వరంగల్

వ్యవసాయ రంగం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోవిందరావుపేట, మార్చి 25: వ్యవసాయం రంగం పట్ల తెలంగాణా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, రైతులకు కనీస గిట్టుబాటు ధర కల్పించడంలో తెలంగాణా ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతుందని రైతుసంఘం రాష్ట్ర నాయకులు సూడి క్రిష్ణారెడ్డి దుయ్యబట్టారు. మండలంలోని పస్రా గ్రామంలో శనివారం వంక రాములు అద్యక్షతన రైతు సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రైతు సంఘం రాష్ట్ర నాయకులు సూడి క్రిష్ణారెడ్డి, జిల్లా నాయకులు తుమ్మల వెంకటరెడ్డిలు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ రంగంపై పక్కా ప్రణాళిక లేకుండా తెలంగాణా ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తూ రైతు నడ్డివిరిచే చర్యలను చేపడుతోందని విమర్శించారు. లక్షా 49వేలకోట్ల బడ్జెట్‌లో ఈ యేడాడి 5900కోట్లు మాత్రమే కేటాయించి గత సంత్సరం కంటే 400 కోట్ల రూపాయలను తక్కువగా కేటాయించడమే రైతుల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తుందని వారు తెలిపారు. మిర్చి పండించిన అన్నదాతలు గిట్టుబాటు ధర రాక చేసిన అప్పులు తీర్చే దారిలేక ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి నేడు నెలకొందని అన్నారు. ఇకనైన ప్రభుత్వం మిర్చికి 15వేల రూపాయల గిట్టుబాటు ధర కల్పించాలని వారు డిమాండ్ చేశారు. పత్తికాకుండా అపరాలు పండించాలని విస్తృత ప్రచారం చేసిన పాలకులు కంది, సోయాబీన్‌పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేక పోతోందని అన్నారు. అన్నదాతల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదని వారు తెలిపారు. పోడు భూములలో అటవీశాఖ అధికారులు వేస్తున్న ఫెన్సింగ్‌ను తొలంగించి 2005 అటవీహక్కు చట్టం ప్రకారం పోడు భూములకు హక్కులు కల్పించాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రైతు సంఘం నాయకులు వర్కపురం సారయ్య, సామ మల్లారెడ్డి, జయేందర్‌రెడ్డి, గుండు రామస్వామి, కాప కోటేశ్వర్‌రావు, సిప్పిడి ఆదిరెడ్డి, సూర్యనారాయణ, గఫూర్, నర్సింహులు, తీగల ఆదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తెరాస సభ్యత్వం
ఒక సామాజిక గౌరవం
* తెరాస ఎసీ టసెల్ అధ్యక్షుడు ప్రవీణ్‌నాయక్
మహబూబాబాద్, మార్చి 25: తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యత్వం కలిగి ఉండడం ఒక సామాజిక గౌరవంగా ప్రజలు భావిస్తున్నారని అందుకే పెద్ద సంఖ్యలో ప్రజలు సభ్యత్వాలు స్వీకరిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి ఎస్టీ సెల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ భూక్య ప్రవీణ్‌నాయక్ అన్నారు. మానుకోటలోని 27వ వార్డులో తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రవీణ్‌నాయక్ మాట్లాడుతూ.. ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితి పట్ల పూర్తి ఆదరణ ప్రదర్శిస్తున్నారన్నారు. అందుకు కారణం అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే భారతదేశం గర్వించే స్థాయిలో సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్ర సమితి ప్రవేశపెట్టిందని తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజల కోసం కావాల్సిన పథకాలను ప్రవేశపెట్టడమే కాక వాటిని పూర్తిస్థాయిలో అమలు చేస్తున్న ఘనత తెరాస ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రానున్న రోజుల్లో మరెన్నో గొప్ప పథకాలను రాష్ట్రంలో అమలు చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి సాధించిన కెసిఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ నిర్మాణం జరుగుతుందన్నారు. సభ్యత్వ నమోదులో మహబూబాబాద్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రభాగాన నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ భూక్య లక్ష్మి, పార్వతి, రాములు, కిషోర్, లాలు, రాంకొఠి, బిక్య తదితరులు పాల్గొన్నారు.

సభ్యత్వ నమోదులో
ప్రథమంగా నిలవాలి
* టిఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు ఇన్‌చార్జి నాగుర్ల
కేసముద్రం, మార్చి 25: టిఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదులో నాయకులు క్రీయాశీలకంగా పనిచేసి మహబూబాబాద్ జిల్లాలో కేసముద్రం మండలాన్ని ప్రథమ స్థానంలో నిలపాలని సభ్యత్వ నమోదు ఇన్‌చార్జి నాగుర్ల వెంకటేశ్వర్లు సూచించారు. శనివారం మండలంలో పార్టీ సభ్యత్వ నమోదుపై మండల నాయకులతో సమీక్ష నిర్వహించిన అనంతరం విలేఖరులతో మాట్లాడారు. కేసముద్రం మండలానికి 12 వేల సభ్యత్వ నమోదు కోసం ఇప్పటికే పుస్తకాలు అందించామని, వీటికి తోడుగా మరో 12 వేల సభ్యత్వ నమోదుకు పుస్తకాలు ఇస్తామన్నారు. మండల వ్యాప్తంగా మొత్తంగా 20 వేల సభ్యత్వాలు చేయించి సరికొత్త రికార్డు నెలకొల్పాలని పిలుపునిచ్యారు. సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు ఉచిత ప్రమాద బీమా సౌకర్యం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మోడెం రవీందర్‌గౌడ్, రాష్ట్ర పార్టీ కార్యదర్శి బీరవెళ్లి భరత్‌కుమార్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మెన్ బండారు వెంకన్న, మాజీ జడ్పీటిసి కదిరె సురేందర్, మర్రి నారాయణరావు, నజీరహ్మద్, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు మండల కేంద్రంలో మార్కెట్ వైస్ చైర్మెన్ ఓలం చంద్రమోహన్ నేతృత్వంలో పార్టీ నాయకులు ఇంటింటికీ తిరిగి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.