వరంగల్

పరీక్షా సమయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, మార్చి 17: పదో తరగతి పరీక్షలు మహబూబాబాద్ జిల్లాలో మొదటి రోజు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయి. పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ప్రీతిమీనా తనిఖీ చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీస్ బందోబస్తు పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఎమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. మొదటి రోజు పదో తరగతి పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 10129మంది విద్యార్థులలో 10086మంది విద్యార్థులు హాజరయ్యారు. 43మంది విద్యార్థులు మాత్రం గౌర్హాజరయ్యారు. మొదటి రోజు ఎలాంటి మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని జిల్లా కలెక్టర్ ప్రీతిమీనా తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా 8మంది ఉన్నతాధికారులు వివిధ పరీక్షా కేంద్రాలను సందర్శించారని తెలిపారు. 23మంది ఫ్లైయింగ్‌స్క్వాలడ్‌లతో పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. కలెక్టర్ వెంట విద్యాశాఖ సహాయ సంచాలకులు బలరాం, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
చికిత్స పొందుతూ ఆసుపత్రి నుండి పరీక్ష హాజరు
సంగెం: విద్యార్థిని అనారోగ్యంతో ఆసుపత్రి పాలై చికిత్స పొందుతూ ఆసుపత్రి నుండి పదో తరగతి పరీక్షకు హాజరైన సంఘటన సంగెం మండలంలో జరిగింది. మండలంలోని కాట్రపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠాశాలలో పదో తరగతి చదువుతున్న ధర్మారపు కావ్య తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో చికిత్స కోసం ఎంజిఎంనకు తరలించారు. చికిత్స పొందుతూ ఆసుపత్రి నుండి ఐవి క్యాన్లతో శుక్రవారం కావ్య పరీక్షకు హాజరయ్యంది. తెలుగు ప్రథమ పరీక్షకు ముగ్గురు విద్యార్థులు గైర్హాజరైనట్లు మండల విద్యా శాఖ అధికారి బ్రహ్మయ్య తెలిపారు. సంగెం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠాశాలలో ఎ, బి సెంటర్లలో 510మందికి 507 విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు తెలిపారు.