వరంగల్

మనో ధైర్యంతో ముందుకు సాగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, మార్చి 8: మహిళలు తమ అభిప్రాయాలను ధైర్యంగా వ్యక్తం చేయాలని, మంచిచెడులపై కచ్చితంగా మాట్లాడాలని, అప్పుడే మహిళలకు సరైన గుర్తింపు, గౌరవం లభిస్తుందని అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి అన్నారు. సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలు ధైర్యంగా అన్ని రంగాలలో ముందుకు వచ్చినపుడే మహిళా సాధికారతకు సరైన అర్థం లభిస్తుందని చెప్పారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా బుధవారం జిల్లా యంత్రాంగం, స్ర్తి, శిశుసంక్షేమ శాఖ, పోలీసు కమిషనరేట్ సంయుక్త ఆధ్వర్యంలో పోలీసు పరేడ్ గ్రౌండ్ నుంచి మహిళల కలల సాకరం పేరిట ర్యాలీని నిర్వహించారు. పరేడ్ గ్రౌండ్ నుంచి కలెక్టరేట్, సర్క్యూట్ గెస్ట్‌హౌస్ ద్వారా తిరిగి ఈ ర్యాలీ పోలీసు పరేడ్ గ్రౌండ్‌కు చేరుకుంది. ఈ కార్యక్రమంలో వివిధ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థినులు, ప్రభుత్వ ఉద్యోగినులు, స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు వేలాదిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న ప్రతినిధులను ఉద్ధేశించి కలెక్టర్ ఆమ్రపాలి మాట్లాడుతూ సమస్యలు ఎదురైనపుడు వాటిని ధైర్యంగా ఎదుర్కొనేందుకు మహిళలు సంసిద్ధం కావాలని, ఆత్మవిశ్వాసంతో సమస్యలను, సవాళ్లను ఎదుర్కొని ముందడుగు వేయాలని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులలో మహిళలు గృహిణులుగా తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించటంతోపాటు అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకుని వివిధ రంగాలలో అత్యుత్తమ ప్రతిభ కనపరుస్తున్నారని చెప్పారు. విద్యార్థినులు, యువతులు తమ ముందు ఉన్న అడ్డంకులను అధిగమించి, అవకాశాలను ఉపయోగించుకుని మనోధైర్యంతో ముందుకుసాగాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చెప్పారు. అటు ఇంటి పనులను, పిల్లల బాధ్యతను, ఉద్యోగ బాధ్యతలను ఏకకాలంలో బహుపాత్రాభినయం చేస్తూ సమాజానికి మహిళ ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. మహిళలు చదువుతోపాటు ఆర్థికంగా బలపడితే సమానత్వం, సాధికారిత సాధ్యం అవుతుందని చెప్పారు. చదువుకున్న యువతులు, విద్యార్థినులు ఒక లక్ష్యాన్ని నిర్ధేశించుకుని లక్ష్య సాధనకు నిరంతరం కృషి చేయాలని సూచించారు. నగర పోలీసు కమీషనర్ సుధీర్‌బాబు మాట్లాడుతూ సమాజంలోని మహిళలకు భద్రత, భరోసాను కల్పించేందుకు పోలీసు యంత్రాంగం అహర్నిషలు కృషి చేస్తోందని చెప్పారు. ప్రభుత్వం కూడా మహిళల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి, అత్యుత్తమ ఫలితాలు సాధించి మంచి పేరు, ప్రతిష్టలు పొందాలని ఆకాంక్షించారు. వరంగల్ మహానగరపాలక సంస్థ కమిషనర్ శృతిఓఝా మాట్లాడుతూ ప్రపంచంలో ఎందరో ప్రతిభావంతులైన, శక్తివంతులైన మహిళలు ఉన్నారని, వారిని ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యక్రమానికి హాజరైన మహిళలు, విద్యార్థినులకు పోలీసు షీ టీం బృందం విపత్కర పరిస్థితులో తీసుకోవలసిన జాగ్రత్తలు, రక్షణ చర్యల గురించి ప్రదర్శనల ద్వారా వివరించారు.