వరంగల్

గిరిజన వితంతువు గుడిసె కూల్చివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాటారం, మార్చి 25: పేదలకు, ఇళ్ళు లేని వారికి ఇళ్ళు కట్టిస్తామని ఓ వైపు ప్రభుత్వం ప్రకటిస్తుండగా, అందుకు విరుద్ధంగా అధికారులు వ్యవహరిస్తున్న తీరు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో చోటుచేసుకుంది. కాటారం తహాశీల్దారు పాలకుర్తి మాధవి తన సిబ్బందితో శుక్రవారం మండలంలోని మేడిపల్లికి వెళ్ళి గిరిజన వితంతువు గుడిసెను నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారు. ఈ ఘటనపై బాధితులు శనివారం ఉదయం విలేఖరులతో మాట్లాడారు. కాటారం మండలం అంకుసాపూర్ పంచాయతీ పరిధిలోని మేడిపల్లి శివారులోని సర్వేనెంబర్ 100లో గత 1992లో రెండు ఎకరాల ఐదు గుంటల ప్రభుత్వ అసైన్డ్ భూమిని ప్రొసీడింగ్ నెంబర్ బి / 1377 / 92 ప్రకారం రెవెన్యూ అధికారులు గుండ్ల సమ్మక్కకు పత్రాలు అందజేశారు. కాగా బి / 30 / 2010 తేదీ11-07-2010 ప్రకారంగా సదరు భూమిని గుండ్ల సమ్మక్క పేరిట ఖాతానెంబర్ 166 ద్వారా పట్టాదారు పాసు పుస్తకాన్ని అప్పటి రెవెన్యూ అధికారులు అందజేశారు. గుండ్ల సమ్మక్క భర్త నర్సయ్య, నర్సయ్య తండ్రి పోచయ్యలు ఇరువురు మృతి చెందడంతో వారసురాలిగా సమ్మక్క పేరిట పట్టాదారుగా కాస్తులో పేరు ఎక్కించారు. సదరు భూమిలో ఆరు నెలల కిందట సమ్మక్క పూరి గుడిసెను ఏర్పాటుచేసుకొని, వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పూరి గుడిసెలో సమ్మక్కతో పాటు సమ్మక్క అత్త దమ్మక్క, అవివాహితుడైన కుమారుడు, భర్త చనిపోయిన కూతురు బీసుల శ్యామల, శ్యామల కూతురు (మనుమరాలు) మొత్తం ఐదుగురు వ్యక్తులు పూరి గుడిసెలో నివాసం ఉంటున్నారు. కాగా తాజాగా శుక్రవారం సాయంత్రం కాటారం మండల తహాశీల్దారు పాలకుర్తి మాధవి తన సిబ్బంది చేత మేడిపల్లికి వెళ్ళి సమ్మక్క పూరి గుడిసె నిబంధనలకు విరుద్ధంగా ఉందని పేర్కొంటూ కూల్చివేశారు. తాము దశాబ్దాల తరబడి ఈ భూమిలో వ్యవసాయం చేసుకుంటూ, పూరి గుడిసెలో కాలం వెళ్ల దీస్తున్నామని సమ్మక్క దీనంగా తన గోడు వెళ్ళబోసుకుంది. కాళ్లా వేళ్ళా పట్టుకున్నా తహాశీల్దారు పాలకుర్తి మాధవి కనికరించలేదని బాధితురాలు భోరున విలపించింది. దాంతో గిరిజన వితంతువులు నివసిస్తున్న పూరి గుడిసె కూల్చివేతతో సమ్మక్క కుటుంబం బజారున పడింది. మరోప్రక్క డబ్బులు ముట్టజెప్పితే సదరు భూమిని క్రమబద్దీకరిస్తామని కొందరు రెవెన్యూ అధికారులు చెప్పినట్లు బాధితులు ఆరోపించారు.
తహాశీల్దారు వివరణ
కాటారం మండలం మేడిపల్లిలోని 100 సర్వే నెంబర్‌లో గల భూమి ప్రభుత్వానికి సంబంధించినదని తహాశీల్దారు పాలకుర్తి మాధవి తెలిపారు. సదరు భూమి అసెన్డ్ భూమి కావడంతో గుండ్ల సమ్మక్క పేరిట ఫోర్జరీ సంతకంతో దొంగ పాసు పుస్తకాలు సృష్టించుకున్నారని పేర్కొన్నారు. అసైన్డ్భూమి కమిటీ ఏలాంటి తీర్మాణం చేయలేదని వివరించారు. లంచం మాటకు ఆస్కారం లేదని తేల్చారు. సదరు భూమిని ప్రభుత్వ భవనాలకు, ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించనున్నట్లు తహశీల్దార్ పాలకుర్తి మాధవి విలేకరులకు తెలిపారు.

అంతర్ రాష్ట్ర మార్కెట్‌కు తరలుతున్న ఎర్రబంగారం

నల్లబెల్లి, మార్చి 25: గిట్టుబాటు ధరకోసం మిర్చిని రైతులు అంతర్రాష్ట్ర మర్కెట్‌కు తరలిస్తున్నారు. గత వారం రోజులుగా నల్లబెల్లి మండలంలోని వివిధ గ్రామాల రైతులు లారీల్లో మిర్చిని తీసుకుని అమ్ముకొని వస్తున్నారు. వరంగల్ మార్కెట్‌లో గిట్టుబాటు ధర పలుకకపోవడం, ఈరోజు పలికిన ధర మరుసటి రోజు నిలకడగా లేకపోవడం వంటి కారణాలతోదూరమెనా అంతర్ రాష్ట్ర మార్కెట్‌కు వెళ్లేందుకు రైతన్నలు వెనుకాడడం లేదు.
నర్సంపేట రెవెన్యూ డివిజన్‌లోని నల్లబెల్లి మండలంలోపాటు చుట్టుపక్కల గ్రామాల రైతులు మిర్చి పంట సాగుపై ఎక్కువ మక్కువ చూపారు. ఈ తరుణంలో ఈ ఏడాది వాతావరణ మార్పులతో తెగుళ్లు, అకాల వర్షం వల్లరైతుకు భారీ నష్టం వాటిల్లింది. ఈ నేపధ్యంలో మిగిలి ఉన్న పంట దిగుబడిలో 60శాతం వరకు తాలు మిగిలింది. దీంతో మిర్చి రైతులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. అదే సమయంలో చేతికి వచ్చిన పంటకు గిట్టుబాటు ధర పలికితే ఎంతో కొంత మేరా పెట్టుబడి వస్తుందని అనుకొన్న రైతుకు మార్కెట్‌లో ధర పలుకకపోవడంతో అంతర్రాష్ట్ర మార్కెట్‌కు తరలిస్తున్నారు. వరంగల్ ఎర్ర బంగారం తేజా రకానికి క్వింటాల్ ధర 6వేల నుండి 7వేలు వరకు ఉండగా అదే నాగపూర్‌లో రూ: 8500నుండి 9వేలు పలుకుతుందని రైతులు పేర్కొంటున్నారు.
అంతర్రాష్ట్ర మార్కెటైన నాగపూర్‌కు తరలిస్తే ఎక్కువ ఖర్చులు కావా అని ప్రశ్నిస్తే అక్కడకు వెళ్తే రవాణాతో సహా బస్తాకు 2వందల నుండి మూడువందల వరకు ఖర్చు వస్తుందని చెప్పారు.
ఒకవేళ వరంగల్‌కు వెళ్లినా అదే ఖర్చు అవుతుందని వివరించారు. వరంగల్‌కు ఈరోజు మంచి ధర పలికిందని మరునాడు సరుకు తీసుకోని వెళ్తే ధర తగ్గుతుందని ఇప్పటికే నర్సంపేట డివిజన్‌లోని దుగ్గొండి, కొండాయిలపల్లి, రంగాపురం మేడపల్లి రుద్రగూడెం, నారక్కపేట గ్రామాల నుండి రైతులు నాగపూర్ మార్కెట్‌కు మిర్చిని తరలిస్తూంటారని చెప్పారు. ఏదిఏమైనా మిర్చి పంట సాగుకు పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని కన్నీరు మున్నీరుగా రైతులు ఆవేదనను వెలిబుచ్చారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం, స్పందించి మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నారు.

ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయాలి

వరంగల్, మార్చి 25: ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయటంతోపాటు తక్కువ ధరలతో అవసరమైన మందులు ప్రజలకు అందుబాటులో చేయటం ద్వారా ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులను నియంత్రించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. శనివారం సుందరయ్య భవన్‌లో జరిగిన సిఐటియు జిల్లాస్థాయి సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరైన రాజారావు మాట్లాడుతు రాష్ట్రంలో 63శాతం ప్రజలు వైద్యం కోసం అప్పులు చేస్తుండగా, 12.6శాతం వైద్యం కోసం ఆస్తులు అమ్ముకుంటున్నారని చెప్పారు.
వైద్యం ఖర్చులు భరించకలేక 24శాతం మంది దివాళా తీస్తున్నారని, వైద్యం చేయించుకునేందుకు వెనకాడుతున్నారని ప్రపంచ బ్యాంకు నివేదిక ద్వారా తెలుస్తోందని అన్నారు. ఈ వైద్యభారంతో దళితులు, గిరిజనులు, బలహీనవర్గాల కుటుంబాలు అప్పులలో కూరుకుపోతున్నారని, దీనికి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల వైఖరి కారణమని, దిగజారుతున్న వైద్యానికి, ఆరోగ్యానికి ప్రభుత్వ బాధ్యతవహించటం లేదని విమర్శించారు. వైద్యరంగాన్ని ప్రభుత్వం బలోపేతం చేయాలని, కార్పొరేట్ వైద్యాన్ని నియంత్రించాలని, ప్రభుత్వ రాయితీలు పొందే అన్ని కార్పొరేటు ఆసుపత్రులలో పేదలకు ఉచిత వైద్యసేవలు అందించేలా నిబంధనలు అమలు చేయాలని డిమాండ్ చేసారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయాలని కోరారు. హక్కుల పరిరక్షణకు కార్మిక, ప్రజాపోరాటాలను రాష్ట్రప్రభుత్వం నిర్బంధంగా అణచివేస్తోందని ఆరోపించారు. సిఐటియు జిల్లా నాయకుడు యాదానాయక్ అధ్యక్షతన ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు రాగుల రమేష్, నాగేశ్వర్‌రావు, లింగయ్య, ఎం.డి.మహబూబ్‌పాషా తదితరులు పాల్గొన్నారు.

అక్రమ అరెస్ట్‌లు దారుణం

మంగపేట, మార్చి 25: మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి తరలివెళ్ళిన వారిని అక్రమంగా అరెస్ట్‌లు చేయడం దుర్మార్గపు చర్యగా భారతీయ జనతా పార్టీ మంగపేట మండల అధ్యక్షులు గాజుల కృష్ణ అన్నారు. శనివారం మండల కేంద్రమైన మంగపేటలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో గాజుల కృష్ణ మాట్లాడుతూ అధికార టిఆర్‌ఎస్ పార్టీ ఓట్ల కోసం మతపరమైన రిజర్వేషన్లు అంటూ డ్రామాలాడతోందని విమర్శించారు. మతపరమైన రిజర్వేషన్ల వలన ప్రజలలో మతపర విద్వేషాలను రగిలించాలని టిఆర్‌ఎస్ ప్రభుత్వం చూస్తుందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మతపరమైన రిజర్వేషన్ల ప్రక్రియ నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
బ్రాహ్మణులకు జిల్లా కలెక్టర్
బహిరంగ క్షమాపణ చెప్పాలి
బ్రాహ్మణ వర్గాలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన భూపాలపల్లి జిల్లా కలెక్టర్ బ్రాహ్మణ వర్గాలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని బిజెపి మంగపేట మండల అధ్యక్షుడు గాజుల కృష్ణ డిమాండ్ చేశారు. జిల్లా మొదటి పౌరుడిగా బాధ్యత గల ప్రభుత్వ అధికారి హోదాలో ఉన్న కలెక్టర్ ఆకునూరి మురళి వీధులలో మైకులు పట్టుకుని కులాల గురించి మాట్లాడడం సరైన పద్ధతి కాదన్నారు. హిందువులు దైవత్వంగా భావించి ధరించే మాలాధారణపై జిల్లా కలెక్టర్ అవహేళనగా మాట్లాడడం యావత్తు హిందూ జాతిని కించపరిచినట్లేనని అన్నారు. బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడిన జిల్లా కలెక్టర్ బ్రాహ్మణులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనియెడల బిజెపి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మంగపేట మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గాజుల కృష్ణ, ఎర్రంగారి వీరేన్ కుమార్, బియంఎస్ నాయకులు పాకనాటి వెంకటరెడ్డి, బాలగాని కొమరయ్య, బేత శ్రీనివాసరావు, జానకి రావు, మేకల రాందాస్, మద్దిని కృష్ణ, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.