వరంగల్

బంగారు మీసాల మొక్కు తీర్చుకున్న కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కురవి, ఫిబ్రవరి 24: 2002 సంవత్సరంలో ఉద్యమనేతగా రాష్ట్రం సిద్ధిస్తే తానే స్వయంగా వచ్చి మహిమాన్వితమైన వీరభద్రస్వామికి మొక్కు చెల్లిస్తానన్నారు..అన్నమాట ప్రకారం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని భద్రకాళి సమేత వీరభద్రుని ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన శుక్రవారం ఉదయం 11:20 నిమిషాలకు మొక్కులను చెల్లించుకున్నారు. మొక్కు తీర్చుకోవడానికి వచ్చిన ముఖ్యమంత్రి కేసిఆర్‌కు స్వాగతం పలికేందుకు వేలాదిమంది కార్యకర్తలు కురవికి తరలిరావడంతో కురవి పరిసర ప్రాంతాలన్ని జనంతో నిండిపోయాయి. దేవాదాయ కమీషనర్ శివశంకర్, సాంస్కృతిక ప్రభుత్వ సలహాదారుడు రమణాచారి, స్థానిక ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ల పర్యవేక్షణలో ఆలయ పూజారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. సిఎం వెంట డిప్యూటి సిఎం కడియం శ్రీహరి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎంపిలు వెంట రాగా ఆలయం చుట్టూ మేళతాళాలతో సిఎం కేసిఆర్ ప్రదక్షిణ చేశారు. బంగారు మీసాలను నెత్తిమీదపెట్టుకుని భక్తి ప్రపత్తులతో ముఖ్యమంత్రి కేసిఆర్ ఆలయంలోకి తీసుకువచ్చారు. వీరభద్రుని ఆలయంలో గోత్రనామార్చనలతో పూజలు నిర్వహించారు. పదహేను సంవత్సరాల మొక్కును తీర్చుకున్నారు. పూజారులు శాస్త్రోయుక్తంగా పూజాధికాలు నిర్వహించి, స్వామివారికి మీసాలను అలంకరించారు. అనంతరం భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ మండపంలో దేవాదాయ సాంప్రదాయ ప్రకారం ఆలయ పూజారులు ముఖ్యమంత్రి కేసిఆర్‌కు పట్టు వస్త్రాలను అందచేశారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌కు వీరభద్రుని జ్ఞాపికను ఎమ్మెల్యే రెడ్యానాయక్, ఆలయ చైర్మన్ బాదావత్ రాజునాయక్‌లు అందచేశారు. అనంతరం కలెక్టర్ ప్రీతిమీనా, కార్యనిర్వహణాధికారి రాజేంద్రంలు అభివృద్ధి ప్రణాళికలతో కూడిన విజ్ఞాపన పత్రాన్ని ముఖ్యమంత్రికి అందచేశారు.
అడుగడుగున జన నీరాజాలు
* ముఖ్యమంత్రిపై పూల జల్లు
బంగారు మీసాల మొక్కుకు వస్తున్న సిఎంకు రెడ్యాసారధ్యంలోని గులాభి కార్యకర్తలు ఘనమైన స్వాగతం పలికారు. మండల కేంద్రంలోని హెలిప్యాడ్ వద్ద ముఖ్యమంత్రి 10:58 క్రిందకు దిగారు. 11:02 నిమిషాలకు హెలిప్యాడ్‌నుండి బయలు దేరిన బస్సు 11:11 నిమిషాలకు ఆలయం ఎదుట ఆగింది. బస్సులో నుండే ముఖ్యమంత్రి ప్రజలకు కార్యకర్తలకు అభివాదం చేశారు. ఒక్కసారిగా రహాదారికి ఇరువైపుల ఉన్న కార్యకర్తలు ముఖ్యమంత్రి వాహానానికి స్వాగత పూల జల్లును కురిపించారు. 11:16 నిమిషాలకు ఆలయంలోకి వెల్లిన ముఖ్యమంత్రి కేసిఆర్ పూజలు నిర్వహించుకుని 11:50 నిమిషాలకు ఉగ్గంపల్లిలోని ఎమ్మెల్యే స్వగృహానికి ప్రత్యేక బస్సులో బోజనానికి వెల్లారు. ఉగ్గంపల్లికి వెళ్తున్న మార్గంలో ముఖ్యమంత్రి వాహానానికి కురవి మొదలు మాధవాపురం, రాయినిపట్నం, నేరడ, చిన్నగూడూరు, ఉగ్గంపల్లి గ్రామాల ప్రజలు రోడ్డుకు ఇరుప్రక్కల నిలబడి ఘన స్వాగతం పలికారు. ఉగ్గంపల్లికి చేరుకున్న ముఖ్యమంత్రి కేసిఆర్ అక్కడే భోజనం చేసి, విలేఖరుల సమావేశం నిర్వహించారు.
10 గంటలకే ఆలయం ఖాళీ...
ముఖ్యమంత్రి పర్యటనతో శివరాత్రి పండుగనాడు భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 11గంటలకు వచ్చిన ముఖ్యమంత్రి పర్యటనకు పోలీస్, ఇంటలిజెన్సు అధికారులు ఉదయం 10గంటలకే ఆలయంలోని భక్తులను ఖాళీ చేయించారు. స్వామివారిని దర్శించుకుందామని అనుకున్న భక్తులకు ఇబ్బందులే ఎదురయ్యాయి. ఆలయం ఎదుట వేసిన కలకత్తా డెకరేషన్‌ల క్రింద పోలీసులు, స్పెషల్ కమాండోలు, ప్రత్యేక భద్రతా అధికారులు, స్వాగతం పలికేందుకు కార్యకర్తలు ఉండడంతో ఆలయానికి వచ్చిన భక్తులకు నిలువనీడ లేకుండా పోయింది.