వరంగల్

సంఘటితంగా పోరాడి సమస్యలు పరిష్కరించుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఏప్రిల్ 4: కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై సంఘటితంగా పోరాడి రైల్వే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించుకుందామని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్ జాతీయ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య అన్నారు. సోమవారం నగరంలోని హరితహోటల్‌లో దక్షిణ మధ్యరైల్వే ఎంప్లాయిస్ సంఘ్ డివిజనల్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. గత రెండు నెలల్లోపు కార్మికుల సమస్యలు పరిష్కరించినట్లయితే కార్మికులంతా దేశ వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. 7వ పే కమిషన్ వెంటనే అమలు చేయాలని, డాక్టర్ ఆక్ట్రాయిడ్ ఫార్ములా ఆధారంగా 26వేల కనీస వేతనాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత కొంతకాలంగా ఎస్ ఎస్‌సి, జె ఎస్‌సిలకు ప్రమోషన్లు రావడం లేదని, తక్షణమే ఆ కేటగిరిలో ఉన్నవారందరికి ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాజీపేటలో ఏర్పాటు చేయదలచిన వ్యాగన్ పరిశ్రమ ఎందుకు వెనక్కి వెళ్లిందని ఆయన ప్రశ్నించారు. తాను గతంలో ఇదే ఫ్యాక్టరీని కరీంనగర్ జిల్లా మనోరమలో ఏర్పాటు చేయాలని, అందుకోసం 40 ఎకరాల్లో స్థలసేకరణ కూడా జరిగిందని, అయితే వ్యాగన్ పరిశ్రమ కాజీపేటలోనే అనువైన ప్రాంతమని తమ కార్మికుల ముందు వచ్చిన విజ్ఞప్తి మేరకు మనోరమ నుండి కాజీపేటకు వ్యాగన్‌షెడ్ మార్పుకు తాము అంగీకారం తెలిపినప్పటికి ఇంతవరకు ఇక్కడ వ్యాగన్‌షెడ్ ఏర్పాటు కాలేదన్నారు. ప్రధానమంత్రి మోడి అధికారంలోకి వస్తే ఏటా కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇంత వరకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్న ప్రధాని మోడి కార్మికుల చట్టాలను కుదిస్తున్నాడని విమర్శించారు. ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వేలో అనేక కొత్త రైల్వేస్టేషన్లు ఏర్పాటు చేసినా అందుకు తగినట్లుగా సిబ్బందిని నియమించకపోవడం వల్ల కార్మికులకు పనిభారం ఎక్కువైందని, తక్షణమే ఖాళీలను భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రెండు నెలల్లోపు తమ డిమాండ్లను పరిష్కరించనట్లయితే జులై 11 నుండి దేశ వ్యాప్తంగా నిర్వహించతలపెట్టిన సమ్మెకు కార్మికులంతా సిద్ధంగా ఉండాలని ఆయన కోరారు. సమావేశంలో పలువురు ఎంప్లాయిస్ సంఘ్ డివిజన్ నాయకులు, స్థానిక నాయకులు, రైల్వే కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.