వరంగల్

ఘనంగా శివ ఫార్వతుల కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వర్ధన్నపేట, ఫిబ్రవరి 24: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పవిత్ర శైవక్షేత్రం అయిన ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. శుక్రవారం మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 4.00 గంటలకే సుప్రబాత సేవతో కార్యక్రమాలని ప్రారంభించి ప్రథమ యాగ పూజ సింహవాహన సేవ , గవ్యాంత పూజలు అష్టోత్తర శత నామార్చణ, మహాన్యాసాపుర్వాక, మహారుద్రాభిషేకం , రుద్రహోమం, బలిహరణముతో పాటుగా శివకళ్యాణము పెద్దపట్నం పూజా కార్యక్రమాలను చేపట్టారు. సింహ వాహన సేవపై మాడు వీదుల వెంబటి శివోహం అంటు నామస్మరణతో ఘనంగా ఉత్సవ మూర్తిని ఊరేగించారు. పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేపట్టారు. వరంగల్ మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ వరదరాజేశ్వర్‌రావు దంపతులు స్వామి వారికి పెద్దపట్నం వేసి ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేష్ స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఏర్పాట్లను పరిశీలించి భక్తుల నుండి ఏర్పాట్లపై వివరాలు అడిగి స్వయంగా తెలుసుకున్నారు. మార్నేని వంశస్తులకు వీడదీయని బందం ఐనవోలు మల్లన్న ఉండడంతో స్థానిక ఎంపిపి మార్నేని రవీందర్‌రావు ప్రత్యేక పూజా కార్య6కమాన్ని చేపట్టి వచ్చిన ప్రముఖులందరిని స్వయంగా స్వామి వారి దర్శనం చేపంచారు.అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు చేపట్టి ఆశీర్వచనం చేశారు. శని, ఆది వారాలు సెలవు దినం కావడంతో హైద్రాబాద్ పరిసరాల ప్రాంతాల నుండి కూడా అధిక సంఖ్యలో భక్తులు హజరు కావడంతో గుడి ప్రాంగణం భక్త జనంతో కిక్కిరిసిపోయింది. జాగారం కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటుగా దేవాలయ ప్రాంగణం మొత్తం విద్యుత్ దీపాలతో అలంకరించడంతో దేదీప్యమానంగా ఆలయ ప్రాంగణం ప్రకాశిస్తుంది. ఊహించిన విదంగా భక్తులు రావడంతో అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి నిఘా నేత్రంతో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తును ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే ఆలయ చైర్మన్ గజ్జేల శ్రీరాములుతో పాటు ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ కార్యనిర్వహణ అధికారి శేషు భారతి, ఆలయ అర్చకులు , సిబ్బంది అంతా ప్రత్యేక దృష్టి కేంద్రికరించి శివ భక్తులకు తగు సూచనలు చేస్తూ ఏర్పాట్లు చేశారు.