వరంగల్

ఘనంగా కోటిలింగేశ్వరస్వామి జాతర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొర్రూరు, ఫిబ్రవరి 20: మండలంలోని హరిపిరాల గ్రామ శివారు కోటి లింగాల ప్రాంతంలో వెలసిన శ్రీపార్వతి సమేత కోటిలింగేశ్వరస్వామి గంగామాత జాతర ఉత్సవాలు ఆదివారం రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. నాలుగు రోజులపాటు జరుగనున్న ఈ జాతర ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి గ్రామస్థులు గంపల ప్రదర్శన, బండ్లు తిరిగే కార్యక్రమాలను కన్నుల పండుగగా నిర్వహించారు. సోమవారం హరిపిరాల గ్రామానికి చెందిని అన్ని కూలాల ప్రజలు గ్రామ శివారులోని కోటిలింగాల ఆలయానికి చేరుకొని గ్రామస్థులు అంతా బోనాలు సమర్పించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం చంద్రపట్నం, తొడుప గొర్రె, బుధవారం మేళవారి పట్నం జాతర ముగింపు కార్యక్రమాలు నిర్వహించినున్నట్లు గ్రామస్థులు తెలిపారు. అదేవిధంగా మంగళవారం రాత్రి స్వామివారి కళ్యాణ ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు గాను అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టారు. సోమవారం బోనాలు సమర్పించిన భక్తులు ఆలయం ఎదుట పెద్ద ఎత్తున కోళ్లు, గొర్రెలను బలిచ్చి తమ మొక్కులను చెల్లించుకున్నారు. జాతర సందర్భంగా కోటిలింగాల ఆలయ ప్రాంతం వేలాది మంది భక్తుల రాకతో సందడిగా మారింది. సోమవారం జరిగిన ప్రత్యేక పూజా కార్యాక్రమాల్లో గ్రామసర్పంచ్ బిక్షపతి, వైఎస్సాఆర్‌సిపి మండలశాఖ అధ్యక్షుడు బీష్మాచారి, తొర్రూరు రెండవ ఎస్సై సాహెర్‌బాబా, గ్రామ ప్రముకులు సదాకర్, ఉపేందర్, మురళీ, వెంకన్న, మధు పాల్గొన్నారు.

తెలంగాణ ఉద్యమకారులను..
సమరయోధులుగా గుర్తించండి
కేసముద్రం, ఫిబ్రవరి 20: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 1952 నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు ఉద్యమించినవారిని ప్రభుత్వం సమరయోధులుగా గుర్తించాలని ప్రజా ఉద్యమకారుల సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ కోసం ఉద్యమించినవారికి జీవితకాల పింఛన్లు ఇవ్వాడంతో పాటు ప్రత్యేక సంక్షేమ పథకాలు అమలు చేయాలని, ఉద్యమం సమయంలో పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో అసులువుబాసినవారితో పాటు ఉద్యమంలో పాల్గొని అనేక కష్టాలకోర్చినవారి వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదించడం జరిగిందన్నారు. ఉద్యమంలో 1250 మంది అమరులు కాగా ప్రభుత్వం కేవలం 503 మందిని మాత్రమే గుర్తించిందన్నారు. మిగిలినవారికి వెంటనే న్యాయం చేయాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించిన కళాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలివ్వాలన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ మార్చి 13న ఇందిరాపార్క్ వద్ద దీక్ష చేపట్టనున్న ప్రచార కర పత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు కిషన్, దస్రునాయక్, వెంకన్న, మదార్, బిచ్చానాయక్, బాలమోహన్, వెంకటయ్య, సుధాకర్, నర్సింహారెడ్డి పాల్గొన్నారు.
లయన్స్‌క్లబ్‌కు అవార్డుల పంట
కేసముద్రం, ఫిబ్రవరి 20: మహబూబాబాద్ రీజియన్ పరిధిలో కేసముద్రం లయన్స్‌క్లబ్‌కు ఉత్తమసేవా కార్యక్రమాలు నిర్వహించినందుకు 11 విభాగాల్లో అవార్డులు దక్కాయని క్లబ్ చైర్మన్ చిర్రా యాకాంతంగౌడ్ తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన రీజియన్ మీట్‌లో ఈ మేరకు అవార్డులు అందుకున్నట్లు ఆయన తెలిపారు. సమాజసేవా కార్యక్రమాలతో పాటు నేత్రాల సేకరణలో తమ క్లబ్ రీజియన్‌లో ప్రత్యేకతను చాటిందన్నారు. సహచర సభ్యుల సహాకారంతో తమ క్లబ్ రీజియన్‌లో గుర్తింపుపొందిందని, రాబోవు రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టడానికి అవార్డులో తగిన ప్రోత్సాహాన్ని కలిగించాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు డాక్టర్లు చంద్రశేఖర్, వీరన్న, ఊకంటి యాకూబ్‌రెడ్డి, ఓలం ప్రభుకిరణ్, గార్లపాటి ప్రమోద్‌కుమార్, ఎర్నం శ్రీరాములు, కట్టయ్య తదితరులు పాల్గొన్నారు.