేలా నిర్ణయం తీసుకుందని వివరించారు. ఇప్పటికైనా ప్రభుత్వ ప్రాధాన్యతకు అనుగుణంగా కాంట్రాక్టర్లు వ్యవహరించి త్వరిత గతిన పనులు పూర్తి అయ్యేలా కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గృహనిర్మాణ ప్రాజెక్టు డైరెక్టర్ లక్ష్మణ్, సమాచార పౌరసంబంధాలశాఖ ఉపసంచాలకులు జగన్ తదితరులు పాల్గొన్నారు.

వనవిజ్ఞాన కేంద్రం అభివృద్ధికి చర్యలు
*అర్బన్ కలెక్టర్ అమ్రపాలి

నక్కలగుట్ట,్ఫబ్రవరి 20: వరంగల్‌లోని వనవిజ్ఞాన కేంద్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ప్రజలకు మరింత ఆహ్లాదాన్ని కలిగించేలా చర్యలు తీసుకుంటామని అర్బన్ కలెక్టర్ అమ్రపాలి తెలిపారు. సోమవారం ఆమె కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్టు అధికారి అక్బర్, జిల్లా ఫారెస్టు ఆఫీసర్ భీమా నాయక్‌తోకలసి హంటర్‌రోడ్డులోని వనవిజ్ఞాన కేంద్రాన్ని సందర్శించారు. హైదరాబాదు నెహ్రూ జులాజికల్ పార్కు నుండి వచ్చిన రెండు పులులను కలెక్టర్ సందర్శించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వరంగల్ ప్రజలకు మరింత ఆహ్లాదాన్ని కలిగించేందుకు వనవిజ్ఞాన కేంద్రాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ తర్వాత రెండవ పట్టణంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్‌లో పార్కుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్ట సారించినట్లు వివరించారు. విజ్ఞాన కేంద్రంలో ఇప్పటికే పచ్చని చెట్లు, జంతువులు, పక్షులు ఉన్నాయని, దీనితోడు హైదరాబాద్ నుండి పులులు కూడా రావడంతో సందర్శకులు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. వేసవి కాలంలో ప్రజలు, పిల్లలు ఎక్కువగా పార్కులకు వస్తారని, అప్పటి వరకు వనవిజ్ఞాన కేంద్రాన్ని మరింత సుందరంగా తయారు చేయడానికి ప్రణాళికలు రూపొందించామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట ఫారెస్టు సిబ్బంది, వనవిజ్ఞాన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.