వరంగల్

జనగామను ఆరోగ్య జిల్లాగా తీర్చిదిద్దుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనగామ టౌన్, మార్చి 25: జనగామను ఆరోగ్య జిల్లాగా తీర్చిదిద్దుకునేందుకు అన్నివర్గాల ప్రజలతో పాటు స్వచ్ఛంద సంస్థలు సహకరించాలని జిల్లా వైద్యాధికారి హరీష్‌రాజ్ కోరారు. మార్కెట్ శాఖ ఆధ్వర్యంలో శనివారం జనగామ వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డి ఎం అండ్ హెచ్‌వో హరీష్‌రాజ్ ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి మార్కెట్ చైర్‌పర్సన్ బండ పద్మ అధ్యక్షత వహించగా హరీష్‌రాజ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జనగామను ఆరోగ్య జిల్లాగా తీర్చిదిద్దుకునేందుకు బృహత్తర కార్యక్రమాన్ని రూపొందించిందన్నారు. జిల్లాలోని ప్రతి ఇంటిని సందర్శించి కుటుంబసభ్యుల ఆరోగ్య వివరాలను సేకరించేందుకు గృహ సందర్శన కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రతి వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని కంప్యూటీకరణ చేసి వారు పాటించాల్సిన ఆరోగ్య పద్ధతులను సమాచార రూపంలో అందచేయనున్నట్లు తెలిపారు. ప్రధానంగా క్యాన్సర్, టిబి, బిపి, గుండె సంబంధిత వ్యాధులపై పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమం కోసం గ్రామాలకు వచ్చే వైద్య సిబ్బందికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
అనంతరం మార్కెట్ చైర్‌పర్సన్ బండ పద్మ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నాడని అన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు వారి ఆరోగ్య పరిరక్షణ కోసం మార్కెట్ శాఖ వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తుందని అన్నారు. కరవు ప్రాంత రైతులు పాడి పరిశ్రమపై దృష్టి సారించాలని కోరారు. ఆధునిక పద్ధతులు పాటించి దిగుబడులను పెంచాలని సూచించారు. అనంతరం డాక్టర్ కర్ణాకర్‌రాజు, శ్యాంసుందర్‌ల ఆధ్వర్యంలో సుమారు 150మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్‌చైర్మన్ నామాల బుచ్చయ్య, టిఆర్‌ఎస్ పట్టణాధ్యక్షుడు బండ యాదగిరిరెడ్డి, మార్కెట్ కార్యదర్శి సంతోష్‌కుమార్, డైరెక్టర్లు ఉడుగుల నర్సింహులు, పోతుగంటి రమాదేవిసిద్ధయ్య, కారింగుల రాంచంద్రారెడ్డి, చాంద్‌పాషా, రమేష్, భాస్కర్‌రెడ్డి, భాగ్యమ్మ, సూపర్‌వైజర్లు వీరబాబు, రాజు పాల్గొన్నారు.