వరంగల్

మెరుగైన సేవల కోసమే బయోమెట్రిక్ అమలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వడ్డేపల్లి,మార్చి 9: ప్రభుత్వ ఆసుపత్రులలో మరింత మెరుగైన సేవలందించేందుకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రతినిధులు, రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రిలయన్స్ ఫౌండేషన్ వారు ధర్మసాగర్, కనపర్తి, ఐనవోలులోని ప్రాథమిక కేంద్రాలను అభివృద్ధిపరచి మాతా, శిశు సేవలను మరింత మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకొవాలని అన్నారు. పట్టణ, ఆరోగ్య కేంద్రాలలో కావలసిన ల్యాబ్ సంబంధిత పరికరాలు, రసాయనాలు జరుగుతుందని, ప్రాథమిక ఆరోగ్య, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. బయోమెట్రిక్ అమలుతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడానిక వీలు అవుతుందని అన్నారు.

ఒసి కార్పొరేషన్
ఏర్పాటుకు ఒత్తిడి తెండి
టిడిపి నేత రేవంత్‌రెడ్డికి వినతిపత్రం
పరకాల, మార్చి 9: ఓసిలైన రెడ్డి, వెలమ, వైశ్య, బ్రాహ్మణ, మార్వాడి తదితర కులాల్లోని నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింప చేసే విధంగా, ఓసిల స్థితిగతుల అధ్యయానికి చట్టబద్ధతతో కూడిన ప్రత్యేక కమిషన్ ఏర్పాటు, ఓసి పేదల సంక్షేమానికి ఓసి కార్పొరేషన్ ఏర్పాటు చేసి సంవత్సరానికి రూ. 3వేల కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటుచేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకరావాలని కోరుతూ ఓసి వరంగల్ రూరల్ జిల్లా కన్వీనర్ కొలుగూరి రాజేశ్వర్‌రావు ఆధ్వర్యంలో తెలంగాణ టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు రేవంత్‌రెడ్డికి వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా గురువారం కొలుగూరి మాట్లాడుతూ కుల, మత ప్రాతిపదికన కాకుండా ఓసి కుల వర్గీయులైన పేదలతో పాటు అన్ని కులాల్లోని పేదల అర్థిక స్థితిగతుల ఆధారంగా విద్య, వైద్య, ఉద్యోగ, ఉపాధి, సంక్షేమ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించి సమన్యాయం చేయాలన్నారు.