వరంగల్

అర్హులకే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాటారం, మార్చి 16: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్‌ల ఇండ్లు అర్హులైన వారికే అందిస్తామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఆకునూరి మురళి స్పష్టం చేశారు. గురువారం కాటారం మండలంలోని బయ్యారం, విలాసాగర్, కాటారం గ్రామాలలో జిల్లా కలెక్టర్ మురళి సుడిగాలి పర్యటన చేశారు. అత్యంత పేదరికంలో మగ్గుతున్నవారికి పథకంలో ప్రథమ ప్రాధాన్యమిస్తామని అన్నారు. బయ్యారంలో డబుల్ బెడ్ రూమ్‌ల ఇండ్లు నిర్మించనున్న ప్రతిపాదిత ప్రదేశాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో కలెక్టర్ ముచ్చటించారు. అర్హతకలిగి, ఎంపికైన లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను త్వరిత గతిన పూర్తి చేయడానికి ముందుకురావాలని సూచించారు. అలాగే సంబంధిత ఇంజనీరు అధికారులు లబ్ధిదారులకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని కలెక్టర్ అన్నారు. అనంతరం కాటారం మండల కేంద్రంలో ఎస్టీ బాలుర ఆశ్రమ పాఠశాల సమీపంలోగల సంచార జాతుల నివాస ప్రాంతాన్ని కలెక్టర్ మురళీ ఆకస్మికంగా పరిశీలించారు. కాగా 498 సర్వేనెంబర్‌లో గల ప్రభుత్వ భూమిలో 54 మందికి రెండు గుంటల భూమిని ప్రభుత్వం ఇచ్చింది. ఇందులో అర్హత గల వారికి డబుల్ బెడ్ రూమ్‌లను ఇవ్వనున్నట్లు కలెక్టర్ మురళీ ప్రకటించారు. సంచార జాతులలో ఎల్లమ్మవాళ్లు, బడుగు బలహీన వర్గాలకు చెందిన తెగలకు చెందిన వారు ఉండగా వారికి ప్రభుత్వ నిబంధనల మేరకు డబుల్ బెడ్‌రూంలు ఇచ్చేందుకు కృషి చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ మురళీ తెలిపారు. శంకరంపల్లిలో బుడగ జంగాలకు చెందిన సమూహంలో కలెక్టర్ పర్యటించారు. వారి బతుకు చిత్రాన్ని చూసిన కలెక్టర్ చలించిపోయారు. అనంతరం విలాసాగర్‌లో 195 సర్వే నెంబర్ భూమిలో 23 మందికి రెండు ఎకరాల స్థలంలో డబుల్ బెడ్ రూమ్‌లు ఇవ్వడానికి మొదటి దఫాలో లబ్ధిదారుల జాబితా రూపొందించారు. ఎంపికైన జాబితాలలో లబ్ధిదారుల స్థితిగతులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అయన వెంట కాటారం మండల తహశీల్దారు పాలకుర్తి మాధవి, రెవెన్యూ పరిశీలకుడు వినయ్‌సాగర్, వీఆర్వో తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.

కాటారం, మార్చి 16: కాటారం మండలంలో గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఆకునూరి మురళి సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా విలాసాగర్ గ్రామం శివారులో పూరి గుడిసెలో నివసిస్తున్న నిరుపేద మహిళను చూసిన జిల్లా కలెక్టర్ ఆకునూరి మురళీ చలించిపోయారు. మైనార్టీ వర్గానికి చెందిన బీ పాషా షబ్బీర్ అనే మహిళ వద్ద కారు ఆపి దిగి, వారి పూరి గుడిసెలోకి వెళ్ళి జిల్లా కలెక్టర్ మురళి స్వయంగా టీ (తేనీరు) పెట్టించుకొని, తానే స్వయంగా గ్లాసులలో పోసుకొని టీ సేవించారు. బీ పాషా కుటుంబ పరిస్థితిని ఆరా తీసిన కలెక్టర్ మురళి ఆమె కుటుంబానికి వెంటనే గ్యాసు కనెక్షన్‌ను మంజూరు చేశారు. అలాగే నియమ నిబంధనల మేరకు డబుల్ బెడ్ రూమ్ కూడా ఇప్పిస్తానని జిల్లాకలెక్టర్ మురళి బీపాషా కుటుంబానికి హామీ ఇచ్చారు. దీంతో బీపాషా కుటుంబం సంతోషం అవధుల్లేకుండా పోయంది.
డబుల్ బెడ్ రూమ్‌లలో అర్హులైన వారికే కేటాయించాలని, ఇందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఎంపిక జాబితా తయారుచేయాలని సూచించారు. ఆయన వెంట తహాశీల్దారు పాలకుర్తి మాధవి, విలాసాగర్ సర్పంచ్ సబితాసాగర్‌రావు, వినయ్‌సాగర్ ఉన్నారు.

అకాల వర్షంతో
మిర్చి రైతు అతలాకుతలం
మహాదేవపూర్, మార్చి 16: మహాదేవపూర్, పలిమల మండలాల్లో గురువారం అకాల వర్షం కురియడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం శ్రమించి చేతికి వచ్చే సమయంలో వడగళ్ల వానతో మిర్చి పంట వేసిన రైతులు లబోదిబోమంటున్నారు. భారీ వర్షంతో మిర్చి కళ్లాల్లో ఆరబెట్టిన మిర్చి తడిసి పోయింది. దీంతో రైతన్న దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. మండలంలోని బొమ్మాపూర్, మహాదేవపూర్, సూరారం, బ్రాహ్మణపల్లి, అంబడిపల్లి, సర్వాయిపేట, బేగులూర్ గ్రామాల్లోని భారీ వర్షానికి మిర్చి పంట తడిసి పోయింది. అకాలంగా వచ్చిన భారీ వర్షంతో కళ్లాల్లో ఉన్న మిర్చిపై పాలిథిన్ కవర్లు కప్పినా ఈదురు గాలులకు లేచి పోయి మిర్చి తడిసి పోయినట్లు రైతులు వాపోతున్నారు.