వరంగల్

బిసిల అభ్యున్నతికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నక్కలగుట్ట,్ఫబ్రవరి 28: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిసి వర్గాల అభ్యున్నతి కృషి చేస్తోందని, అధికారులు ప్రభుత్వం ప్రాధాన్యతలకు అనుగుణంగా పనిచేసి బంగారు తెలంగాణలో భాగస్వాములు కావాలని బిసి కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు అన్నారు. మంగళవారం అర్బన్ కలెక్టరేట్ కన్ఫరెన్స్ హాల్‌లో అధికారులతో వివిధ పథకాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా రాములు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 36వేల కోట్ల రూపాయల బడ్జెట్ రూపకల్పన చేసిందని, దానిలో దాదాపు 12 కోట్ల రూపాయలు బిసిలకు కేటాయించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. గ్రామీణ ప్రాంత చెరువులలో 35 కోట్ల చేపలను వదిలినట్లు, దీంతో ముదిరాజ్‌లు అభివృద్ది చెందే అవకాశాలు ఉన్నాయని అన్నారు. అదే విధంగా చేనేతకు వచ్చే దసరాకు 60 లక్షల చీరలను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుని, చేనేత కార్మికులకు తయారు చేయాల్సిందింగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని వివరించారు. చేనేతలకు చేయూత కలగడంతో వారి జీవితాలలో వెలుగు నిండుతుందని అన్నారు. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమానికి చిత్తశుద్దితో ఉందని, ప్రతి కుటుంబం ఎదో ఒక పథకం ద్వారా లబ్దిపొందుతున్నారని, తాము ఈ విషయంలో సర్వే కూడా చేయించామని తెలిపారు. ఆదరణ కోల్పోయిన కులవృత్తులకు చేయూత నిచ్చి ఆ కుటుంబాలు ఆర్థికంగా ఎదిగేలా కృషి చేయడమే కమిషన్ ఉద్దేశ్యం అని వివరించారు. 20-30 వయస్సు కలిగిన యువతకు సాంకేతిక, విజ్ఞాన రంగాలలో శిక్షణ ఇవ్వడానికి ఒక ప్రణాళికను రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. యువతకు కమిషన్ ఆర్థిక సహాయం చేసి వారితో వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేయిస్తున్నట్లు చెప్పారు.

రాష్టస్థ్రాయ పోలీసు
క్రీడలకు సర్వం సిద్ధం
* క్రీడా మైదానాన్ని పరిశీలించిన సిపి సుధీర్‌బాబు
నక్కలగుట్ట, ఫిబ్రవరి 28: రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడల నిర్వహణకు సర్వం సిద్ధమని పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు తెలిపారు. మార్చి 3నుండి 7వ తేదీ వరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడల ఏర్పాట్లను సిపి సుధీర్‌బాబు పోలీస్ అధికారులతో కలిసి మంగళవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్, అధికారులు జెఎన్‌ఎస్ స్టేడియంతో పాటు బాలసముద్రంలోని స్విమ్మింగ్ పూల్, మున్సిపల్ ఇండోర్ స్టేడియం, ఉర్సు చెరువు, ఆఫీసర్స్ క్లబ్, మడికొండలోని పోలీస్ శిక్షణ కేంద్రాలను సందర్శించి క్రీడల నిర్వహణ కొరకు చేసిన ఏర్పాట్లను, క్రీడ మైదాన స్థితిగతులపై క్రీడల ఇన్‌చార్జి పోలీస్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిపి సుధీర్‌బాబు మాట్లాడుతూ 20కి పైగా వివిధ క్రీడాంశాలలో నిర్వహిస్తున్న ఈ క్రీడలకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు మూడు వేలకు పైగా పోలీస్ క్రీడాకారులు, అధికారులు పాల్గొంటున్న ఈక్రీడల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేయడం జరుగుతుందని అన్నారు.