వరంగల్

వంద శాతం ప్రసవాలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏటూరునాగారం, ఫిబ్రవరి 20: జిల్లా వ్యాప్తంగా వంద శాతం ప్రసవాలు ప్రభుత్వ వైద్యశాలల్లో జరిగేలా వైద్యాధికారులు, సిబ్బంది కృషిచేయాలని జయశంకర్ జిల్లా కలెక్టర్ ఆకునూరి మురళి సూచించారు. సోమవారం స్థానిక పిఎంఆర్‌సి ఆవరణలో జరిగిన వైద్యాధికారుల సమావేశానికి హాజరైన కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వ వైద్యశాలలపై ప్రజలకు నమ్మకం కలిగేలా అధికారులు విధులు నిర్వహించాలన్నారు. 24/7 వైద్యశాలల పరిధిలోని గర్భిణులను 102, 108 వాహనాల ద్వారా ఆస్పత్రులకు తరలించాలన్నారు. ఎనబై శాతం ప్రసవాలు ఆస్పత్రులలో జరిగేలా ఎఎన్‌ఎంలు కృషిచేయాలని, గ్రామస్ధాయిలో ప్రజలకు ప్రభుత్వ వైద్యశాలలపై నమ్మకం కలిగేలా సిబ్బంది, అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. ఏజన్సీ మండలాలైన వాజేడు, వెంకటాపురం, ఏటూరునాగారం, తాడ్వాయి, మంగపేట, కన్నాయిగూడెం ప్రాంతాలలో 240మంది గర్భిణులను గుర్తించగా, 78 ప్రసవాలు ప్రభుత్వ ఆస్పత్రులలో జరిగాయని, మిగతా ప్రసవాలు కూడా ప్రభుత్వ వైద్యశాలల్లో జరిగేలా ఎఎన్‌ఎంలు, అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. కాగా ఆరు మండలాల పరిధిలో ఏటూరునాగారం వైద్యశాలలో మాత్రమే స్ర్తి వైద్య నిపుణురాలు ఒక్కరే ఉన్నారని, మరి కొందరిని నియమించాలని ఏటూరునాగారం ప్రభుత్వ సామాజిక వైద్యశాల సూపరిండెంట్ అపర్ణ కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్ళారు. స్పందించిన కలెక్టర్ త్వరనే నియామకాలను చేపడతామని తెలిపారు. వైద్యులు, సిబ్బంది రోగులకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పిటిసి వలియాబీ, ఎంపిపి మెహరున్నీసా, సస్పంచ్ ఝాన్సీరాణి, జిల్లా వైద్యాధికారి డాక్టర్ అప్పయ్య, డిసిహెచ్‌ఎస్ గోపాల్, మంగపేట, వాజేడు, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, తాడ్వాయి, పేరూరు, ఎదిర, చుంచుపల్లి వైద్యాధికారులు శాలిని, మోహన్‌కృష్ణ, సువార్చనరెడ్డి, సాయికృష్ణ, శిరీష, నరేష్, నవీన్ , ఆయా పిహెచ్‌సిల స్ట్ఫా నర్సులు, ఎఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

రైతు దీక్షను అడ్డుకోవడం అమానుషం
* ప్రజాస్వామ్యంపై నమ్మకం పెంచండి
* రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతున్న అధికారులు
* ప్రభుత్వంపై ద్వజమెత్తిన రేవూరి ప్రకాశ్ రెడ్డి

వడ్డేపల్లి,్ఫబ్రవరి 20: ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు నష్టం జరిగినప్పుడు ప్రజల పక్షాన నిలబడి వారి బాధ్యతలను నేరవేర్చే ప్రయత్నాలు ప్రతిపక్షాలు చేస్తున్నప్పుడు ప్రతిపక్షాలను అడ్డుకోవడం అమానుషం అని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. సోమవారం బాలసముద్రంలోని జిల్లా పార్టీ కార్యలయంలో అర్బన్ అధ్యక్షుడు ఈగ మల్లేశం అధ్యక్షతన విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజాస్వామ్యంపై, ప్రజాస్వామ్య విలులపై నమ్మకం ఉందని అనుకోవడం లేదని, రైతుల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకవెళ్లేందుకు చేసే ప్రయత్నాలను ప్రభుత్వం అడ్డుకోవడం దారుణమని అన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సిన ఉన్నత అధికారులు, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గడం సరికాదని హితవు పలికారు. 4కోట్ల తెలంగాణ ప్రజల మనోభావాలను అవమానపరిచే విధంగా రాష్ట్రంలోని ఆస్థులను మొత్తం ముఖ్యమంత్రి కుటుంబమే అనుభవిస్తుందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మ బలిదానాలు చేసేకున్న యువకుల త్యాగాన్ని దుర్వినియోగం చేయడం బాదాకరమని అన్నారు. అర్బన్ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఈగ మల్లేశం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామిలు, వాగ్దానాలు నేరవేర్చడంలో పూర్తిగా విఫలం అయ్యారని ఆరోపించారు. ప్రతి పక్షాలకు పని కల్పించే విధంగా రాష్ట్రంలో పరిపాలన కోనసాగుతుందని, ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా నియంతృత్వ పోకడతో ప్రజలను మభ్య పెడుతున్నారని మండి పడ్డారు. రాష్ట్రంలోని రైతులు పండించిన పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధరలు కల్పించే అంతవరకు టిడిపి ప్రజల పక్షాన పోరాటాలు చేస్తునే ఉంటుందని అన్నారు. ఈ నెల 23న రైతులకు మద్దతుగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర నాయకులు ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ను సందర్శిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కక్కె సారయ్య, గట్టు ప్రసాద్ బాబు, జయపాల్, శ్రీనివాస చారి, సాంబయ్య, అశోక్, బాబు, శ్యామ్, సంతోష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.