వరంగల్

పోలీసుల అతి జాగ్రత్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఫిబ్రవరి 24: శివరాత్రి పర్వదినం సందర్భంగా వరంగల్ నగరంలోని చారిత్రక వేయిస్తంభాల రుద్రేశ్వరస్వామి దేవాలయంలో శుక్రవారం జరిగే ఉత్సవాలను దృష్టిలో పెట్టుకుని నగరంలోని ములుగురోడ్డు నుంచి కాంగ్రెస్ భవన్ చౌరస్తా వరకు నగర పోలీసులు వాహనాల రాకపోకలపై నిషేధం విధించటంతో ఈ మార్గంలో వచ్చి వెళ్లే ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ మార్గంలో వాహనాల రాకపోకలు నిషేధించటం ఆనవాయితీగా మారింది. వరంగల్, పరకాల ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను పెద్దమ్మగడ్డ, కొత్తవాడ మార్గాలలో మళ్లించటం చాలాకాలంగా కొనసాగుతోంది. శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని గురువారం అర్ధరాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు పోలీసులు ఈ ప్రధాన మార్గంలో వాహనాల రాకపోకలు నిషేధించారు. కానీ ఈసారి నగరంలోని కొన్ని ప్రధాన రోడ్లపై గుంతలుపడి దారుణంగా తయారవగా, మరికొన్ని రోడ్లు విస్తరణ పనులతో అసంపూర్తిగా ఉండటంతో శివరాత్రి రోజున ప్రజలు తీవ్ర అవస్థలకు లోనయ్యారు. దీనికితోడు దారి మళ్లించిన రోడ్లపై పలు ప్రాంతాల్లో ప్రైవేటు వాహనాలు పార్కింగు చేసిన కారణంగా ఆ మార్గంలో వెళ్లే వాహనదారులకు పలు సందర్భాల్లో ఇబ్బందులు తప్పలేదు.