వరంగల్

వంద శాతం పన్నులు వసూలు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, మార్చి 9: మహబూబాబాద్ జిల్లా పన్నుల వసూళ్లలో వెనుకబడి ఉందని, వందశాతం పన్నులు వసూళ్లు చేసేలా అధికారులు కార్యాచరణతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రీతిమీనా అన్నారు. జిల్లా పరిధిలోని పంచాయితీశాఖ అధికారులు, ఈవోపిఆర్‌డిలు, కార్యదర్శులతో గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రీతిమీనా మాట్లాడుతూ.. ఈ నెల 31వరకు వందశాతం పన్నులు వసూళ్లు చేయాలనే లక్ష్యంపై అధికారులు పనిచేయాలని కోరారు. పన్నుల వసూళ్లలో రాష్ట్రంలో మన జిల్లా బాగా వెనుకబడి ఉందని, చివరి ఐదు జిల్లాల్లో మహబూబాబాద్ జిల్లా ఉందన్నారు. మార్చి 31 వరకు అత్యధికంగా పన్నులు వసూళ్లు చేసి మొదటి పది జిల్లాల్లో ఉండేలా కృషిచేయాలని కోరారు. ఈవోపిఆర్‌డిలు, పంచాయితీ కార్యదర్శులు అలసత్వం వదిలి చిత్తశుద్దితో లక్ష్యాన్ని సాధించాలని కోరారు. ఇంటింటికి తిరిగి పన్నులు వసూళ్లు చేయాలని, ఈవోపిఆర్‌డిలు ప్రతి రోజు గ్రామాల వారిగా సమీక్ష జరుపాలన్నారు. తక్కువ పన్నులు వసూలైన గ్రామాలకు ఇతర కార్యదర్శులను ఇంచార్జ్‌లుగా నియమించాలని ఆదేశించారు. కొన్ని గ్రామాల్లో కేవలం 8శాతం పన్నుల వసూళ్లు జరిగాయని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్థులకు అవగాహన కల్పిస్తూ మిగతా 20రోజుల్లో అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే విధంగా పనిచేయాలన్నారు. అప్పటికి పన్నులు కట్టని వారి నల్లా కనెక్షన్ తొలగించాలని అవసరమైన వారి ఆస్తులు జప్తుచేయాలన్నారు. పంచాయితీ కార్యదర్శుల పనితీరు ఆధారంగా గ్రెడింగ్ ఇవ్వాలని దాన్ని బట్టి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లాలో రూ.15.60కోట్లు పన్నుల వసూళ్లు లక్ష్యం కాగా నేటికి కేవలం రూ.6.75కోట్లు మాత్రమే వసూళ్లు చేయడం జరిగిందన్నారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా పంచాయితీ అధికారి రాణిబాయి, జిల్లా పరిధిలోని ఈవోపిఆర్‌డిలు, పంచాయితీ కార్యదర్శులు పాల్గొన్నారు.

అంతర్గత రోడ్లకు రూ. 29 కోట్లు
పంచాయతీ భవనానికి భూమి పూజ * పౌర సరఫరాల సంస్థ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి
నల్లబెల్లి, మార్చి 9: గ్రామాల అంతర్గత రోడ్ల నిర్మాణానికి రూ. 29 కోట్లను కేటాయించిందని రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. గురువారం నల్లబెల్లి మండలంలోని ముచ్చింపుల గ్రామంలో రూ. 10 లక్షలతో సిసి రోడ్ల పనులతో పాటు గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా పెద్ది మాట్లాడుతూ మండలంలోని దశాబ్ద కాలంగా గ్రామాల్లో గుంతలు, మట్టి రోడ్ల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి కెసిఆర్ అంతర్గత సిసి రోడ్ల నిర్మాణానికి రూ.29 కోట్లను కేటాయించగా వాటితో గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. నర్సంపేట నియోజకవర్గంలోని యాసంగి పంటకు ఎస్సారెస్పీ కాలువల ద్వారా సాగుకు నీరు అందిస్తారన్నారు. ప్రతి ఎకరాకు సాగు నీరు అందించడం కోసం రంగయ్య చెరువును రిజర్వాయర్‌గా రీడిజైన్ చేయడంతోపాటు పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. పాఖాల చెరువులోకి గోదావరి జలాల పైపులైన్ల ద్వారా నీరు మళ్ళించేందుకు రూ. 2.80 కోట్లకు ప్రతిపాదనలు పంపించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వాలు రైతుల పంట కాలువ రిపేర్లు పేరుతో కోట్ల రూపాయలను గడించారని ఆరోపించారు. రైతులను సంఘటితం చేసేందుకు నర్సంపేటలోని టిఎస్‌ఐఎస్ ఆధ్వర్యంలో మెగ ఫుట్ పాత్ కేంద్రం ఎర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు పెద్ది సుదర్శన్‌రెడ్డి చెప్పారు. అభివృద్ధి చేసుకునేందుకు అన్ని వర్గాల ప్రజలు ముందుండాలని అన్నారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోనునట్లు పెద్ది వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి బానోతు సారంగపాణి, వైస్ ఎంపిపి పాలేపు రాజేశ్వర్‌రావు, సర్పంచ్ సునిత,సంతోష్, అధికారులు హరిప్రసాద్, రాజిరెడ్డి, ఊడుగుల ప్రవీన్, మోహన్‌రెడ్డి, రవి, మల్లయ్య, కోటి, రామారావు, శ్రీనివాస్ గుప్తా, రాజు తదితరులు పాల్గొన్నారు.