వరంగల్

జంగమయ్యకు జేజేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్(కల్చరల్), ఫిబ్రవరి 24: వరంగల్ జిల్లా ప్రజలు శివరాత్రి పండుగను పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాఘ బహుళ త్రయోదశి సందర్భంగా నగరంలోని శివాలయాలకు వేలాదిగా భక్తులు తరలి వచ్చి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను జరుపుకున్నారు. భోలాశంకరునికి శుక్రవారం ఉదయం 4:00 గంటల నుండి ఆలయాలన్ని భక్తుల ఓం కార నాధంతో ఆలయ పరిసరాలు మారుమ్రోగాయి. ఈ సందర్భంగా నగరంలోగల శైవక్షేత్రాలు వరంగల్ రామలింగేశ్వరాలయం, కాశీ విశే్వశ్వరాలయం, కోటి లింగాల దేవాలయం, జలేశ్వరాలయం, సిద్ధేశ్వరాలయం, కాజీపేట మెట్టు రామలింగేశ్వరాలయం, శే్వతార్క గణపతి దేవాలయంలోని సంతాన నాగలింగేశ్వరులకు ఆలయ అర్చకులు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు నిర్వహించారు. శివరాత్రిని పురస్కరించుకొని ఆలయాలలో జరిగిన పాశుపత హోమాలు, శివపార్వతుల భజనలతో ఉపవాస దీక్షలతో నగరమంతా ఆధ్యాత్మికతను సంతరించుకుంది. అదేవిధంగా ఆలయాలలో సాయంత్రం నిర్వహించిన పార్వతి పరమేశ్వరుల కళ్యాణోత్సవంలో వేలాదిగా భక్తులు పాల్గొని తన్మయత్వం పొందారు. శివరాత్రి ఉత్సవాలకు సందర్భంగా కాకతీయులు కొలిచిన చారిత్రక వేయిస్తంబాల దేవాలయ క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. తెల్లవారుఝామున 3గంటల నుండి భక్తులు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ ఆధ్వర్యంలో ఉదయం 3గంటలకు మంగళవాయిద్య సేవను మొదలుకొని గణపతి ఆరాధణ, రుద్రేశ్వరుని అనుగ్రహాం, లక్ష్మీ కటాక్షకం, భక్త కోటికి లబించాలని మహాలక్ష్మీదేవి ఉద్భవించిన మారేడు దళాలతో పాశుపత రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తుల గోత్ర నామాలతో సామూహిక రుద్రాభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం 6గంటలకు తెలుగు రాష్ట్రాలలో గల శైవక్షేత్రాలలో నిర్వహించే విధంగానే రుద్రేశ్వరి, రుద్రేశ్వరులకు కడురమనీయంగా వందలాదిగా భక్తులు వీక్షిస్తుండగా కళ్యాణ తంతును వేద పండితులు గంగు మణికంఠ శర్మ, నాగిళ్ల షణ్ముఖ శర్మ, గట్టు పురుషోత్తమ శర్మలు మంత్రాలు పటిస్తుండగా విశాల్ శర్మ, దేశ్ పాండే, చైతన్యలు కళ్యాణ వేదికపై దేవేరులను ప్రతిష్ఠించి బాసికధారణ, యజ్ఞోపవీత ధారణలతో మొదలుకొని జిలకరాబెళ్లం, కన్యాదానం, మాంగళ్యాధారన, రక్షాబంధనం, ఆక్షతారోపనం వంటి క్రతువులతో అంగరంగ వైభవంగా రుద్రేశ్వరి, రుద్రేశ్వర కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలను అందించారు. కళ్యాణోత్సవంలో వధువరుల పక్షాన ఒద్ధిరాజు వెంకటేశ్వర్ల దంపతులు దాతలుగా వ్యవహరించారు. రాత్రి 12గంటలకు పరమేశ్వరుడు శివలింగ రూపాన్ని ధరించి లింగోద్భవం జరిగిన వేళ మహాన్యాస పూర్వక నూట ఏకాదశ నమకచమకములచే మహారుద్రాభిషేకం నిర్వహించారు. భక్తులు శివుడిపై లింగోద్భవ సమయమున బిల్వాదళాలను శివుడికి అర్పించి తమ భక్తిని చాటుకున్నారు. ఓం నమ: శివాయ అని స్మరిస్తు ఉపవాస దీక్షలతో జాగారం చేశారు. కాగా దేవాదాయ ధర్మాదాయ శాఖ, జిల్లా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో మధ్యాహ్నం ఆలయంలో నిర్వహించిన సాహితి సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా మధ్యాహ్నం కూచిపూడి నృత్యాలు, ఖమ్మం జిల్లాకు చెందిన ప్రవళిక నృత్య ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అదేవిధంగా లక్ష్మినారాయణచే హరికథ, వెల్దె నరసింహ మూర్తిచే హరి కథ కాలాక్షేపం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. శివరాత్రి సందర్భంగా పూజా కార్యక్రమాలలో జిల్లా జాయింట్ కలెక్టర్ దయానంద్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, నగర మేయర్ నన్నపునేని నరేందర్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, నగర కార్పోరేటర్లు, వాగ్దేవి కళాశాల అధినేత దేవేందర్ రెడ్డిలు ఆలయంలో రుద్రాభిషేకాలు నిర్వహించుకున్నారు. ఎసిపి మురళి ఆధ్వర్యంలో పోలీస్ శాఖ వారు, ఎన్‌సిసి విద్యార్ధులు, ఎవివి విద్యార్ధులు వాలెంటర్లుగా సేవలందించారు.