వరంగల్

ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ ఎత్తివేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, మార్చి 25: శాసనసభలో బిజెపి ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలని బిజెపి మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు యాప సీతయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం బిజెపి, బిజెవైఎంల ఆధ్వర్యంలో స్థానిక ఫారెస్ట్ ఆఫీస్ సెంటర్‌లో రాస్తారోకో నిర్వహించి అనంతరం కెసిఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా యాప సీతయ్య మాట్లాడుతూ.. బిజెపి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం సిఎం నీచపాలనకు నిదర్శనమన్నారు. చలో అసెంబ్లీ కార్యక్రమం అడ్డుకునేందుకే కెసిఆర్ చేసిన కుట్రలో భాగం ఇది అన్నారు. అసెంబ్లీలో తమ పాలనను ఎండగడుతారేమో అనే భయంతో ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడన్నారు. సిఎం కుయుక్తులు తమ ఎదుట నిలువవన్నారు. కెసిఆర్ కుట్రలను భగ్నం చేస్తూ బిజెపి, బిజెవైయం కార్యకర్తలు పెద్ద ఎత్తున హైదరాబాద్ తరలివెళ్లారని అన్నారు. ఇలాంటి అక్రమ అరెస్ట్‌లతో బిజెపి ఉద్యమాలను ఆపలేరన్నారు. రానున్న రోజుల్లో బిజెపి చేతిలో టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఓటమి తప్పదన్నారు. 2019ఎన్నికల్లో బిజెపి జెండా ఎగరడం ఖాయం అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి బి.బి రాఘవులు, కోశాధికారి శ్యాంసుందరశర్మ, బిజెవైయం జిల్లా అధ్యక్షుడు సిరికొండ సంపత్, జిల్లా ఉపాధ్యక్షులు పల్లె సందీప్, పట్టణ అధ్యక్షుడు దిడ్డి మహేష్, రాధపటేల్, మంద కృష్ణ, రాధాకృష్ణ, రమేష్, పృద్విరాజ్, వేణుమాధవ్ తదితరులు పాల్గొన్నారు.