వరంగల్

కాళేశ్వరంలో..శివ కల్యాణం కమనీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాదేవపూర్ / కాటారం: దక్షిణ కాశిగా పేరుగాంచిన కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారికి శుక్రవారం అంగరంగ వైభవంగా కల్యాణం జరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో మొట్టమొదటి సారిగా నిర్వహించిన మహాశివరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా సాగింది. శుక్రవారం ఉదయం నుంచే ప్రముఖుల తాకిడి అధికమైందీ. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, చత్తీస్‌ఘ్ఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఆర్టీసీ, స్వంత వాహానాలలో సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చి స్వామి వారికి మొక్కులు సమర్పించుకున్నారు. త్రివేణి సంగమంలో భక్తులు తమ భక్తి ప్రపత్తులతో పుణ్య స్నానాలు ఆచరించారు. గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సైకత లింగాలను నిర్మించి పసుపు, కుంకమలతో పూజలు నిర్వహించారు. ఆలయం ఆవరణలోని పలు దేవాలయాలలో భక్తుల సందడి కనిపించింది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయ కార్యనిర్వాహాణాధికారి బుర్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో వేద పండితులు ప్రముఖులకు మేళ తాళాలతో స్వాగతం పలికారు. గర్భగుడిలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. సాయంత్రం 4:16 నిమిషాలకు మంథని శాసనసభ్యుడు పుట్ట మధూకర్, ఆయన సతీమణి పుట్ట శైలజలు స్వామివారికి పట్టు వస్త్రాలను తీసుకొనివచ్చి, కల్యాణాన్ని వీక్షించారు. మాజీ మంత్రి దుద్దిళ్ళ శ్రీ్ధర్‌బాబు, జెన్‌కో మఖ్యకార్యనిర్వాహాణాధికారి మంగీష్, పెద్దపల్లి డీసీపి విజయేందర్‌రెడ్డి, ఏటూరునాగారం ఏసీపి రాహుల్ హెగ్డే తదితరులు పాల్గొని, స్వామి వారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు.
వెంకటాపురం: మండలంలోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామప్ప దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా శివపార్వతుల కల్యాణం అంగరంగ వైభవంగా మేళతాళాల మధ్య పూజారులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. శివపార్వతులకు ఆలయ కమిటి ఆధ్వర్యంలో మట్టెలు, మంగళసూత్రాలు, పట్టువస్త్రాలతో అర్చకులు హరీష్‌శర్మ, ఉమాశంకర్‌లచే ఘనంగా పూజలునిర్వహించి కల్యాణ మహోత్సవాన్ని జరిపించారు. ఈ మహోత్సవానికి జిల్లా నుండే వివిధ ప్రాంతాల నుండి సుమారు 50వేలకుపైగా భక్తులు హాజరై రామలింగేశ్వరస్వామికి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. కల్యాణ మహోత్సవంలో ఆలయ చైర్మన్ పోతుగంటి సదాశివరెడ్డి దంపతులు, సర్పంచ్ కారుపోతుల పూలమ్మసత్యం, ఇ ఒ చిందం శ్రీనివాస్, ఆలయ ఇన్‌స్పెక్టర్ బేల్‌సింగ్, భక్తులు పాల్గొన్నారు. మండలంలోని రామప్ప దేవాలయాన్ని ములుగు సబ్ కలెక్టర్ విపి.గౌతం మహాశివరాత్రి సందర్భంగా సందర్శించారు. ఈసందర్బంగా ఆయన రామలింగేశ్వరస్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం జాతర ఏర్పాట్లను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.